iDreamPost
android-app
ios-app

ఒక్కసారి కడితే చాలు.. 40 ఏళ్ల నుంచే నెలకు రూ. 20 వేలు పొందవచ్చు

  • Published Sep 20, 2023 | 1:52 PM Updated Updated Sep 20, 2023 | 2:10 PM
  • Published Sep 20, 2023 | 1:52 PMUpdated Sep 20, 2023 | 2:10 PM
ఒక్కసారి కడితే చాలు.. 40 ఏళ్ల నుంచే నెలకు రూ. 20 వేలు పొందవచ్చు

ఒంట్లో సత్తువ ఉన్నన్ని రోజులు కష్టపడి పని చేస్తాం.. కుటుంబాన్ని పోషిస్తాము. మరి వృద్ధాప్యంలో.. పని చేద్దామని భావించినా.. చేయడానికి శరీరం సహకరించదు. ఆ సమయంలో నెలకు ఎంతో కొంత స్థిరమైన ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోకపోతే.. ముసలితనంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకప్పటిలా.. కొడుకులు పోషిస్తారని నమ్మకంగా ఉండే రోజులు కావివి. అందుకే ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే వృద్ధాప్యం గురించి ఆలోచించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా పెన్షన్‌ ప్లాన్లకు డిమాండ్‌ పెరిగింది. మారుతున్న అవరసరాలకు తగ్గట్టుగానే ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం కొత్త కొత్త పెన్షన్ ప్లాన్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి ప్లాన్స్‌ విషయంలో ఎల్‌ఐసీ ముందంజలో ఉంటుంది. ఇక తాజాగా ఎల్‌ఐసీ ఒక ప్లాన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా.. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే.. ఏకంగా 40 వ ఏట నుంచే ప్రతి నెలా 20 వేల రూపాయల పెన్షన్‌ పొందవచ్చు. ఆ స్కీమ్‌ ఏంటి అంటే..

ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్‌ ప్లాన్‌..

తాజాగా ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. అయితే ఇది పాత ప్లానే.. దానికి కొన్ని కొన్ని మార్పులు చేసి పెన్షన్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఇది సింగిల్‌ ప్రీమియం పాలసీ. అంటే ఒక్కసారి ప్రీమియం మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్లాన్‌లో చేరడానికి కనీస వయస్సు 40 ఏళ్లు. గరిష్ట వయస్సు 80 ఏళ్లుగా ఉంటుంది. పాలసీలో ప్రీమియం చెల్లించిన మొదటి ఏడాది నుంచే యాన్యుటీ అంటే పెన్షన్ లభిస్తుంది. ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో కనీస యాన్యుటీ నెలకు రూ.1,000 పొందేలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ట యాన్యుటీకి ఎలాంటి పరిమితి లేదు.

ఉదాహరణకు.. ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులో.. ఒకేసారి 10 లక్షల రూపాయల ప్రీమియం చెల్లించి.. ఈ ప్లాన్‌ తీసుకున్నాడు అనుకుందాం. ఇక అతడు యాన్యుటీ వార్షిక పద్దతిని ఎంచుకుని ఆప్షన్‌ 1 సెలక్ట్‌ చేసుకుంటే.. పాలసీ హోల్డర్‌కు ఏటా రూ. 64,350 యాన్యుటీ లభిస్తుంది. అంటే నెలకు సుమారు రూ.5,300 పెన్షన్ లభిస్తుంది. రెండో ఆప్షన్‌ ఎంచుకున్నట్లయితే పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ లభిస్తుంది.

సీనియర్‌ సిటిజన్లు, రిటైర్మెంట్‌ సమయంలో భారీ మొత్తంలో డబ్బు వచ్చిన వారిని దృష్టిలో పెట్టుకుని.. ఎల్‌ఐసీ ఈ ప్లాన్‌ తీసుకువచ్చింది. రిటైర్మెంట్‌ సమయంలో డబ్బులు వచ్చిన వారు.. ప్రతీ నెల ఆదాయం కావాలనుకుంటే ఈ ప్లాన్‌ తీసుకొవచ్చు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి.. ఒకేసారి 40 లక్షల సింగిల్‌ ప్రీమియం చెల్లించి ఈ ప్లాన్‌ తీసుకున్నారనుకుందాం. అప్పుడు వారికి ఏటా రూ.2,40,000 పైనే యాన్యుటీ లభిస్తుంది. అంటే నెలకు సుమారు రూ.20 వేల పెన్షన్ పొందొచ్చు. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీ హోల్డర్ మరణిస్తే మొదట చెల్లించిన ప్రీమియం నామినీకి లభిస్తుంది.