iDreamPost

ఆడపిల్లల తల్లిదండ్రులకు బెస్ట్‌ స్కీమ్‌.. రోజుకు150 పొదుపుతో రూ.31 లక్షలు

కూతురు పుట్టిందంటే ఖర్చు అని భావిస్తుంటారు తల్లిదండ్రులు. ఆమె చదువుతో పాటు వివాహానికి కూడా చాలా డబ్బులు అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కానీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆ దిగులు అవసరం లేదు. ఓ మహత్తరమైన ప్లాన్ మీ ముందే ఉంది.

కూతురు పుట్టిందంటే ఖర్చు అని భావిస్తుంటారు తల్లిదండ్రులు. ఆమె చదువుతో పాటు వివాహానికి కూడా చాలా డబ్బులు అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కానీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆ దిగులు అవసరం లేదు. ఓ మహత్తరమైన ప్లాన్ మీ ముందే ఉంది.

ఆడపిల్లల తల్లిదండ్రులకు బెస్ట్‌ స్కీమ్‌.. రోజుకు150 పొదుపుతో రూ.31 లక్షలు

మనిషి మనుగడకు డబ్బు ఎంత అవసరమో, సేవింగ్స్ కూడా అంతే అత్యవసరం. ఆపద వచ్చినా, అవసరం అనుకున్న సమయంలో మనల్ని ఆదుకునేవి ఆ సేవింగ్సే. చాలా మంది వచ్చిన జీతం మొత్తం ఖర్చు పెట్టేస్తుంటారు. దాచడానికి ఏమీ మిగలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే చిన్న మొత్తాల్లో కూడా డబ్బు దాచుకోవచ్చు అని చెబుతున్నాయి పలు సంస్థలు. ఒకే సారి పెట్టుబడి పెట్టకుండా.. నెలకో లేదా మూడు, ఆరు నెలలకు అది కుదరదు అనుకుంటే.. ఏడాదికి ఒకసారి సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్నీ ఇస్తున్న కంపెనీల్లో ఒకటి లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ముందు స్థానంలో ఉంటుంది. తక్కువ మొత్తంలో ఎక్కువ ఆదాయాన్ని అందిస్తూ.. దేశంలోనే నమ్మకమైన సంస్థగా వెలుగొందుతుంది. ఎల్ఐసీ కస్టమర్లకు అద్భుతమైన పాలసీలను అందిస్తున్న సంగతి విదితమే.  ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకు వచ్చింది

ఆడ పిల్లను భారంగా భావిస్తుంటారు చాలా మంది. ఆమె చదువుకు అయ్యే ఖర్చుతో పాటు.. పెళ్లి చేయాలంటే మరింత భారంగా భావిస్తుంటారు. చదువుకన్నా.. ఆమెకు వివాహానికే ఖర్చు ఎక్కువ పెడుతుంటారు. పెళ్లి సమయానికి డబ్బులు అందకపోతే.. ఎన్నో వివాహాలు పీటలు మీదే ఆగిపోయిన ఘటనలున్నాయి. దీంతో కుటుంబమంతా తలదించుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి తల్లిదండ్రులు ఎదుర్కొకుండా ఉండేందుకు ఎల్ఐసీ మంచి ప్లాన్ తీసుకు వచ్చింది. అదే ఎల్ఐసీ కన్యాదాన్. పాప పుట్టినప్పుడే ప్లాన్ చేసుకుంటే.. ఆమె వివాహ సమయానికి డబ్బులు చేతికి వస్తాయి. నెలకు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటే.. మెచ్యూరిటీ సమయానికి లక్షల డబ్బు వస్తుంది. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.

ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ కాల పరిమితి 25 ఏళ్లు ఉంటుంది. కానీ మీరు 22 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మూడేళ్లు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియంలో చేరాలంటే తండ్రి వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. కూతురు వయస్సు సంవత్సరం దాటితే ఈ పథకానికి అర్హులు. కూతురు వయస్సును బట్టి కాల పరిమితిని తగ్గించుకోచుకునే అవకాశం ఉంది. కన్యాదాన్ పాలసీని తీసుకోవాలనుకుంటే.. ఏదైనా ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి డెవలప్‌మెంట్ అధికారిని సంప్రదించవచ్చు. లేదంటే ఆ సంస్థ ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. ఈ పథకాన్ని తీసుకోవడానికి కూతురు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ధృవీకరణ పత్రం,తల్లిదండ్రులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ట్ పోర్టు సైజ్ ఫోటోల, బ్యాంక్ పాస్ బుక్ తప్పనిసరి.

ఈ పథకంలో రోజుకు 151 రూపాయలు చెల్లిస్తే.. 25 ఏళ్ల తర్వాత.. రూ. 31 లక్షలు పొందవచ్చు. ఇవి అమ్మాయి అవసరాలకు వినియోగించవచ్చు. చదువు, విదేశాల్లో ఉన్నత చదువులు, పెళ్లి, ఇతర అవసరాలకు అక్కరకు వస్తాయి. రోజుకు రూ. 151 చొప్పున.. నెలకు రూ.4530 పొదుపు చేయాలి. ప్రీమియం 22 ఏళ్ల పాటు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత 25 ఏళ్లు పూర్తయిన తర్వాత పాలసీ పూర్తవుతుంది. అప్పుడు రూ.31 లక్షలు పొందుతారు. లేకుంటే రోజుకు రూ.121 డిపాజిట్ చేస్తే అప్పుడు 27 లక్షల రూపాయలు వస్తాయి. ఇందులో బీమా కూడా వర్తిస్తుంది. పాలసీదారుడు మరణిస్తే ఇక కుటుంబం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా బీమా చేసినవారి తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు చెల్లిస్తుంది ఎల్ఐసీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి