ఎల్ఐసీ తాజాగా ప్రవేశపెట్టిన పాలసీలో బీమా రక్షణతో పాటుగా.. పొదుపు ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ పాలసీలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఈ పాలసీకి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఎల్ఐసీ తాజాగా ప్రవేశపెట్టిన పాలసీలో బీమా రక్షణతో పాటుగా.. పొదుపు ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ పాలసీలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఈ పాలసీకి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
“ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు” అన్న పాటను అందరూ వినే ఉంటారు. అయితే కొందరు మాత్రం ఈ పాటలో ఉన్న అర్ధాన్ని అర్ధం చేసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు పాలసీలను కడుతూ ఉంటారు. ఇక పాలసీలు కట్టాలి అనుకునేవారికోసం ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అయితే వాటిల్లో మంచి కంపెనీలను అద్భుతమైన పాలసీలను ఎలా ఎన్నుకోవాలి? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అలాంటి వారికోసం సూపర్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చాంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC). ఈ ప్లాన్ ద్వారా ఇన్సూరెన్స్ తో పాటుగా మెచ్చూరిటీ నాటికి చేతికి ఒకేసారి రూ. 16 లక్షలు అందుకునే అవకాశం ఉంది. ఈ పాలసీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
LIC.. దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీగా పేరుగాంచింది. తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలతో ముందుకొస్తోంది. అయితే చాలా కంపెనీలు ఇస్తే ఇన్సూరెన్స్ ను లేదా పొదుపు చేసుకున్న మెుత్తాలను కస్టమర్లకు ఇస్తాయి. కానీ ఎల్ఐసీ తాజాగా ప్రవేశపెట్టిన పాలసీలో బీమా రక్షణతో పాటుగా.. పొదుపు ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ పాలసీలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఇంతకీ ఎల్ఐసీ అందిస్తోన్న ఆ సూపర్ ప్లాన్ పేరు.. ‘జీవన్ సరళ్’. ఇది నాన్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ.
ఈ పాలసీలో బీమా రక్షణతో పాటుగా సేవింగ్స్ కూడా చేతికి వస్తాయి. కస్టమర్ మరణిస్తే వచ్చే బెనిఫిట్స్ తో పాటుగా మెచ్యూరిటీ సమయంలో భారీ మెుత్తంలో డబ్బులు చేతికి వస్తాయి. జీవన్ సరళ్ ప్లాన్ లో పాలసీ దారుడు అకాల మరణం చెందితే.. ఆర్థిక రక్షణ ఇస్తుంది. టెర్మినల్ బోనస్ లు, సమ్ అష్యూర్డ్ ప్లస్ రివర్షరీ బోనస్ లు ఉంటాయి. ప్రీమియం చెల్లింపుల్లో సంవత్సరానికి, ఆరు నెలల, మూడు నెలలు లేదా నెలలా ప్రీమియం చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంది. జీవన్ సరళ్ పాలసీ తీసుకున్నవారు రోజుకు రూ. 182 చెల్లిస్తే.. మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ. 16 లక్షలు చేతికి వస్తాయి.
ఉదాహరణకు X అనే 30 సంవత్సరాల వ్యక్తి జీవన్ సరళ్ ప్లాన్ రూ. 10 లక్షలకు బీమా మెుత్తానికి తీసుకున్నాడు అనుకుందాం. అతడు ఈ పాలసీ కాలాన్నీ 20 ఏళ్లకు ఎంచుకుంటే.. 15 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 66 వేలు, నెలకు రూ. 5, 555, రోజుకు రూ. 185 చెల్లించాల్సి ఉంటుంది. మెుత్తం బీమా 10 లక్షలు అయితే.. బోనస్ గా రూ. 5.5 లక్షలు వస్తుంది. దీంతో పాలసీ ముగియగానే ఒకేసారి చేతికి ఏకంగా రూ. 16 లక్షలు వస్తుందన్న మాట. అయితే ఈ పాలసీకి సంబంధించి మరిన్ని వివరాలు మీకు దగ్గరలో ఉన్న ఎల్ఐసీ ఆఫీస్ లో అడిగి తెలుసుకోగలరు.