iDreamPost
android-app
ios-app

దేశంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ఒక్కసారిగా ఎందుకు పెరుగుతున్నాయి? అసలు ఏమైందంటే?

  • Published Jun 29, 2024 | 10:14 PM Updated Updated Jun 29, 2024 | 10:14 PM

ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రీఛార్జ్ ధరలను పెంచేసిన విషయం తెలిసిందే. ఇలా దేశంలోని వివిధ నెట్ వర్క్ లకు సంబంధించి రీఛార్జ్ ఫ్లాన్స్ ఒక్కసారిగా ఎందుకు పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలా ఒక్కసారిగా టెలికాం రీఛార్జ్ ధరలు పెరిగిపోవడానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రీఛార్జ్ ధరలను పెంచేసిన విషయం తెలిసిందే. ఇలా దేశంలోని వివిధ నెట్ వర్క్ లకు సంబంధించి రీఛార్జ్ ఫ్లాన్స్ ఒక్కసారిగా ఎందుకు పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలా ఒక్కసారిగా టెలికాం రీఛార్జ్ ధరలు పెరిగిపోవడానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jun 29, 2024 | 10:14 PMUpdated Jun 29, 2024 | 10:14 PM
దేశంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ఒక్కసారిగా ఎందుకు పెరుగుతున్నాయి? అసలు ఏమైందంటే?

దేశంలో గత కొన్ని రోజులుగా సామాన్యులకు అడుగడుగున భారీ షాక్ లు తగులుతున్నాయి. కాగా, ఇప్పటికే నిత్యవసర వస్తువులు దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్ వరకు ప్రతి విషయంలో ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన పడుతున్న విషయం తెలిసిందే.ఇలాంటి సమయంలో తాజాగా మొబైల్ ఫోన్ వినియోగాదారులకు కూడా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎటు చూసిన అధిక ఖర్చులతో సతమతమవుతున్న ప్రజలకు ఈ రీఛార్జ్ ధరల పెంపుతో మరో పిడుగులాంటి వార్త నెట్టిన పడినట్లు అయ్యింది. ముఖ్యంగా ఇప్పుడు ఫోన్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పైగా ఆ ఫోన్స్ కు నెలవారీ రీఛార్జ్ లు చేయడం కూడా కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే కస్టమర్ల అవసరాలను అసరాగా చేసుకున్న ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రీఛార్జ్ ధరలను పెంచేసిన విషయం తెలిసిందే. ఇలా దేశంలోని వివిధ నెట్ వర్క్ లకు సంబంధించి రీఛార్జ్ ఫ్లాన్స్ ఒక్కసారిగా ఎందుకు పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలా ఒక్కసారిగా టెలికాం రీఛార్జ్ ధరలు పెరిగిపోవడానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పటికే రిలయాన్స్ జియో సంస్థ మొబైల్ రీఛార్జ్ ధరలను 12-27 శాతం పెంచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలు కూడా 10-21 శాతం పెంచింది. జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీలు వెల్లడించాయి. ఇక ఇదే బాటలో ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా చేరింది. తాజాగా వొడాఫోన్ ఐడియా ప్రీ పెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ లను 10 నుంచి 23 శాతంకి పెంచుతున్నట్లు తెలిపింది. ఇక ఈ పెంచిన టారిఫ్ ధరలు జూలై 4 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అయితే ఇలా ఒక్కసారిగా ఒక దాని తర్వాత మరొక టెలకాం నెట్ వర్క్ రీఛార్జ్ ధరలు పెంచడానికి గల కారణం ఏమిటో తెలియకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు.

కానీ, నిజానికి ఈ రీఛార్జ్ ధరల పెంపు అనేది ఎప్పుటి నుంచే అమలులో ఉంది. కానీ, మధ్యలో 2024 లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకురాకుండా నిలిపివేశారు. అయితే గతంలో కూడా ఎన్నికల తర్వాత ఈ రీఛార్జ్ ధరలు పెరుగనున్నయని, ఇక సామాన్య ప్రజలు తమ జేబులు ఖాళీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని పలు నివేదికలో సమాచారం అందిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగనే ఎన్నికల ముగిసిన హడవిడి ముగిసిన తరుణంలో.. ఒక్కసారిగా ఈ మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంచేయడం జరిగింది. అయితే ఇలా ఒక్కసారిగా మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలకు ఊహించని షాక్ తగిలింది.