nagidream
Must Know About This Act: తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద హక్కు పిల్లలందరికీ ఉంటుంది. పిల్లలందరూ సమాన వాటా తీసుకోవాల్సిందే. అయితే మీరు చేసే పొరపాటు వల్ల మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో వాటా మీ తోబుట్టువులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ చట్టం గురించి తెలుసుకోకపోతే నష్టపోతారు.
Must Know About This Act: తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద హక్కు పిల్లలందరికీ ఉంటుంది. పిల్లలందరూ సమాన వాటా తీసుకోవాల్సిందే. అయితే మీరు చేసే పొరపాటు వల్ల మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో వాటా మీ తోబుట్టువులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ చట్టం గురించి తెలుసుకోకపోతే నష్టపోతారు.
nagidream
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో వాటా అనేది పిల్లలందరికీ సమానంగానే పంచుతారు. అయితే పెళ్లిళ్లు అయిపోయాక, ఆస్తులు పంచుకున్నాక ఎవరి దారి వారిది. ఎంత కలిసున్నా, ఎంత ప్రేమగా ఉన్నా గానీ ఆస్తుల విషయానికి వచ్చేసరికి తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్టు వ్యవహరిస్తారు. కాబట్టి ముందుగానే ఈ చట్టం గురించి తెలుసుకోండి ఈ పొరపాటు చేస్తే మీ ఆస్తిలో వాటా ఊరకనే మీ తోబుట్టువులకు వెళ్ళిపోతుంది. ఒక తల్లి కడుపున పుట్టిన తోబుట్టువులకు ప్రేమతో ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే అవ్వచ్చు. కానీ పెళ్లిళ్లు అయ్యాక పెళ్ళాం, పిల్లలు ఉన్నాక వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం ఒక పద్ధతి.. పోతే పోనీలే అని కష్టపడి సంపాదించిన ఆస్తిని వదిలేసుకోవడం మాత్రం మంచి పద్ధతి కాదు. అందుకే ఈ పొరపాటు అస్సలు చేయకండి. చేస్తే కనుక మీరు ఎంత మంచివారు అయినా సరే చట్టానికి అదేమీ కనబడదు.
తల్లిదండ్రుల పేరు మీద ఆస్తులు కొనడం అనేది కొంతమందికి ఒక సెంటిమెంట్. లేదంటే ప్రేమ కొద్దీ వారి పేరు మీద కొంటారు. వారి పేరు మీద ఉంటే రేపు తనకు ఏమైనా అయినా వాళ్ళు బతికినంత కాలం ఎవరి దగ్గరా ఉండకుండా సంతోషంగా ఉంటారు అని ఆలోచించేవాళ్ళు ఉంటారు. అయితే ఒక బిడ్డ ఉన్నవాళ్లు ఇలా చేసినా పర్లేదు. కానీ ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటేనే తల్లిదండ్రుల గురించి ఆలోచించి చేసిందంతా వృధా అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల మీద కొన్న ఆస్తుల మీద తల్లిదండ్రులకు పూర్తి హక్కు ఉంటుంది. ఆ ఆస్తిని వారికి నచ్చిన వారికి పంచవచ్చు. పిల్లల మీద ప్రేమతో పంచవచ్చు. లేదా పిల్లలకు కాకుండా వేరే వారికి వీలునామా రాసి ఇచ్చేయచ్చు. వీలునామా రాస్తే ఇక ఆ ఆస్తి మీద పిల్లలకు హక్కు ఉండదు.
1956 హిందూ వారసత్వ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఏ ఆస్తిపైన అయినా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి హక్కు ఉంటుంది. వారి ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలని చట్టం చెబుతుంది. ఉదాహరణకు అశోక్ అనే వ్యక్తి తన సొంత డబ్బుతో లేదా హోమ్ లోన్ తో ఒక ఇల్లు కొని తన తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇందుకోసం ఏళ్ల తరబడి ఈఎంఐలు కట్టాడు. తల్లి ఒక్క రూపాయి కూడా కట్టలేదు. అయితే అశోక్ కి ఒక చెల్లి లేదా అక్క లేదా తమ్ముడు ఉంటే.. ఇప్పుడు తల్లి మరణిస్తే ఆ ఫ్లాట్ మీద హక్కు తోడ బుట్టిన వారికి ఉంటుంది. అంటే ఆ ఆస్తిలో వాటా వారికి కూడా ఇవ్వాలని చట్టం చెబుతుంది. న్యాయంగా ఆలోచిస్తే కష్టపడి తన సొంత డబ్బుతో కొన్న అశోక్ కే దక్కాలి. కానీ ఇక్కడ చట్టం దృష్టిలో తల్లి పేరు మీద ఆస్తి ఉంటే పిల్లలు అందరికీ వాటా ఉంటుంది.
ఈ సమస్య రాకూడదంటే.. రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది తల్లితో వీలునామా రాయించుకోవడం. ఇల్లు అశోక్ కష్టార్జితం కాబట్టి అతనికి మాత్రమే చెందాలి అని వీలునామా రాయించుకోవాలి. అప్పుడు ఆ ఇల్లులో పూర్తి వాటా అశోక్ కే ఉంటుంది. అలానే ఇంకో మార్గం ఉంది. రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కింద తల్లి ఆ ఫ్లాట్ లో వాటాని అశోక్ కి ఇవ్వాలి. ఆ తర్వాత తోడబుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎన్ఓసీ (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అశోక్ కి ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదని మిగతా పిల్లలు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. దీని వల్ల తల్లి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తిలో వాటా అనేది పూర్తిగా అశోక్ కే దక్కుతుంది.
ఒకవేళ ఇల్లు కొని తల్లిదండ్రుల పేరు మీద పెట్టిన అశోక్ చనిపోతే.. అతని భార్య, పిల్లలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి వీలునామా రాయించుకోవడం గానీ లేదా తోడబుట్టిన వారి దగ్గర నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని డిక్లరేషన్ తీసుకోవడం గానీ చేయాలి. లేదంటే అన్యాయంగా మీ కష్టం వృధా అయిపోతుంది. ఎప్పుడేం జరుగుద్దో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా తల్లి మీద లేదా తండ్రి మీద ఆస్తి కొన్నా మీకు ఏమైనా అయితే దాన్ని రాబందుల్లా తోడబుట్టిన వాళ్లు పీక్కు తినచ్చు. ఆస్తి కోసం బతికుండగానే చిత్రహింసలు పెట్టచ్చు. ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే పైన చెప్పిన రెండు మార్గాలను అనుసరించాలి. ఒకటి వీలునామా, రెండు ఎన్ఓసీ డిక్లరేషన్.