iDreamPost
android-app
ios-app

Jio యూజర్లకు అలర్ట్.. ఇకపై ఆ ప్లాన్లలో 5జీ డేటా రాదు..

  • Published Jul 03, 2024 | 10:56 AM Updated Updated Jul 03, 2024 | 10:56 AM

జియో యూజర్లకు కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఇకపై ఆ ప్లాన్లు రీఛార్జ్‌ చేసుకునే వారికి 5జీ డేటా రాదని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

జియో యూజర్లకు కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఇకపై ఆ ప్లాన్లు రీఛార్జ్‌ చేసుకునే వారికి 5జీ డేటా రాదని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Jul 03, 2024 | 10:56 AMUpdated Jul 03, 2024 | 10:56 AM
Jio యూజర్లకు అలర్ట్.. ఇకపై ఆ ప్లాన్లలో 5జీ డేటా రాదు..

ఎన్నికలు ముగియడంతో అన్నింటి ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే టెలికాం కంపెనీలు రీఛార్జ్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వినియోగదారులకు తక్కువ ధరకే భారీ ఎత్తున డేటా, అల్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సౌకర్యం కల్పించిన జియో సైతం.. తన రీఛార్జ్‌ ప్లాన్ల ధరలను భారీగా పెంచింది. ఇక ఎయిర్‌టెల్‌, వీఐ ఇదే బాటలో పయనిస్తూ.. తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్లను ఒక్కసారిగా భారీగా పెంచాయి. ఇక పెరిగిన రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు.. నేటి నుంచి అనగా జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో తాజాగా జియో తన వినియోగదారులకు కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఇకపై ఆ ప్లాన్లలో 5 జీ డేటా రాదని తెలిపింది. ఆ వివరాలు..

జియో యూజర్లకు అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో భారీ మార్పులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రీఛార్జ్ ధరల పెంపుకు సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వచ్చినా.. ఉన్నట్లుండి భారీగా టారిఫ్‌ ధరలను పెంచి వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. ఈ కొత్త మొబైల్ రీఛార్జ్ ధరలు జూలై 3, 2024 నుంచి అమలులోకి వస్తాయి. దాంతో పాటు జియో మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. జియో తమ 5జీ సర్వీసుల నుంచి ఆదాయాన్ని పెంచడం కోసం ధరలను దాదాపు 12 శాతం పెంచిన సంగతి తెలిసిందే.

No 5G on these plans

జియో ఇకపై నిర్దిష్ట ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందించదని గమనించాలి. జూలై 3 నుంచి రిలయన్స్ జియో రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లపై మాత్రమే అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిచనుంది. అంటే రోజుకు 1.5జీబీ డేటా లేదా అంతకంటే తక్కువ ఉన్న ప్లాన్‌లలో ఇక మీదట.. 5జీ ఇంటర్నెట్ డేటాకు యాక్సెస్ పొందలేవు. 5 జీ డేటా పొందాలంటే.. రోజుకు 2 జీబీ అంతకన్నా ఎక్కువ డేటా పొందే ప్లాన్‌లను రీఛార్జ్‌ చేసుకోవాలి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం మైజియో యాప్‌ను సందర్శించండి.

జియో నుంచి రెండు కొత్త సర్వీసులు..

టారిఫ్‌ ధరలను పెంచడంతో పాటుగా తాజాగా జియో రెండు కొత్త అప్లికేషన్‌లను కూడా ప్రవేశపెట్టింది. జియోసేఫ్.. క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్ యాప్, జియో ట్రాన్సలేట్.. ఏఐ-ఆధారిత మల్టీ లాంగ్వేజీ కమ్యూనికేషన్ యాప్. ఈ రెండు సర్వీసులు జియో కస్టమర్లకు ఒక ఏడాది పాటు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. రెన్యువల్ ప్లాన్‌లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.