iDreamPost
android-app
ios-app

JIO, AIRTEL రేట్లు పెంచినా.. ప్రజలు BSNLకి మారకపోవడానికి కారణం? ఇదే సమస్య!

  • Published Jul 17, 2024 | 7:48 AM Updated Updated Jul 17, 2024 | 8:02 AM

ఈ నెల ప్రారంభంలో దేశంలోని అన్ని ప్రముఖ టెలికాం కంపెనీలు.. అనగా జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు భారీగా పెంచాయి. ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే రేట్లు పెంచలేదు. అయినా సరే జనాలు ఎందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారడం లేదు.. కారణం ఏంటి అంటే..

ఈ నెల ప్రారంభంలో దేశంలోని అన్ని ప్రముఖ టెలికాం కంపెనీలు.. అనగా జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు భారీగా పెంచాయి. ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే రేట్లు పెంచలేదు. అయినా సరే జనాలు ఎందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారడం లేదు.. కారణం ఏంటి అంటే..

  • Published Jul 17, 2024 | 7:48 AMUpdated Jul 17, 2024 | 8:02 AM
JIO, AIRTEL రేట్లు పెంచినా.. ప్రజలు BSNLకి మారకపోవడానికి కారణం? ఇదే సమస్య!

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత.. ఇంటర్నెట్‌ డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు డేటా కోసం రీఛార్జ్‌ చేసుకోవాలంటే.. భారీ ఎత్తున చెల్లించాలి. అయితే ఎప్పుడైతే జియో రంగంలోకి దిగిందో.. అప్పటి వరకు టెలికాం రంగంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌.. జియో దెబ్బకు దిగి వచ్చింది. అంబానీ టెలికాం రంగంలోకి అడుగుపెడుతూనే.. చాలా తక్కువ ధరకే.. ఇంకా చెప్పాలంటే.. ఉచితంగా  అపరిమిత డేటా, కాలింగ్‌ ప్యాక్‌లను తీసుకువచ్చింది. దాంతో అప్పటి వరకు ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ వాడిన వారు.. జియోకు మారారు. భారీ ఎత్తున కస్టమర్లకు జియోకు వలస వెళ్లారు. ఈ దెబ్బతో ఎయిర్‌టెల్‌, మిగతా కంపెనీలు దిగి రాక తప్పలేదు. అవి కూడా రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకున్నాయి.

ఇక జియో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఈ నెల వరకు అనగా జూలై 3, 2024 వరకు కూడా అన్ని టెలికాం కంపెనీలు ఒకే ధరకు రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అమలు చేశాయి. కానీ జూలై 4 నుంచి రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచుతూ.. జియో నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ పయనించాయి. ఒక్కో ప్లాన్‌ మీద 12-25 శాతం వరకు పెంచాయి. ఈ నిర్ణయం వల్ల ప్రతి కంపెనీ కోట్ల రూపాయల్లో లాభం పొందబోతున్నాయి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. టెలికాం రంగంలో భారీ ఎత్తున పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో.. అందరి చూపు బీఎస్‌ఎన్‌ఎల్‌ మీదకు మళ్లింది. ఎందుకంటే.. జియో, ఎయిర్‌టెల్‌ వంటి కంపెనీలు తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచినా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం రేట్లను పెంచలేదు. పైగా మిగతా కంపెనీల కన్నా.. చాలా తక్కువ ధరకు.. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్స్‌ను అందిస్తుంది బీఎస్‌ఎన్‌ఎల్‌.

అతి తక్కువ ధరకే ప్లాన్స్‌..

వంద రూపాయల లోపు.. 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న రీఛార్జ్‌ ప్లాన్‌ ఇతర ఏ టెలికాం కంపెనీలో అందుబాటులో లేవు ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌లో తప్ప. దీనిలో ఉన్న 94 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. పైగా ఉచిత కాలింగ్‌, డేటా అందిస్తుంది. అలానే ఏడాది పాటు వ్యాలిడిటీ కలిగి ఉన్న ప్లాన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 1999లకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 600 జీబీ డేటాను, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాలు కల్పిస్తోంది. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌లో రోజుకు 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్‌.. అది కూడా ఏడాది వ్యాలిడిటీ ఉండే ప్యాక్‌ ధర 2395 రూపాయలు ఉండగా.. ఇదే ప్లాన్‌ ఎయిర్‌టెల్‌లో 3599 రూపాయలు తీసుకుంటుంది. మిగతా వాటితో పోలిస్తే.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో చాలా తక్కువ ధరకే మంచి ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రధాన లోపం ఇదే..

అయితే జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌లు తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను ఎంత భారీగా పెంచిన.. జనాలు ఎందుకు వాటికే అతుక్కుపోతున్నారు.. తక్కువ ధరకే ప్లాన్స్‌ అందుబాటులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎందుకు మారడం లేదు అంటే.. ముఖ్య కారణం.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో డేటా సర్వీసులు చాలా స్లోగా ఉంటాయి. జియో రావడం రావడమే ఉచితంగా 4జీ డేటాను ఇవ్వగా.. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 2జీ దగ్గర తచ్చాడుతుంది. ప్రస్తుతం మిగతా కంపెనీలు అన్ని.. 5జీ సర్వీసులు దిశగా పరుగులు తీస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఇంకా 3జీ డేటా దగ్గరే ఉంది. అయితే 2025 నాటికి 5జీకి అప్‌గ్రేడ్‌ అవుతుందని చెప్పుకొస్తుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకుంటే.. కనెక్టీవిటీకి ఢోకా ఉండదు కానీ.. డేటా విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు అందుబాటులోకి తేవడమే కాక.. 6జీ దిశగా పరుగులు తీస్తున్నాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయానికి వస్తే.. దీనిలో 5జీ అనేది ఇప్పట్లో సాకారం కాదు.. ఇప్పుడిప్పుడే 4జీకి అప్‌గ్రేడ్‌ అవుతుంది. అయితే 2025 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ అప్‌గ్రేడ్‌ అవుతామని చెబుతుంది. అందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌.. టీసీఎస్‌తో జత కట్టింది. దేశమంతటా 1000 గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ అయితే.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మళ్లీ పుంజుకుంటుందని.. అది జియో, ఎయిర్‌టెల్‌కు భారీ షాకే అని అంటున్నారు.