iDreamPost
android-app
ios-app

Komaki XGT Classic: లక్ష 10 వేల రూపాయలకే కోమకి ఎక్స్జీటీ క్లాసిక్ బైక్.. సింగిల్ ఛార్జ్‌తో 90 కి.మీ.

  • Published Aug 14, 2024 | 9:28 PM Updated Updated Aug 14, 2024 | 9:28 PM

Best Bike Under Budget: బైక్ నడపాలంటే చాలా మందికి ఇష్టమే కానీ గేర్లు మార్చడం అంటే విసుగు వల్ల ఆ ఇష్టాన్ని అయిష్టంగా మలచుకుంటున్నారు. రాజీపడి స్కూటీలు తీసుకుంటే అవి మైలేజ్ ఇవ్వవు. మైలేజ్ రావాలి, బైక్ నడపాలి అంటే కనుక ఎలక్ట్రిక్ బైక్ ఒక్కటే ఆప్షన్. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ, కంఫర్ట్ కూడా ఎక్కువే.

Best Bike Under Budget: బైక్ నడపాలంటే చాలా మందికి ఇష్టమే కానీ గేర్లు మార్చడం అంటే విసుగు వల్ల ఆ ఇష్టాన్ని అయిష్టంగా మలచుకుంటున్నారు. రాజీపడి స్కూటీలు తీసుకుంటే అవి మైలేజ్ ఇవ్వవు. మైలేజ్ రావాలి, బైక్ నడపాలి అంటే కనుక ఎలక్ట్రిక్ బైక్ ఒక్కటే ఆప్షన్. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ, కంఫర్ట్ కూడా ఎక్కువే.

Komaki XGT Classic: లక్ష 10 వేల రూపాయలకే కోమకి ఎక్స్జీటీ క్లాసిక్ బైక్.. సింగిల్ ఛార్జ్‌తో 90 కి.మీ.

కొంతమందికి బైక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ స్కూటీలు ఇచ్చే కంఫర్ట్ బైకులు ఇవ్వవని చెప్పి చాలా మంది బైకుల వైపు వెళ్ళరు. ఆ గేర్లు మార్చుకోవడం.. ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎవరు పడతారు అని చెప్పి స్కూటీలు తీసుకుంటూ ఉంటారు. పోనీ స్కూటీలు ఏమైనా మైలేజ్ ఇస్తాయా అంటే ఇవ్వవు. ఇలాంటి సమయంలో బైక్ లవర్స్ కోసమే అన్నట్టుగా ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. గేర్లు మార్చే పని ఉండదు. ఎంత ట్రాఫిక్ లో అయినా స్కూటీని నడిపినట్టు కూల్ గా నడుపుకుంటూ వెళ్లిపోవచ్చు. పైగా పెట్రోల్ ఖర్చు అస్సలు ఉండదు. తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. బైక్ నడపాలన్న కోరిక తీరుతుంది.. పెట్రోల్ ఖర్చు టెన్షనూ తగ్గుతుంది.

అయితే ఈ బైక్ ఎందుకు కొనాలి అని అంటే కనుక ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే సెల్ఫ్ డయాగ్నోసిస్. రిపేర్ స్విచ్ ని నొక్కితే దానికదే రిపేర్ చేసుకుంటుంది. కోమకి కంపెనీకి చెందిన బైక్ ఇది. ఎక్స్జీటీ క్లాసిక్ బైక్ మోడల్ ని రెట్రో మోడల్ లో తయారు చేసింది కంపెనీ. వింటేజ్ మోటార్ సైకిల్స్ ని ఇష్టపడేవారికి ఈ బండి బాగా ఉపయోగపడుతుంది. ఇది వింటేజ్ లుక్ లో క్లాసిక్ లుక్ తో వస్తుంది. మోడర్న్ టెక్నాలజీతో వస్తున్న రెట్రో బైక్ ఇది. ఇది 80 కి.మీ. నుంచి 90 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఇందులో 60 వోల్ట్స్ 35 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. పోర్టబుల్ ఛార్జర్ తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 85 కి.మీ.గా ఉంది. అల్ట్రా బ్రైట్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టంతో వస్తుంది. బీఎల్డీసీ హబ్ మోటార్ తో వస్తుంది. పార్కింగ్ అసిస్టెంట్, ఆటో రిపేర్ ఫీచర్స్ తో వస్తుంది.

Komaki XGT Classic

సెల్ఫ్ డయాగ్నోసిస్, మల్టీపుల్ సెన్సార్లు, వైర్ లెస్ ఫీచర్ అప్డేట్స్, వివిడ్ స్మార్ట్ డ్యాష్ ఫీచర్స్ ఇచ్చారు. కంఫర్టబుల్ సీటు, డ్యూయల్ డిస్క్ బ్రేక్ తో వస్తుంది. దీనికొక కీ రిమోట్ ఇచ్చారు. ఇందులో కీలెస్ ఎంట్రీ, కీలెస్ కంట్రోల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. రిమోట్ తో బైక్ ని లాక్ చేసుకోవచ్చు. యాంటీ థెఫ్ట్ లాక్ ఫీచర్, రిపేర్ స్విచ్, టెలిస్కోపిక్ షాకర్ వంటివి ఉన్నాయి. ఇది మూడు రైడింగ్ మోడ్స్ లో వస్తుంది. ఎకో, స్పోర్ట్, టర్బో అనే మోడ్స్ ఇచ్చారు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇది జెట్ బ్లాక్, రాయల్ బ్లూ, ప్యూర్ రెడ్ కలర్స్ లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1,08,636గా కంపెనీ నిర్ణయించింది. రాష్ట్రాన్ని బట్టి ధర మారే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కోమకి షోరూంలు ఉన్నాయి. ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలన్నా బుక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో బైక్ మీకు డెలివరీ చేస్తారు. మీరు సమీప డీలర్ దగ్గరకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.