iDreamPost
android-app
ios-app

పన్ను రీఫండ్ పెండింగ్‌లో ఉందా? 2025 ఏడాది చివరి నాటికి ప్రాసెస్ కానున్న ఐటీఆర్

  • Published Aug 28, 2024 | 3:11 PM Updated Updated Aug 28, 2024 | 3:11 PM

Good News To Tax Payers: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఎవరైతే పన్ను రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి గుడ్ న్యూస్. రీఫండ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో అనే విషయాన్ని ఆదాయపు పన్ను చట్టాలు మాజీ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ వెల్లడించారు.

Good News To Tax Payers: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఎవరైతే పన్ను రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి గుడ్ న్యూస్. రీఫండ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో అనే విషయాన్ని ఆదాయపు పన్ను చట్టాలు మాజీ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ వెల్లడించారు.

పన్ను రీఫండ్ పెండింగ్‌లో ఉందా? 2025 ఏడాది చివరి నాటికి ప్రాసెస్ కానున్న ఐటీఆర్

పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలానే ఐటీఆర్ ని ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసే వరకూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ పన్ను చెల్లించాలా? లేక పన్ను రీఫండ్ ఏమైనా పొందవచ్చా? అనేది పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాతే ఎక్కువ పన్ను చెల్లించాలా? లేక ట్యాక్స్ రిఫండ్ ఏమైనా పొందుతారా? అనే విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ తెలియజేస్తుంది. అది కూడా ట్యాక్స్ రీఫండ్ క్లెయిమ్ చేసుకుంటేనే తెలియజేస్తుంది. మీరు కనుక జూలై నెలలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి పన్ను రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. దీన్ని ప్రాసెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ చట్టబద్ధంగా ఎంత సమయం తీసుకుంటుందో అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన అసెస్మెంట్ ఏడాది ముగిసిన తర్వాత 9 నెలల లోపు ఐటీ రిటర్న్స్ ని ప్రాసెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు ఆదాయపు పన్ను చట్టాలు అనుమతి ఇస్తాయని.. ఆదాయపు పన్ను చట్టాలు మాజీ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్, ట్యాక్స్ బడ్డీ ఫౌండర్ సుజిత్ బాంగర్ అన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ఆర్థిక ఏడాది 2023-24 (అసెస్మెంట్ ఏడాది 2024-25) కోసం ఐటీఆర్ దాఖలు చేశారో వారి ఐటీఆర్ ని ప్రాసెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు డిసెంబర్ 31, 2025 వరకూ సమయం ఉంది. ఐటీఆర్ ప్రాసెస్ అయితేనే ఆదాయపు పన్ను రీఫండ్ అనేది మీకు చెల్లించడానికి వీలవుతుందని సుజిత్ అన్నారు. ఈ గడువు తేదీ ఆలస్యంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి కూడా వర్తిస్తుందని అన్నారు.

ఆర్థిక ఏడాది 2023-24 (అసెస్మెంట్ ఏడాది 2024-25) కోసం ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు తేదీ 2024 జూలై 31. ఈ గడువు తేదీలోపు ఎవరైతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదో వారు డిసెంబర్ 31 2024లోగా అంతకు ముందు ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చునని సుజిత్ వెల్లడించారు. ఆలస్యంగా దాఖలు చేసిన అంతకు ముందు ఐటీ రిటర్న్స్ ని కూడా 2025 డిసెంబర్ 31న గానీ లేదా అంతకు ముందు గానీ ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రీఫండ్ మీద వడ్డీ కూడా పొందుతారని సుజిత్ అన్నారు. రీఫండ్ అమౌంట్ అనేది వాస్తవ పన్ను బాధ్యత కంటే 10 శాతం కంటే ఎక్కువ ఉంటే అప్పుడు వడ్డీ అనేది చెల్లిస్తారు.

ఉదాహరణకు పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన పన్ను 15 వేలు అయితే 20 వేలు చెల్లించినట్లైతే కనుక.. వారికి 5 వేల రూపాయలు రీఫండ్ వస్తాయి. అయితే ఈ 5 వేల రూపాయలకు వడ్డీ కలిపి పన్ను చెల్లింపుదారులకు ఇవ్వడం జరుగుతుందని సుజిత్ పేర్కొన్నారు. వాస్తవ పన్ను 15 వేలలో 10 శాతం అంటే 1500 రూపాయలు. ఈ 1500 రూపాయల కంటే మీరు చెల్లించిన అదనపు పన్ను 5 వేలు ఎక్కువ కాబట్టి ఆదాయపు పన్ను శాఖ ఈ డబ్బుని రీఫండ్ ఇస్తుంది. అది కూడా వడ్డీ వేసి ఇస్తుందని సుజిత్ బాంగర్ వెల్లడించారు. ఆదాయపు పన్ను రీఫండ్ మీద నెలకు 0.5% వడ్డీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఇవ్వాలనేది ఆదాయపు పన్ను నియమాలు చెబుతున్నాయి.

జూలై 31న లేదా అంతకు ముందు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లయితే ఆదాయపు పన్ను మీద వడ్డీ అనేది ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ రీఫండ్ తేదీ వరకూ లెక్కిస్తారు. ఒకవేళ అంతకు ముందు ఐటీ రిటర్న్స్ ని ఆలస్యంగా దాఖలు చేసినట్లయితే దాఖలు చేసిన తేదీ నుంచి రీఫండ్ తేదీ వరకూ వడ్డీ అనేది లెక్కించబడుతుంది. జూలై 1 2024న ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఐటీఆర్ ప్రాసెస్ అనేది 2024 అక్టోబర్ 31న జరుగుతుంది. ట్యాక్స్ రీఫండ్ మీద వడ్డీని ఏప్రిల్ 2024 నుంచి అక్టోబర్ 21 2024 వరకూ అంటే ఏడు నెలల వరకూ నెలకు 0.5% చొప్పున వడ్డీ చెల్లిస్తుంది.