Dharani
పొదుపు చేయాలని భావిస్తున్నారా.. అది కూడా తక్కువ మొత్తంలో సేవ్ చేసి... భారీగా ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ బెస్ట్ పథకం గురించి చెప్పబోతున్నాం. ఆ వివరాలు..
పొదుపు చేయాలని భావిస్తున్నారా.. అది కూడా తక్కువ మొత్తంలో సేవ్ చేసి... భారీగా ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ బెస్ట్ పథకం గురించి చెప్పబోతున్నాం. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో ప్రతి ఒక్కరు పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తున్నారు. జీతం ఎంత తక్కువైనా సరే.. ఎంతో కొంత పొదుపు చేయడానికి రెడీ అవుతున్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంతో కొంత పొదుపు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. పోస్టాఫీసులు, బీమా సంస్థలు కూడా పొదుపు పథకాలను తీసుకువచ్చాయి. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు అన్ని వయసుల వారి అవసరాలకు తగ్గట్టుగా పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్దదైన బీమా సంస్థ ఎల్‌ఐసీ అద్భుతమైన పొదుపు పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో చేరి.. రోజుకు 45 రూపాయలు పొదుపు చేస్తే.. ఏకంగా రూ.25 లక్షలు పొందవచ్చు. ఆ వివరాలు..
దీర్ఘ కాలం పాటు చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ.. భారీ ఎత్తున ప్రయోజనం పొందాలనుకునేవారి కోసం ఎల్‌ఐసీ ఒక అద్భుతమైన పాలసీని అందుబాటులోకి తెచ్చింది. అదే జీవన్ ఆనంద్ పాలసీ. దీనిలో చేరి.. రోజుకు 45 రూపాయల చొప్పున పొదుపు చేస్తే.. 25 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ ప్లాన్‌లో చేరడం ద్వారా.. అనేక మెచ్చురిటీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇక ఈ పాలసీకి సంబంధించి గరిష్ట పరిమితి లేదు. కాకపోతే లక్ష రూపాయలు అందిస్తారు. ఈ ప్లాన్‌లో చేరితో రోజుకు 45 చొప్పున.. నెలకు 1,358 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా.. 25 లక్షల రూపాయలు పొందవచ్చు అంటున్నారు.
అయితే మీరు 25 లక్షల రూపాయల మొత్తాన్ని పొందాలంటే.. చాలా కాలం పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ పాలసీ కాలవ్యవధి 15-35 సంవత్సరాలు. అంటే మీరు పాలసీలో చేరి.. రోజుకు 45 చొప్పున్న ఏడాదికి 16,300 రూపాయలను 35 ఏళ్ల పాటు పొదుపు చేస్తే.. అప్పుడు మీకు ఇంత భారీ మొత్తంలో నగదు లభిస్తుంది. వాస్తవంగా ఈ పథకంలో చేరి రోజుకు 45 రూపాయల చొప్పున ఏడాదికి రూ.16, 300లను సుమారు 35 ఏళ్ల పాటు పొదుపు చేస్తే.. ఆ మొత్తం. 5,70,500 రూపాయలు అవుతుంది.
అయితే 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు 5 లక్షల రూపాయల హామీ మొత్తంతో పాటు మెచ్చూరిటీ తీరిన తర్వాత.. 8.60 లక్షల పునర్వ్యవస్థీకరణ బోనస్‌తో పాటుగా ఫైనల్ బోనస్‌గా మరో 11.50 లక్షల రూపాయల మొత్తాన్ని పొందుతారు. ఇక్కడ మీకున్న అదనపు ప్రయోజనం ఏంటి అంటే.. ఈ పాలసీ మీరు రెండు సార్లు బోనస్ పొందుతారు. అలా మొత్తంగా కలిపి ఈ పథకం ద్వారా మీరు 25 లక్షల రూపాయలు పొందవచ్చు అన్నమాట.