iDreamPost
android-app
ios-app

దిగిచ్చొన Jio.. మళ్లీ పాత ప్లాన్‌ అమలుకు రెడీ

  • Published Jul 20, 2024 | 10:26 AMUpdated Jul 20, 2024 | 10:26 AM

Jio Relaunches Rs 999 Prepaid Plan: రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్ల పెంపుపై కస్టమర్లు ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో దిగి వచ్చింది. పాత ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఆ వివరాలు..

Jio Relaunches Rs 999 Prepaid Plan: రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్ల పెంపుపై కస్టమర్లు ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో దిగి వచ్చింది. పాత ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Jul 20, 2024 | 10:26 AMUpdated Jul 20, 2024 | 10:26 AM
దిగిచ్చొన Jio.. మళ్లీ పాత ప్లాన్‌ అమలుకు రెడీ

అడుగుపెడుతూనే టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది జియో. ప్రారంభంలో ఉచితంగా.. ఆ తర్వాత చాలా తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఇంటర్నెట్‌ డేటాను కస్టమర్లకు అందిస్తూ.. తన వైపు తిప్పుకుంది. జియో దెబ్బకు అప్పటి వరకు ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌ మిగతా కంపెనీలకు భారీ షాక్‌ ఇచ్చింది. జియో దెబ్బకు అవి కూడా దిగి వచ్చాయి. తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక జియో ఎంట్రీ నుంచి ఈ ఏడాది జూలై వరకు దేశ ప్రజలు అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డేటాను ఎంజాయ్‌ చేశారు. కానీ తాజాగా జియో తన రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే ఒక్కో ప్యాక్‌ ధర మీద 12-25 శాతం వరకు పెంచి.. కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టింది.  ఆ తర్వాత మిగతా టెలికాం కంపెనీలు అనగా.. ఎయిర్‌టెల్‌, వీఐ కూడా తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచాయి.

రీఛార్జ్‌ ప్లాన్‌ ధరల పెంపుతో.. యూజర్ల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న రిలయన్స్‌ జియో, వారిని సంతృప్తి పరచడానికి కాస్త దిగివచ్చింది. పాత ప్లాన్‌ను తిరిగి తీసుకువచ్చింది. ఇంతకు అది ఏది అంటే.. రూ.999 ప్లాన్‌. కస్టమర్లను శాంతింపజేయడానికి జియో.. ఈ  ప్రీపెయిడ్ ప్లాన్‌ని మళ్లీ తిరిగి ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది రీచార్జ్‌ చేసుకునే రూ.999 ప్లాన్‌ ధరను జూలై 3న రూ.1,199కి పెంచింది. అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో.. పాత ప్లాన్‌ను తిరిగి తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది. తాజాగా కొన్ని సవరించిన ప్లాన్ ఫీచర్‌లు, ప్రయోజనాలతో పాత ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది జియో.

కొత్త రూ. 999 ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దాని పొడిగించిన వ్యాలిడిటీ. పాత ప్లాన్‌లో ఇది 84 రోజులు ఉండగా కొత్త ప్లాన్‌లో ఇది 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే 14 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. అయితే కొత్త ప్లాన్‌లో రోజువారీ డేటాను తగ్గించేశారు. గత ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా లభిస్తుండగా కొత్త ప్లాన్‌ రోజుకు 2జీబీ డేటాను అందిస్తుంది. డేటా పరిమితి తగ్గినప్పటికీ దీంతో 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి.

దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ కూడా రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకుంటే అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక ఎయిర్‌టెల్‌ తీసుకువచ్చిన 979 ప్లాన్‌లోని అదనపు ప్రయోజనం ఏమిటంటే దీన్ని రీఛార్జ్‌ చేసుకుంటే.. 56 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితంగా పొందవచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి