iDreamPost

వంటగ్యాస్ తక్కువ ధరకే కావాలా? మే 30 లోపు ఇలా చేయండి! లాస్ట్ ఛాన్స్!

మీకు ప్రధాన మంత్రి యోజన పథకం కింద గ్యాస్ తీసుకున్నారా. అయితే మీకు సబ్సిడీ వస్తుందని తెలుసు కదా. ఇటీవల రూ. 200 సబ్సిడీని మూడు వందలకు పెంచింది. వంటగ్యాస్ తక్కువ ధరకే కావాలా ఈ పని చేయాల్సిందే.

మీకు ప్రధాన మంత్రి యోజన పథకం కింద గ్యాస్ తీసుకున్నారా. అయితే మీకు సబ్సిడీ వస్తుందని తెలుసు కదా. ఇటీవల రూ. 200 సబ్సిడీని మూడు వందలకు పెంచింది. వంటగ్యాస్ తక్కువ ధరకే కావాలా ఈ పని చేయాల్సిందే.

వంటగ్యాస్ తక్కువ ధరకే కావాలా? మే 30 లోపు ఇలా చేయండి! లాస్ట్  ఛాన్స్!

ఒకప్పుడు కట్టెల పొయ్యితోనే వంటలు చేసే వాళ్లు మహిళలు. దీంతో కట్టె పుల్లలు సైతం  వ్యాపారంగా మారి.. కట్టల కోసం అడవులను కూడా తెగ నరికారు. అలాగే ఈ కట్టల పొయ్యిలు వాడటం వల్ల మహిళలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో పొగ లేని వంటిల్లును చూడాలని 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని తీసుకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటంబాల మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందిస్తోంది. దీని కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించడంతో పాటు ఏటా 12 గ్యాస్ సిలిండర్లను ఇస్తోంది. అలాగే. .రూ. 300 సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ సబ్సిడీ పొందాలంటే.. ఇకేవైసీ తప్పని సరి.

దీంతో గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఇకేవైసీ వివరాలు అప్టేట్ చేయించుకోవాలని చెబుతున్నాయి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, గ్యాస్ కంపెనీలు. మే 30వ తేదీ చివరి గడువు విధించాయి. ఆలోగా ఇకేవైసీ చేయించుకుంటే.. గ్యాస్ సబ్సిడి పొందొచ్చు. గ్యాస్ కంపెనీలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్లో కూడా కేవైసీ చేసుకునే వెసలు బాటు ఉంది. హెపీ, భారత్, ఇండన్ గ్యాస్ ఏజెన్సీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. https://www.mylpg.in/ వెబ్ సైట్‌కు వెళ్లాలి. అక్కడ కుడి భాగంలో గ్యాస్ సిలిండర్ పిక్చర్స్ ఉంటాయి. మీది ఏ గ్యాస్ కనెక్షన్ అయితే.. దానిపై క్లిక్ చేసి.. కేవైసీ అప్డేట్ అని ఫారం కనిపిస్తుంది. అందులో కస్టమర్ మొబైల్ నంబర్, కస్టమర్ నంబర్, ఎపీజీ ఐడీ నింపాలి. ఆధార్ ధ్రువీకరణ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే కేవైసీ పూర్తయినట్లే.

ఇక మాకు ఆన్ లైన్ తెలియదు కంపెనీకి వెళతాము అనుకుంటే.. వెళ్లొచ్చు. ఏమేమీ కంపెనీ వద్దకు తీసుకెళ్లాలంటే.. ఆధార్ కార్డు వివరాలు అందించి.. బయోమెట్రిక్ ఆధారంగా అప్డేట్ చేయించుకోవచ్చు. ఒక వేళ ఎలాంటి అప్డేట్ లేకుంటే.. సబ్సీడీ రాకపోగా.. గ్యాస్ కనెక్షన్లు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లలేని సీనియర్ సిటిజన్ల సంగతి ఏంటనుకుంటున్నారు. వారి కోసం గ్యాస్ డెలివరీ ఏజెంట్లు వస్తారు. వారే ఇంటికి వచ్చి కేవైసీ తీసుకుంటారు. మొబైల్ యాప్ ద్వారా ఈ అప్డేట్ చేస్తారు. ప్రస్తుతం మే 30 వరకు మాత్రమే ఇకేవైసీని అప్డేట్ చేసుకునేందుకు గడువునిచ్చింది కేంద్రం. అంటే ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరెందుకు ఆలస్యం ముందుగా ఇకేవైసీ చేయించుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి