Dharani
టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో.. తన ప్రత్యర్థులను దెబ్బ తీయడం కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..
టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో.. తన ప్రత్యర్థులను దెబ్బ తీయడం కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..
Dharani
భారతదేశ టెలికాం రంగంలో జియో ఒక సంచలనం అని చెప్పవచ్చు. అప్పటి వరకు డేటా, కాలింగ్ కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితిని జియో ఎంట్రీ మార్చేసింది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా ప్యాక్‌లు తీసుకు వచ్చింది. జియో దెబ్బకు అప్పటి వరకు ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్, వోడాఫోన్‌లు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అవి కూడా అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ ప్యాక్‌లు తీసుకురావల్సి వచ్చింది. అయినా కూడా జియోను దాటలేకపోతున్నాయి. ఎందుకంటే.. ఈ రంగంలో జియో ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొస్తూ.. మిగతా వాటికి గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో జియో 895 ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఏకంగా ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా సౌకర్యాలు కల్పిస్తోంది. ఆ వివరాలు..
టెలికాం రంగంలో మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడం కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తుంది జియో. దీనిలో భాగంగా తాజాగా 895 రూపాయలకే 11 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్‌ను కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 11 నెలల పాటు జియో ఫోన్ కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు అందించనుంది. జియో తీసుకొచ్చిన ఈ 895 ప్రీపెయిడ్ ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. అంటే ప్రతి నెల 28 రోజుల వ్యాలిడిటీ చొప్పున 12 సైకిల్స్ పని చేస్తుంది. ఈ 12 సార్లు అన్‌లిమిటెడ్ ఆఫర్లను అందిస్తోంది.
అంటే కేవలం 895 రూపాయలకే ఈ 12 సైకిల్స్‌లో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది జియో. దీంతో పాటు 2 జీబీ హై స్పీడ్ డేటా, 50 ఎస్‌ఎంఎస్‌లు, డేటా ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటాని కూడా అందిస్తోంది. అంతేకాక ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ యాప్స్‌కి ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో నెలకు కేవలం 81 రూపాయలకే 28 రోజుల పాటు అన్‌లిమిటడ్ ప్రయోజనాలు పొందవచ్చు అన్నమాట. జియో కస్టమర్లకు ఇది చాలా మంచి ప్లాన్ అని చెప్పవచ్చు. ఏడాదికి వెయ్యి రూపాయల లోపు రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు పొందవచ్చు.