SNP
K&R Rail Engineering, Share, Stock Market, Railway Shares: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారి కోసమే ఈ వార్త. మంచి లాభాలు తెచ్చిపెడుతున్న ఓ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
K&R Rail Engineering, Share, Stock Market, Railway Shares: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారి కోసమే ఈ వార్త. మంచి లాభాలు తెచ్చిపెడుతున్న ఓ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఈ మధ్య కాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్‌లో, షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి అదిరిపోయే ఆఫర్ ఇది. స్టాక్ మార్కెట్‌లో స్మాల్ క్యాప్ కేటగిరి రైల్వే సెక్టార్ స్టాక్ ‘కే అండ్ ఆర్ రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షేర్లు అదరగొడుతున్నాయి. లాభాల్లో వెళ్తూ పెట్టుబడిదారులకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ షేర్ ధర.464.60 వద్ద ట్రేడ్ అవుతోంది. రెండు ఏళ్ల క్రితం కేవలం రూ.25 వద్ద ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.464కు చేరుకుంది. అంటే రెండేళ్ల క్రితం ఓ 25 వేలు పెట్టి ఈ కంపెనీ షేర్లు కొని ఉంటే.. ఇప్పుడు రూ.4 లక్షలు అయ్యేవి. అయితే.. రెండేళ్ల కాలంలో మల్టిబ్యాగర్ రిటర్న్స్ అందించిన ఈ కంపెనీ.. తన ఇన్వెస్టర్లకు మరో బంపర్ ఆఫర్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
అదేంటంటే.. స్టాక్ స్ప్లిట్ చేస్తూ.. ఒక షేర్ కలిగి ఉన్న వారికి 10 ఫేర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారంటా.. ఇటీవలె జరిగని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్‌లో 1:10 రెషియోలో స్టాక్ స్ప్లిట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.10 ఫేస్ వ్యాల్యూ ఉన్న షేర్‌ను రూ.1 ఫేస్ వ్యాల్యూతో 10 ఈక్విటీ షేర్లుగా డివైడ్ చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమెదం తెలిపింది. దీనికి సంబంధించి త్వరలోనే రికార్డు ప్రకటించే అవకాశం ఉంది. ఈ షేరు 52 వారాల హైయొస్ట్ రేట్ రూ.863.35 కాగా.. లోయొస్ట్ రేట్ రూ.414గా నమోదైంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.954 కోట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్‌లో ఈ కే అండ్ ఆర్ రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షేర్లు షార్ట్ టర్మ్‌లో మంచి లాభాల బాట పట్టే అవకాశం ఉందని, ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడితే.. పెట్టుబడిదారులకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
K&R Rail Engineering Share Price pic.twitter.com/iMBOnp9iVX
— Sayyad Nag Pasha (@nag_pasha) August 11, 2024