iDreamPost
android-app
ios-app

మీ జియో నంబర్‌ని రీఛార్జ్ చేయించలేదా? ఈ కొత్త ప్లాన్స్ గురించి తెలుసుకోండి..

  • Published Jul 05, 2024 | 4:00 AM Updated Updated Jul 05, 2024 | 10:00 AM

JIo New Plans: ఇప్పటికే జియో రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జియో కంపెనీ రెండు కొత్త ప్లాన్స్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ తో జియో కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.

JIo New Plans: ఇప్పటికే జియో రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జియో కంపెనీ రెండు కొత్త ప్లాన్స్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ తో జియో కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.

మీ జియో నంబర్‌ని రీఛార్జ్ చేయించలేదా? ఈ కొత్త ప్లాన్స్ గురించి తెలుసుకోండి..

మీరు ఇంకా మీ జియో నంబర్ ని రీఛార్జ్ చేయలేదా. అయితే మీరు ఈ రెండు కొత్త ప్లాన్స్ గురించి తెలుసుకోవాల్సిందే. 28 రోజులు, 56 రోజుల వ్యాలిడిటీతో పాటు ఇప్పుడు కొత్తగా రెండు ప్లాన్స్ ని తీసుకొచ్చింది జియో. ఈ ప్లాన్స్ ద్వారా జియో వినియోగదారులు భారీగా ప్రయోజనం పొందనున్నారు. రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్స్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. జియో బాటలోనే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ లు కూడా రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచేశాయి. అయితే జియో టారిఫ్ ప్లాన్స్ ధరల పెంపు జూలై 3 నుంచి అమలులోకి రాగా.. తాజాగా జియో సరికొత్త ప్లాన్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

జియో 98 రోజుల ప్లాన్, జియో 72 రోజుల ప్లాన్స్ ని తీసుకొచ్చింది. జియో 98 రోజుల ప్లాన్ ధర రూ. 999 కాగా.. ఈ ప్లాన్ తో డైలీ 2 జీబీ డేటా చొప్పున మొత్తం 196 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, అపరిమిత కాల్స్ ని అందిస్తుంది. ఇక ఇదే ప్లాన్ లో 5 జీ అన్ లిమిటెడ్ ఫాస్ట్ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. ఇందులో ఉచిత సబ్ స్క్రిప్షన్ ఆఫర్ కింద జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్ లు అందిస్తున్నారు. జియో 72 రోజుల ప్లాన్ విషయానికొస్తే.. ఇది 72 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీని ధర 749 రూపాయలు. ఈ ప్లాన్ తో 72 రోజుల పాటు డైలీ 2 జీబీ డేటాను పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా ఇస్తున్నారు. మొత్తం మీద 164 జీబీ డేటా వస్తుంది.

ఇక అపరిమిత కాల్స్, రోజుకు 100 మెసేజులు, 5జీ అన్ లిమిటెడ్ ఫాస్ట్ డేటా కూడా ఈ ప్లాన్ లో వస్తుంది. ఇక ఈ ప్లాన్ తో పాటు అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ ని ఉచితంగా పొందవచ్చు. 98 రోజుల ప్లాన్ లోనూ, అలానే 72 రోజుల ప్లాన్ లోనూ 5జీ స్పీడ్ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను వాడుకోవచ్చు. తెలుగు ఛానల్స్ తో పాటు ఇతర భాషలకు చెందిన ఛానల్స్ ని జియో టీవీలో చూడవచ్చు. అలానే జియో సినిమా యాప్ లో సినిమాలు, షోలు చూడవచ్చు. ఇక జియో క్లౌడ్ తో స్టోరేజ్ స్పేస్ ని పొందవచ్చు.