iDreamPost
android-app
ios-app

సీలింగ్ ఫ్యాన్ రెక్కలు క్లీన్ చేయడం కష్టంగా ఉందా? ఐతే దీంతో ట్రై చేయండి!

  • Published Jul 29, 2024 | 6:56 PM Updated Updated Jul 29, 2024 | 6:56 PM

Ceiling Fan, Ceiling, Show Lights, Cupboards Cleaning Brush: చేతికి అందేంత ఎత్తులో ఉన్న వస్తువుల మీద ఉన్న దుమ్ము దులపాలంటే నిమిషాల పని. పైగా అంత శ్రమ అనిపించదు. కానీ నెత్తి మీద ఉన్న సీలింగ్ ఫ్యాన్ ని శుభ్రం చేయాలంటేనే కష్టంతో కూడుకున్న పని. అయితే ఈ ఫ్యాన్ క్లీనర్ బ్రష్ తో మీరు మీ పనిని సులువుగా చేసుకోవచ్చు.

Ceiling Fan, Ceiling, Show Lights, Cupboards Cleaning Brush: చేతికి అందేంత ఎత్తులో ఉన్న వస్తువుల మీద ఉన్న దుమ్ము దులపాలంటే నిమిషాల పని. పైగా అంత శ్రమ అనిపించదు. కానీ నెత్తి మీద ఉన్న సీలింగ్ ఫ్యాన్ ని శుభ్రం చేయాలంటేనే కష్టంతో కూడుకున్న పని. అయితే ఈ ఫ్యాన్ క్లీనర్ బ్రష్ తో మీరు మీ పనిని సులువుగా చేసుకోవచ్చు.

సీలింగ్ ఫ్యాన్ రెక్కలు క్లీన్ చేయడం కష్టంగా ఉందా? ఐతే దీంతో ట్రై చేయండి!

గాలి కోసం తలుపులు తీసినప్పుడు దాంతో పాటు దుమ్ము రావడం అనేది సహజం అని అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఒకటి ఉంటుంది. నిజ జీవితంలో జరిగేవే డైలాగ్స్ గా పుట్టుకొస్తాయి. చాలా మందికి నచ్చని పదం డస్ట్. నేల మీద పడిన దుమ్ము అంటే ఈజీగా దులిపేయవచ్చు. అదే సీలింగ్ మీద, ఫ్యాన్ మీద, ఫ్యాన్ రెక్కల మీద మనకి అందనంత ఎత్తులో ఉన్న వాటి మీద ఉన్న దుమ్ముని దులపాలంటే ఎంత కష్టమో టేబుల్స్, కుర్చీలు ఎక్కి అందీ అందని హైట్ లో దులిపేందుకు ప్రయత్నించే వారికే తెలుస్తుంది. దులపడానికి అవ్వదు. కొంతమంది చీపురుతో దులిపే ప్రయత్నం చేస్తారు కానీ సరిగా క్లీన్ అవ్వదు. కొంచెం ఎత్తున్న టేబుల్స్ వేసుకున్నా గానీ ఫ్యాన్ రెక్కలు క్లీన్ చేయడానికి అవ్వదు.

అసలు ఎలాంటి టేబుల్స్, కుర్చీలు వేసుకోకుండా నిలుచున్న చోటు నుంచే సులువుగా ఫ్యాన్ రెక్కలు శుభ్రం చేసుకునే బ్రష్ ఒకటి ఉంది. ఈ బ్రష్ తో ఫ్యాన్, ఫ్యాన్ రెక్కలతో పాటు ఏసీని, కప్ బోర్డ్స్ ని, సీలింగ్ ని, సోఫా వంటి వాటిని శుభ్రం చేసుకోవచ్చు. ఫెదర్ మెటీరియల్ తో వస్తున్న కారణంగా ఇది ఈజీగా దుమ్ము, ధూళిని శుభ్రం చేస్తుంది. 30 నుంచి 100 అంగుళాల వరకూ విస్తరించుకునేలా పోల్ ని ఇచ్చారు. షోకేస్ లైట్లను కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని ఉతుక్కోవడం కూడా సులువే. ఇందులో పలు రకాల కంపెనీలకు చెందిన బ్రష్ లు ఉన్నాయి. మైక్రోఫైబర్, స్టెయిన్ స్టీల్ పోల్ తో వస్తుంది. ఫ్యాన్ రెక్కలను సులువుగా క్లీన్ చేసేలా ఇది బెండ్ అవుతుంది.

ఫ్యాన్ రెక్కల సైజులో దీన్ని బెండ్ చేసి ఈజీగా దుమ్ము దులుపుకోవచ్చు. ఎలా కావాలంటే అలా కన్వీనెంట్ గా బెండ్ అవుతుంది. దీని వల్ల మీకు శ్రమ అనేది ఉండదు. పైగా నిచ్చెనలు ఎక్కే శ్రమ ఉండదు. డస్టర్ బ్రష్ ని పోల్ నుంచి తీసేయచ్చు. తీసి ఉతికేసుకుని మళ్ళీ ఎటాచ్ చేసుకుని వాడుకోవచ్చు. కంపెనీని బట్టి 174 రూపాయల నుంచి 300 రూపాయల వరకూ ఉన్నాయి. మామూలుగా అయితే వీటి అసలు ధరలు 1000 రూపాయలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆఫర్ నడుస్తుంది కాబట్టి తక్కువ ధరకు వస్తున్నాయి.