iDreamPost
android-app
ios-app

నగరవాసులకు మాల్స్‌ కొత్త కాదు.. అయినా లులుకి ఇంత క్రేజ్‌ ఎందుకంటే

  • Published Oct 03, 2023 | 1:56 PMUpdated Oct 03, 2023 | 1:56 PM
  • Published Oct 03, 2023 | 1:56 PMUpdated Oct 03, 2023 | 1:56 PM
నగరవాసులకు మాల్స్‌ కొత్త కాదు.. అయినా లులుకి ఇంత క్రేజ్‌ ఎందుకంటే

హైదరాబాద్‌ లులు మాల్‌ క్రేజ్‌ చూస్తే పిచ్చేక్కి పోతుంది. సెప్టెంబర్‌ 27న ఈ మాల్‌ ఓపెన్‌ చేశారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ సమీపంలో ఈ మాల్‌ ఉంది. నగరంలో మొదటిసారిగా లులు గ్రూప్ ఈ మాల్‌ను ప్రారంభించింది. ఇక మాల్‌ ఒపెనింగ్‌ రోజు నుంచే జనాలు పోటెత్తారు. ఇక లాంగ్‌ వికెండ్‌ కలిసి రావడంతో.. శని, ఆదివారాలు మాల్‌లో ఇసుకు వేస్తే రాలనంత జనం. ఒక్కసారిగా జనాలు మాల్‌కి పోటెత్తడంతో.. కూకట్‌పల్లి ప్రాంతంలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన లులు మాల్‌కు సంబంధించిన వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ లులు మాల్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్‌ చేయడంతో.. దీనిపై విపరీతమైన క్రేజ్‌ పెరిగింది.

ఇక లులు మాల్‌లో రద్దీ ఎలా ఉంది అంటే ఎస్కిలేటర్‌ ఎక్కాలంటే క్యూలో నిల్చోవాలి. తోసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఏ ఫ్లోర్‌లో చూసినా విపరీతమైన రద్దీ. అసలు లోపల ఉన్న వాళ్లకు ఊపిరి ఎలా ఆడుతుందో అర్థం కానట్లుగా ఉంది. ఇక నిత్యవసరాలు, ఫుడ్‌ సెక్షన్‌లో అయితే జనాలు.. కుంభమేళాను తలపించారు. ఇదే సందుగా కరువు బ్యాబ్‌ చేతులకు, నోటికి పని చెప్పారు.

ఇష్టా రాజ్యంగా నచ్చిన ఫుడ్‌ తిని.. ప్యాకెట్స్‌ అక్కడే పడేసి వెళ్లారు. కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌ బ్యాటిల్స్‌ ఒపెన్‌ చేసి.. సగం తాగి ర్యాక్‌ల్లో పడేశారు. మాల్‌లో పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే.. ఎన్నో రోజులుగా తిండి దొరకని వాళ్ల ముందు పంచభక్ష్య పరమన్నాలు పెడితే ఎలా ఎగబడతారో.. అలా ఎగబడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కాస్త డీసెంట్‌గా బీహేవ్‌ చేయండి అంటున్నారు ఈ వీడియోలు చూసిన నెటిజనులు.

లులు మాల్‌కు ఇంత క్రేజ్‌ ఎందుకంటే..

నగరవాసులకు మాల్స్‌ సంస్కృతి కొత్త కాదు. ఇప్పటికే నగరంలో జీవీకే, ఫోరంమాల్‌, ఇనార్బిట్‌ మాల్‌, పీవీఆర్‌ ఐమాక్స్‌, నెక్ట్స్‌ గలేరియా, అశోక 1, డీమార్ట్‌, రత్న దీప్‌, మోర్‌, జియో మార్ట్‌.. ఇలా నగరంలో ఎన్నో మాల్స్‌ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. లులు మాల్‌కి ఎగబడ్డట్లు.. ఏ మాల్‌కి ఎగబడలేదు జనాలు. మరి లులు మాల్‌కి ఇంత క్రేజ్‌ ఉండటానికి కారణం ఏంటంటే.. గ్రాండ్‌ ఓపెనింగ్‌లో భాగంగా భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటించారు. ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ మీద కూడా పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించారు. ఇక నిత్యవసరాలు, పండ్లు, కూరగాయలు, చిరుతిళ్లు, మాంసం ఉత్పత్తులు, బట్టలు, చెప్పులు, కిచెన్‌, బెడ్రూం, ఎలక్ట్రానిక్స్‌ ఇలా ప్రతి అవసరానికి సంబంధించిన ఉత్తత్తులు అన్ని ఒకే చోట దొరకడం కూడా రద్దీకి కారణమని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి