iDreamPost

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఈ రేషన్‌ కార్డు ఉంటే.. రూ.425కే గ్యాస్ సిలిండర్‌..

  • Published Sep 02, 2023 | 2:18 PMUpdated Sep 02, 2023 | 2:18 PM
  • Published Sep 02, 2023 | 2:18 PMUpdated Sep 02, 2023 | 2:18 PM
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఈ రేషన్‌ కార్డు ఉంటే.. రూ.425కే గ్యాస్ సిలిండర్‌..

గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా.. ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్‌ ఏది అంటే.. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు. కేంద్ర ప్రభుత్వం.. గ్యాస్‌ ధరలను తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్‌ నెల ప్రారంభంలో.. చమురు కంపెనీలు 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉజ్వల యోజన కింద గ్యాస్‌ సిలిండర్‌ ధర మీద ఏకంగా 400 రూపాలయ సబ్సిడీ లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 425 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ను ప్రజలకు అందించనుంది. కాకపోతే ఓ కండీషన్‌ పెట్టింది. ఇంతకు అది ఏంటంటే..

గోవా సర్కార్‌ ఈ బంపరాఫర్‌ ప్రకటించింది. ఈమేరకు సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఓ ప్రకటన చేశారు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు మాత్రమే కాక.. గోవా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా మరో రూ. 275 మేర సబ్సిడీ అందిస్తామని ప్రకటించారు. అంటే మొత్తంగా 475 రూపాయల తగ్గింపు వర్తించనుంది. అయితే ఈ ఆఫర్‌ అందరికి వర్తించదు. కేవలం అంత్యోదయ అన్నా యోజన రేషన్‌ కార్డులు ఉన్న వారు మాత్రమే దీనికి అర్హులు. దీని ద్వారా సుమారు 11 వేల మందికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో సుమారు 11 వేల మంది అంత్యోదయ అన్నా యోజన రేషన్ కార్డుదారులు ఉన్నారు.

గోవా సీఎం ప్రకటన మేరకు ఈ రేషన్ కార్డు కలిగిన వారికి రూ. 475 మేర సబ్సిడీ లభిస్తుంది. ప్రస్తుతం గోవాలో గ్యాస్‌ సిలిండర్ ధర రూ. 903 వద్ద ఉంది. ప్రభుత్వం ప్రకటించని తగ్గింపు తర్వాత.. అంత్యోదయ రేషన్‌ కార్డు కలిగిన వారికి ఉజ్వల స్కీమ్ కింద రూ. 425 గ్యాస్ సిలిండర్ లభించనుంది. ఇక ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధరలను గమనిస్తే.. రూ. 960 వద్ద ఉన్నాయి. రెగ్యులర్ కస్టమర్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. అదే ఉజ్వల స్కీమ్‌లో ఉన్న వారికి అయితే సిలిండర్ ధర ఇంకా తగ్గుతుంది. వీరికి రూ. 760కే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి