nagidream
స్థలం కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ ఏరియాల్లో ల్యాండ్ రేట్లు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూముల రేట్లు తగ్గాయి. ఇప్పుడు కనుక ల్యాండ్ కొంటే తక్కువలో తక్కువ 3 లక్షల వరకూ డబ్బు ఆదా అవుతుంది.
స్థలం కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ ఏరియాల్లో ల్యాండ్ రేట్లు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూముల రేట్లు తగ్గాయి. ఇప్పుడు కనుక ల్యాండ్ కొంటే తక్కువలో తక్కువ 3 లక్షల వరకూ డబ్బు ఆదా అవుతుంది.
nagidream
గతంతో పోలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొద్దిగా డల్ అయ్యిందని నిపుణులు చెబుతున్న మాట వాస్తవమే. పలు రియల్ ఎస్టేట్ వెబ్ సైట్స్ డేటా ప్రకారం.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ల్యాండ్ రేట్లు తగ్గాయి. సికింద్రాబాద్ జోన్ లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ రేట్లు తగ్గాయి. మరి ఆ ఏరియాలు ఏంటో? అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో? ఎంత మేర స్థలాల రేట్లు తగ్గాయో అనే వివరాలు మీ కోసం.
సికింద్రాబాద్ జోన్ లో ఉన్న మల్కాజ్ గిరిలో గజం 60 వేల నుంచి 1 లక్ష రేంజ్ లో పలుకుతుంది. సైనిక్ పురిలో గజం 66 వేలుగా ఉంది. కౌకూర్ లో చదరపు అడుగు స్థలం రూ. 3800 నుంచి రూ. 3950 రేంజ్ వద్ద కొనసాగుతుంది. అంటే గజం రూ. 34 వేల నుంచి 36 వేల రేంజ్ లో ఉన్నాయి. బోయిన్ పల్లిలో స్థలాల ప్రారంభ ధర చదరపు అడుగు రూ. 3,300 ఉంటే.. సగటు ధర రూ. 7,500గా ఉంది. అంటే గజం రూ. 30 వేల నుంచి రూ. 68 వేల రేంజ్ లో కొనసాగుతుంది. ఇక మల్లాపూర్ లో చదరపు అడుగు రూ. 15000 పలుకుతుంది. కొన్ని చోట్ల అయితే ఏకంగా రూ. 30,000 పలుకుతోంది. కాప్రాలో చదరపు అడుగు స్ధలం రూ. 4,300 నుంచి 50 వేల రేంజ్ లో కొనసాగుతుంది. సగటు ధర రూ. 19 వేలుగా ఉంది.
కొంపల్లిలో గజం స్థలం 49 వేల నుంచి 79 వేలుగా ఉంది. సగటు ధర 62 వేలు ఉంది. గజం ధర అత్యధికంగా 79 వేలు, సగటున 64 వేలు, కనిష్ట ధర 49 వేలుగా ఉంది. ఏడాదిలో గరిష్ట ధర 11 శాతం పెరగగా, సగటు ధర 23 శాతం, కనిష్ట ధర 47 శాతం పెరిగింది. ఓవరాల్ గా ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 23 శాతం ధరలు పెరిగాయి.
మేడ్చల్ లో గరిష్టంగా గజం స్థలం ధర 35 వేలు ఉండగా.. సగటు ధర 27 వేలు ఉంది. కనిష్ట ధర 20 వేలుగా ఉంది. ఏడాదిలో గరిష్ట ధర కలిగిన ల్యాండ్ రేట్లు 4 శాతం పెరగగా.. సగటు ధర కలిగిన ల్యాండ్ రేట్లు 6 శాతం, కనిష్ట ధర కలిగిన ల్యాండ్ రేట్లు 8 శాతం పెరిగాయి. ఓవరాల్ గా ఈ ఏడాది భూముల రేట్లు 6 శాతం పెరిగాయి.
అల్వాల్ లో గరిష్టంగా గజం స్థలం 77 వేలు ఉంటే.. సగటు ధర 62 వేలు ఉంది. కనిష్ట ధర 47 వేలుగా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట ధర కలిగిన స్థలాల రేట్లు 3 శాతం తగ్గాయి. సగటు ధర కలిగిన స్థలాల రేట్లు 2 శాతం తగ్గాయి. కనిష్ట ధర కలిగిన భూముల రేట్లు 0.3 శాతం తగ్గాయి. ఓవరాల్ గా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్థలాల రేట్లు 2 శాతం తగ్గాయి. అంటే 150 గజాల స్థలం మీద దగ్గర దగ్గర 3 లక్షల 50 వేలు తగ్గుతుంది.
రాంపల్లిలో గజం స్థలం కనిష్టంగా 25 వేలు ఉంది. గరిష్టంగా 40 వేలు ఉంది. సగటు ధర 33 వేలు ఉంది. ఓవరాల్ గా ఇక్కడ ధరలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 శాతం తగ్గాయి. అంటే 150 గజాల స్థలం మీద 75 వేలు తగ్గుతుంది.
సికింద్రాబాద్ జోన్ లో కొన్ని ఏరియాల్లో భూముల రేట్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరగగా.. కొన్ని ఏరియాల్లో మాత్రం తగ్గాయి. మళ్ళీ ఈ భూముల రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.