Nidhan
ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎల్ఐసీ ఏజెంట్లుగా మారే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే అక్కడితో ఆగకుండా బిలియనీర్‌గా ఎదిగారో వ్యక్తి. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎల్ఐసీ ఏజెంట్లుగా మారే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే అక్కడితో ఆగకుండా బిలియనీర్‌గా ఎదిగారో వ్యక్తి. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎల్ఐసీ ఏజెంట్లుగా మారే వాళ్లు చాలా మందే ఉన్నారు. కొందరు దాన్నే జాబ్‌గా చేసేవాళ్లూ ఉన్నారు. అయితే అక్కడితో ఆగకుండా బిలియనీర్‌గా ఎదిగారో వ్యక్తి. సాధించాలనే కోరిక ఉంటే లైఫ్‌లో దేన్నయినా అచీవ్ చేయొచ్చని ఆయన ప్రూవ్ చేశారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెనుదిరగకుండా తన ప్రయాణాన్ని కంటిన్యూ చేశారు. పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టినా వ్యాపారవేత్త అవ్వాలనే తన కలను చంపుకోలేదు. మొక్కవోని పట్టుదలతో మధ్యతరగతి నేపథ్యం నుంచి భారతదేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయనే సోనాలికా ట్రాక్టర్స్ అధినేత లక్షణ్దాస్ మిట్టల్. ఆయన విజయగాథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన దేశపు అత్యంత వృద్ధ బిలియనీర్లలో ఒకరు లక్ష్మణ్‌దాస్ మిట్టల్. ఆయన వయసు ఇప్పుడు 93 ఏళ్లు. కోట్ల విలువ చేసే వ్యాపార సామ్రాజ్యం, అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్న లక్ష్మణ్‌దాస్ ఈ స్థాయికి చేరేందుకు ఎంతగానో శ్రమించారు. గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న ఆయన.. ఆ తర్వాత ఇంగ్లీషులో ఎంఏ చేశారు. అనంతరం 1955లో ఎల్ఐసీ ఏజెంట్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఎల్ఐసీ సంస్థ ప్రారంభ ఏజెంట్లలో లక్ష్మణ్‌దాస్ ఒకరు కావడం గమనార్హం. కొన్నాళ్లు ఎల్ఐసీలో పని చేసిన ఆయన ఆ తర్వాత బిజినెస్ డ్రీమ్స్‌ను ఛేజ్ చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా 40 ఏళ్ల వయసులో తన సొంతూరిలో సోనాలికా పేరుతో థ్రెషర్‌లను తయారు చేయడం మొదలుపెట్టారు.
థ్రెషర్ బిజినెస్‌లో లక్ష్మణ్‌దాస్ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. లాసెస్ వల్ల 1970లో ఆయన కుటుంబం మొత్తం నికర విలువ రూ.1 లక్షకు పడిపోయింది. దీంతో దివాలా తీశాక ఆయన ఇతర పనులు చేశారు. మళ్లీ ధైర్యం, డబ్బులు కూడగట్టుకోవడానికి ఆయనకు పాతికేళ్లు పట్టింది. థ్రెషర్ వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గుణపాఠం నేర్చుకున్న లక్ష్మణ్‌దాస్.. వాటిని వదిలేసి ట్రాక్టర్లు రూపొందించడం బెటర్ అని ఆలోచించారు. అది ఆయన లైఫ్‌ను మార్చేసింది. 1995లో సోనాలికా గ్రూప్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల తయారీని స్టార్ట్ చేశారు. 1996లో మొదటి ట్రాక్టర్ విక్రయించారు లక్ష్మణ్‌దాస్. కొంతకాలంలోనే సోనాలికా ట్రాక్టర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత ట్రాక్టర్ల వ్యాపారంలో అతిపెద్ద బ్రాండ్లలో ఒకటిగా అది తన స్థానాన్ని పదిలపర్చుకుంది.
ట్రాక్టర్ల అమ్మకాల్లో ఇండియాలో 10 శాతానికి పైగా మార్కెట్ కలిగిన సోనాలికా.. అల్జీరియాలో 50 శాతం, నేపాల్-బంగ్లాదేశ్‌లో 20 శాతానికి పైగా మార్కెట్ కలిగి ఉంది. 150 కంటే ఎక్కువ దేశాలకు ఈ సంస్థ రూపొందించిన ట్రాక్టర్లు, వ్యవసాయ అనుబంధ పరికరాలు ఎగుమతి అవుతున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకారం లక్ష్మణ్‌దాస్ మిట్టల్ ఆస్తుల విలువ రూ.24,000 కోట్లు. సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేసిన ఆయన ఈ స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. 60 ఏళ్ల వయసులో ఆయన బిలియనీర్‌గా మారారు. అనుకున్న లక్ష్యాల్ని అందుకునేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తికి లక్ష్మణ్‌దాస్ మిట్టల్ జీవితం ఇన్స్పిరేషన్ అని చెప్పాలి.