iDreamPost
android-app
ios-app

Jio Plans: జియో నుంచి ధమాకా ప్లాన్.. రూ.75కే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా కూడా..!

  • Published Aug 20, 2024 | 11:47 AM Updated Updated Aug 20, 2024 | 12:27 PM

Jio Rs 75 Plan: రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచి కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జియో.. వారిని శాంతింపచేయడం కోసం రకరకాల ప్లాన్లను అందుబాటులోకి తెస్తుంది. అలాంటి ఓ రీఛార్జ్ ప్లాన్ గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఆ వివరాలు..

Jio Rs 75 Plan: రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచి కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జియో.. వారిని శాంతింపచేయడం కోసం రకరకాల ప్లాన్లను అందుబాటులోకి తెస్తుంది. అలాంటి ఓ రీఛార్జ్ ప్లాన్ గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఆ వివరాలు..

  • Published Aug 20, 2024 | 11:47 AMUpdated Aug 20, 2024 | 12:27 PM
Jio Plans: జియో నుంచి ధమాకా ప్లాన్.. రూ.75కే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా కూడా..!

ప్రస్తుతం దేశంలో మొబైల్ వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకు కారణం ఆయా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడమే. ముందుగా ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఈ నిర్ణయం తీసుకోగా.. తర్వాత. ఇదే బాటలో ఎయిర్టెల్, వీఐ వంటి కంపెనీలు పయనించాయి. దాంతో చివరకు అన్ని కంపెనీల రీఛార్జ్ ప్లాన్ ధరలు భారీగా పెరిగి.. కస్టమర్ జేబుకు చిల్లు పడే పరిస్థితి తీసుకువచ్చాయి. ఇక టెలికాం కంపెనీలు తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇందుకు నిరసనగా.. భారీ ఎత్తున వినియోగదారులు.. బీఎస్ఎన్ఎల్ కు మారారు. దాంతో టెలికాం కంపెనీలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను తీసుకొస్తున్నాయి. దీనిలో భాగంగా జియో నుంచి ధమాకా ప్లాన్ ఒకటి వచ్చింది. ఆ వివరాలు..

దేశీయ టెలికాం రంగంలో జియో నంబర్ వన్ దూసుకుపోతుంది. క్వాలిటీ నెట్‌వర్క్, వేగవంతమైన డేటా, అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్‌తో ప్రతి ఒక్కరికీ చేరువైంది. అలానే కస్టమర్లను ఆకర్షించడం కోసం చౌకైన ప్లాన్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జియో తన యూజర్ల కోసం రూ.75 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా కస్టమర్లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా డేటాను కూడా అందిస్తోంది. ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు..

జియో రూ. 75 ప్లాన్‌

జియో తీసుకొచ్చిన ఈ 75 రూపాయల ప్లాన్ వాస్తవానికి జియో ఫోన్‌కి సంబంధించినది. ఇక ఈ ప్లాన్ వ్యాలిడిటీ విషయానికి వస్తే.. 23 రోజుల పాటు రోజుకు 100 ఎంబీ డేటా లభిస్తుంది. అంటే ఈ మొత్తం 2.5 జీబీ డేటాతో సమానం. దీంతో పాటు ఈ అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ లో 50 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక ఈ ప్లాన్ తో బోనస్ గా మరో 200 ఎంబీ డేటా లభిస్తుంది.

జియో రూ. 75 ప్లాన్‌ని రీఛార్జ్ చేయడం చాలా సులభం. మీరు దీన్ని జియో అధికారిక వెబ్‌సైట్ లేదా మైజియో యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో పాటు మీరు గూగుల్పే, ఫోన్ పే వంటి అనేక థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో అదనపు ప్రయోజనంగా జియో టీవీ, జియోసినిమా, జియోక్లౌడ్, జియోసెక్యూరిటీ వంటి ఫీచర్లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.

ఇన్నిఈ ప్రయోజనాలున్న ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ వినియోగదారులకు మాత్రమే. కొంచెం ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి జియో రూ. 125 ప్లాన్ మరొక ఎంపిక. ఈ ప్లాన్ కూడా 23 రోజుల వాలిడిటీతో వస్తుంది. అయితే ఇది రోజుకు 500 ఎంబీ డేటాను అదనంగా అందిస్తుంది. అలానే జియోలో మరెన్నో ఇతర రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ ఎంచుకోండి.