nagidream
Best Electric Scooter At 55K: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఈ కంపెనీ స్కూటర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది చిన్న బ్యాటరీతో, చిన్న సైజు ఛార్జర్ తో వస్తుంది. పైగా ఎక్కువ రేంజ్ ఇస్తుంది. ఇంతకంటే కొనేందుకు బెస్ట్ ఆప్షన్ ఉండదేమో.
Best Electric Scooter At 55K: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఈ కంపెనీ స్కూటర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది చిన్న బ్యాటరీతో, చిన్న సైజు ఛార్జర్ తో వస్తుంది. పైగా ఎక్కువ రేంజ్ ఇస్తుంది. ఇంతకంటే కొనేందుకు బెస్ట్ ఆప్షన్ ఉండదేమో.
nagidream
ఎలక్ట్రిక్ వాహనం కొనాలంటే ఫస్ట్ చూసేది రేంజ్.. ఆ తర్వాత ధర. ఈ రెండు విషయాల్లో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే తక్కువ ధరతో వచ్చేది ఎక్కువ రేంజ్ ఇవ్వదు. ఎక్కువ రేంజ్ ఇచ్చేది తక్కువ ధరకు రాదు. దీంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే.. ఛార్జర్. ఛార్జర్ పెద్దగా ఉండడం వల్ల దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెంట తీసుకెళ్లాలన్నా గానీ కుదరదు. కంపెనీ వాళ్ళు ఇచ్చే బూట్ స్పేస్ లో హెల్మెట్ మాత్రమే పట్టే స్పేస్ ఉంటుంది. అంత చిన్న స్పేస్ లో ఛార్జర్ ఒక్కటే పెడితే వేరే వస్తువులు పెట్టే వీలు ఉండదు. దీని వల్ల కూడా ఇబ్బందే. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ ఐవూమీ ఎనర్జీ కంపెనీ సరికొత్త బ్యాటరీ, సరికొత్త ఛార్జర్ తో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చింది.
దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది చిన్న సైజు బ్యాటరీ, చిన్న సైజు ఛార్జర్ తో వస్తుంది. సైజు చిన్నదే కదా అని తీసిపడేయడానికి లేదు. ఎందుకంటే దీని సర్టిఫైడ్ రేంజ్ ఏకంగా 110కి.మీ.గా ఉంది. ఐవూమీ కంపెనీకి చెందిన ఎస్1 మోడల్ స్కూటర్ తక్కువ ధరకే ఎక్కువ రేంజ్ నిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 55 కి.మీ.గా ఉంది. రెండు గంటల్లో 0 నుంచి 50 శాతం వరకూ ఛార్జ్ అయిపోతుంది. 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. ఇది సర్జ్ ప్రొటెక్టర్ తో వస్తుంది. అలానే ప్రొటెక్షన్ ఫ్యుజ్ ఫ్యూజ్ తో వస్తుంది. బ్యాటరీపై మూడేళ్ల వారంటీ లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. మోటార్ మీద రెండేళ్లు లేదా 30 వేల కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నారు. వెహికల్ మీద ఏడాది వారంటీ లేదా 30 వేల కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నారు. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎస్1, ఎస్1 80, ఎస్1 200, ఎస్1 400 వేరియంట్స్ లో వస్తుంది. ఈ నాలుగు వేరియంట్స్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. ఎకనామికల్, రైడర్, స్పీడ్ అనే మోడ్స్ ఇచ్చారు.
పార్కింగ్ మోడ్, రివర్స్ గేర్, గ్లోవ్ బాక్స్, హజార్డ్ మోడ్, ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ టైప్ కీ, యాంటీ థెఫ్ట్ లాకింగ్ సిస్టం వంటి ఫీచర్స్ ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్, ఓవర్ కరెంట్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఫీచర్ తో వస్తుంది. కంట్రోలర్, మోటార్, బ్యాటరీ, ఛార్జర్ లు థర్మల్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. ఎస్1 ప్రారంభ ధర రూ. 54,999గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ ధరకే వస్తుంది కదా బిల్డ్ క్వాలిటీ బాగోదేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే దీన్ని ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో ఇస్తుంది కంపెనీ. ప్రీమియం బిల్ట్ క్వాలిటీ, రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇండియాలోనే లేటెస్ట్ ఛార్జర్ తో వస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాడే పవర్ బ్యాంకు సైజులో వస్తుంది. కాబట్టి దీన్ని సులువుగా క్యారీ చేయవచ్చు. బ్యాటరీ సైజు కూడా చిన్నదిగా ఉండడం వల్ల బూట్ స్పేస్ అనేది పెద్దగా ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఇచ్చారు. కంపెనీ వెబ్ సైట్ లో ప్రీబుక్ చేసుకోవచ్చు. అలానే టెస్ట్ రైడ్ కోసం బుక్ చేసుకోవచ్చు.