iDreamPost
android-app
ios-app

LIC కస్టమర్లకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి!.. లేదంటే నష్టపోతారు!

LIC Shareholders: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. వెంటనే ఈ పని చేసుకోవాలని సూచించింది. లేదంటే నష్టపోతారు. ఇంతకీ ఏం చేయాలంటే?

LIC Shareholders: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. వెంటనే ఈ పని చేసుకోవాలని సూచించింది. లేదంటే నష్టపోతారు. ఇంతకీ ఏం చేయాలంటే?

LIC కస్టమర్లకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి!.. లేదంటే నష్టపోతారు!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ. దేశ ప్రజల కోసం అద్భుతమైన ప్లాన్స్ ను తీసుకొచ్చి అమలు చేస్తున్నది. కోట్లాది మంది కస్టమర్లు, పాలసీదారులతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో పెట్టుబడి పెట్టేవారికి గ్యారంటి రిటర్స్స్ పొందొచ్చు. ఎటువంటి రిస్క్ ఉండదు. ఎల్ఐసీ ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రవేశపెడుతున్నది. ఈ క్రమంలో ఎల్ఐసీ తన కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఎల్ఐసీ షేర్ హోల్డర్స్ వెంటనే ఈ పని చేయండి. లేదంటే నష్టపోతారు. ఇంతకీ ఎల్ఐసీ కస్టమర్లు ఏం చేయాలంటే?

ఎల్ఐసీ పలు రకాల సేవలను అందిస్తూ ఉంటుంది. అయితే ఈ సేవలను పొందేందుకు వాటికి సంబంధించిన రూల్స్ గురించి కస్టమర్లు అవగాహన కలిగి ఉండాలి. ఈ క్రమంలో ఎల్ఐసీ షేర్ హోల్డర్స్ చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. అదేంటంటే? షేర్ హోల్డర్స్ పాన్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను అప్ డేట్ చేసుకోవాలని కోరింది. లేదంటే షేర్లపై టీడిఎస్ ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి ఎల్ఐసీ జులై 5న ఓ ప్రకటన విడుదల చేసింది. ఎల్ఐసీ తన షేర్ హోల్డర్స్ కు రూ. 10 ముఖ వాల్యూ ఉన్న ఒక్కో షేరుపై రూ. 6 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. అయితే ఈ డివిడెండ్ పై టీడీఎస్ కట్ కావొద్దంటే పాన్, బ్యాంక్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. డివిడెండ్ అంటే ఒక కంపెనీ లేదా కార్పోరేషన్ ఆర్జించిన లాభాల్లో కొంత భాగాన్ని వాటాదారులకు పంచేదే డివిడెండ్.

డివిడెండ్‌ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 లోపు ఉంటే టీడీఎస్‌ ఉండదని తెలిపింది. ఒకవేళ పాన్‌ వివరాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాలు చెల్లకపోయినా డివిడెండ్‌పై 20 శాతం టీడీఎస్‌ కట్‌ చేసేకునే అవకాశం ఉందని వెల్లడించింది. వాటాదార్లు తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ల దగ్గర బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి చెక్ చేసుకోవాలని ఎల్‌ఐసీ కోరింది. 2024, జులై 19 నాటికి ఎల్ఐసీ షేర్లు కలిగి ఉన్న షేర్‌హోల్డర్స్‌ డివిడెండ్స్‌కు అర్హులు. బ్యాంక్ ఖాతా వివరాలు అప్‌డేట్ చేయని వారు వాటిని 2024, జులై 19 సాయంత్రం 5 గంటల లోపు డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో అప్‌డేట్ చేయాలి. దీంతో డివిడెండ్లు నేరుగా షేర్ హోల్డర్స్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.