iDreamPost
android-app
ios-app

జియో కస్టమర్లకు శుభవార్త.. ఇకపై ఆ సేవలు కూడా ఇంటి నుంచే

  • Published Sep 05, 2024 | 5:26 PM Updated Updated Sep 05, 2024 | 5:26 PM

Reliance Jio: ఇప్పటికే రిలయన్స్ జియో కార్డ్లను ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలయన్స్ జియో మరో కొత్త తరహా సేవలను ప్రారంభిస్తూ.. కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. ఇంతకీ అదేమిటంటే..

Reliance Jio: ఇప్పటికే రిలయన్స్ జియో కార్డ్లను ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలయన్స్ జియో మరో కొత్త తరహా సేవలను ప్రారంభిస్తూ.. కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. ఇంతకీ అదేమిటంటే..

  • Published Sep 05, 2024 | 5:26 PMUpdated Sep 05, 2024 | 5:26 PM
జియో కస్టమర్లకు శుభవార్త.. ఇకపై ఆ సేవలు కూడా ఇంటి నుంచే

ప్రముఖ టెలికాం రంగం రిలియాన్స్ జియో వచ్చి రావడమే దేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా జియో సరసమైన ధరలకే అపరిమిత అన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎఎష్, డేటా ఆఫర్లతో జియో కస్టమర్లను ఆకట్టుకుంటూ సంచలనం సృష్టించింది. దీంతో మార్కెట్ లో జియోకు సాటి ఏదీ లేకుండా నిలిచింది.ఇలా ఎప్పటికప్పుడు ఈ టెలికాం సంస్థ యూజర్స్ ను పెంచేలా, ఆకట్టుకునే సంచలన నిర్ణయాలతో జోరుగా దూసుకుపోతున్ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ జియో మరో కొత్త తరహా సేవలను ప్రారంభిస్తూ.. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే రిలయన్స్ జియో కార్డ్లను ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలయన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు జియో కొత్త తరహా సేవలను ప్రారంభించింది. అయితే ఈ జియో సిమ్ యాక్టివేట్ అనేది.. ఆయా నెట్ వర్క్ ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్తే మాత్రం అయ్యేది. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. అదేంటి సిమ్ యాక్టివేట్ బయటకు వెళ్లకపోతే ఎలా జరుగుతుంది అని సందేహ పడుతున్నారా.. మరెమీ లేదండి.. తాజాగా రిలయన్స్ జియో ఇకపై ఇంట్లోనే కూర్చొని సిమ్ యాక్టివేట్ చేసే అద్భుతమైన అవకాశం తీసుకొచ్చింది. దీంతో ఇకపై మనం సిమ్ యాక్టివేషన్ కోసం జియో ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఎక్కడైనా, ఎప్పుడైనా సిమ్ సిమ్ యాక్టివేట్ చేసుకొనే వెసులుబాటు జియో కల్పిస్తుంది.

అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ సాయంతోనే ఈ కార్డ్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అందుకు కోసం ముందుగా My Jio  యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఇక యాప్ ఓపెన్ చేయగానే అందులో ముందుగా ఐయాక్టివేట్ బ్యానర్ ప్రత్యక్షమవుతుంది. దానిపై క్లిక్ చేయగానే మీ పేరు, ఫోన్ నంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేసి ఓటీపీని జనరేట్ చేయాలి.  ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయగానే eSIM, Physical SIM అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు కావల్సిన ఆప్షన్ ఎంచుకొని ‘Go for Jio Activate’ పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ ఓటీపీ, డిజీలాకర్ సాయంతో కేవైసీ పూర్తి చేయాలి. ఇలా ఇంటికి వచ్చిన సిమ్ ను మొబైల్ సాయంతో లైవ్ ఫొటో/వీడియో తీసుకొని, లైవ్లోనే డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.  అలా సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కుదరకపోతే ఆ డెలివరీ ఏజెంట్ల సాయంతోనైనా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవచ్చు. మరీ, జియో సిమ్ కార్డులను ఇకపై ఇంటి దగ్గర నుంచే యాక్టివేట్ చేసుకునే ఈ సదుపాయాలను జియో కల్పించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.