iDreamPost
android-app
ios-app

అస్సాం యువకుడి ఆవిష్కరణ! రూ.416 కోట్లకి కొనుకున్న US కంపెనీ!

ప్రపంచమంతా టెక్నాలజీమయం అయిపోయింది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి రోజుల్లో మనకు కావాల్సిన ఏ సమాచారమైన క్షణాల్లో ఇంటర్నెట్ నుంచి పొందే వెసులుబాటు టెక్నాలజీ వల్ల సాధ్యమైంది.

ప్రపంచమంతా టెక్నాలజీమయం అయిపోయింది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి రోజుల్లో మనకు కావాల్సిన ఏ సమాచారమైన క్షణాల్లో ఇంటర్నెట్ నుంచి పొందే వెసులుబాటు టెక్నాలజీ వల్ల సాధ్యమైంది.

అస్సాం యువకుడి ఆవిష్కరణ! రూ.416 కోట్లకి కొనుకున్న US కంపెనీ!

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా.. హా ఇలాంటి మాటలు చాలానే విన్నాం ఒక్క ఆలోచనే జీవితాన్ని మార్చేస్తదా అని అంటుంటారు కదా. కానీ ఆ యువకుడి జీవితాన్ని మార్చేసింది. ఒక్క ఆలోచన ఆ యువకుడిని వందల కోట్లకు అధిపతిని చేసింది. టాలెంట్ ఉండాలే కానీ ఎంతటి లక్ష్యాన్నైనా సాధించొచ్చు అన్న విషయాన్ని నిరూపించాడు అస్సాంకు చెందిన యువకుడు. తనకు వచ్చిన ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణ చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు కిషన్ బగారియా. ఇంతకీ ఆ యువకుడు చేసిన ఆవిష్కరణ ఏంటి? వందల కోట్లు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచమంతా టెక్నాలజీమయం అయిపోయింది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి రోజుల్లో మనకు కావాల్సిన ఏ సమాచారమైన క్షణాల్లో ఇంటర్నెట్ నుంచి పొందే వెసులుబాటు టెక్నాలజీ వల్ల సాధ్యమైంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్లకు ఒక వ్యసనంలా మారిపోయింది. ఒక యాప్ కు మించి మరో యాప్ అందుబాటులోకి వస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియా యాప్స్ కొంత మందికి ఎంటర్ టైన్ మెట్ అందిస్తుండగా మరికొంత మందికి ఉపాధి మార్గంగా నిలుస్తున్నాయి. అయితే అస్సాంకు చెందిన యువకుడు మాత్రం ఏకంగా ఓ యాప్ నే ఆవిష్కరించాడు. అతడు రూపొందించిన ఆల్‌ ఇన్‌ వన్‌ మెసేజింగ్‌ యాప్‌ను అమెరికా దిగ్గజ టెక్‌ కంపెనీ రూ.416 కోట్లకు కొనుగోలు చేసింది.

అస్సాంకు చెందిన కిషన్ బగారియా అరుదైన ఘనత సాధించాడు. ఇటీవల పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆ యువకుడు ‘texts.com’ అనే ఆల్‌ ఇన్‌ వన్‌ ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌ను రూపొందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, మెసెంజర్‌, వాట్సప్‌ వంటి యాప్‌లలో ఉన్న కాంటాక్ట్స్‌తో ఈ యాప్‌ను ఉపయోగించి మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఈ యాప్ కు ఆదరణ పెరగడంతో అమెరికా టెక్‌ దిగ్గజం ‘ఆటోమేటిక్‌’ రూ.416 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా కిషన్‌ కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఈ క్రమంలో యూఎస్‌ నుంచి దిబ్రూగఢ్‌కు చేరుకున్న కిషన్ కు వియ్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ.. అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కాగా కిషన్ బగారియా చారియాలీ ప్రాంతానికి చెందిన బిజినెస్ మ్యాన్ మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు.