nagidream
Best EV Under 1 Lakh Budget: లక్ష రూపాయల లోపు బడ్జెట్ లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఓ లుక్కేయండి. దీన్ని మీరు కేవలం రూ/ 399కే బుక్ చేసుకోవచ్చు.
Best EV Under 1 Lakh Budget: లక్ష రూపాయల లోపు బడ్జెట్ లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఓ లుక్కేయండి. దీన్ని మీరు కేవలం రూ/ 399కే బుక్ చేసుకోవచ్చు.
nagidream
మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. ఐవూమీ ఎనర్జీ కంపెనీ జీత్ ఎక్స్ జడ్ఈ పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూపొందించింది. 140 కి.మీ. మైలేజ్, గంటకు 60 కి.మీ. స్పీడ్ తో వస్తుంది. బ్యాటరీ 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవ్వడానికి 5 గంటల సమయం పడుతుంది. బ్యాటరీపై ఐదేళ్ల వారంటీ ఇస్తుంది కంపెనీ. కలర్ ఫుల్ స్పీడో మీటర్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, స్టెప్ బై స్టెప్ నావిగేషన్, జీఈఓ ఫెన్సింగ్, ఎస్ఓసి అలర్ట్స్ వంటి ఫీచర్స్ ఇచ్చారు. దీన్ని స్మార్ట్ ఫోన్ యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీడో మీటర్ లో డిస్టెన్స్ టూ ఎండ్ (డీటీఈ) ఫీచర్ కూడా ఉంది. అంటే మీరు ఇంకా ఎంత ఛార్జింగ్ ఉంది.. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అనేది తెలుస్తుంది.
ఐవూమీ జీత్ ఎక్స్ జడ్ఈ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేసిక్ వేరియంట్ లో 2.1 కిలోవాట్ బ్యాటరీ ఇచ్చారు. మిడ్ వేరియంట్ లో 2.5 కిలోవాట్ బ్యాటరీ ఇచ్చారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ కి 3 కిలోవాట్ బ్యాటరీ ఇచ్చారు. 3 కిలోవాట్ బ్యాటరీతో వస్తున్న టాప్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 99,999గా కంపెనీ నిర్ణయించింది. 2.5 కిలోవాట్ బ్యాటరీతో వస్తున్న వేరియంట్ ధర రూ. 94,999గా కంపెనీ నిర్ణయించింది. ఇక 2.1 కిలోవాట్ తో వస్తున్న బేసిక్ వేరియంట్ ధర రూ. 89,999గా కంపెనీ నిర్ణయించింది. బేసిక్ వేరియంట్ రేంజ్ సింగిల్ ఛార్జ్ తో 120 కి.మీ. ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 63 కి.మీ.గా ఉంది. 2.5 కిలోవాట్ తో వస్తున్న మిడ్ వేరియంట్ 100 నుంచి 140 కి.మీ. రేంజ్ తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 63 కి.మీ.గా ఉంది.
3 కిలోవాట్ బ్యాటరీతో వస్తున్న స్కూటర్ 130 నుంచి 170 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఇది కూడా గంటకు 63 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ మూడు వేరియంట్లకు సంబంధించి బ్యాటరీలపై ఐదేళ్ల వారంటీ ఇస్తుంది కంపెనీ. లేదా 50 వేల కి.మీ. వరకూ వారంటీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే.. దీని బ్యాటరీ అనేది చిన్నగా ఉంటుంది. అలానే దీని ఛార్జర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. దీంతో మీరు ఈ ఛార్జర్ ని సులువుగా తీసుకెళ్లవచ్చు. ఇది గ్రే, రెడ్, గ్రీన్, రోజ్, గోల్డ్, బ్లూ, సిల్వర్, బ్రౌన్ మొత్తం 8 కలర్స్ లో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 399 రూపాయలకే బుక్ చేసుకోవచ్చు.