iDreamPost

HYDలో గచ్చిబౌలి లాంటి ఏరియాపై ఐటీ ఉద్యోగుల కన్ను.. ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభాలు!

Another Gachibowli: ఒకప్పుడు ఐటీ ఉద్యోగుల ఇంటికి దారేది అంటే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూపించేవారు. ఇక ఫ్యూచర్ లో హైదరాబాద్ లో ఉన్న ఈ ఏరియాని కూడా ఐటీ ఉద్యోగులకు కేరాఫ్ అడ్రస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంపై ఐటీ ఉద్యోగులు ఫోకస్ పెట్టారు. దీంతో ఆ ఏరియా మరో గచ్చిబౌలిగా మారనుందని చెబుతున్నారు.

Another Gachibowli: ఒకప్పుడు ఐటీ ఉద్యోగుల ఇంటికి దారేది అంటే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూపించేవారు. ఇక ఫ్యూచర్ లో హైదరాబాద్ లో ఉన్న ఈ ఏరియాని కూడా ఐటీ ఉద్యోగులకు కేరాఫ్ అడ్రస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంపై ఐటీ ఉద్యోగులు ఫోకస్ పెట్టారు. దీంతో ఆ ఏరియా మరో గచ్చిబౌలిగా మారనుందని చెబుతున్నారు.

HYDలో గచ్చిబౌలి లాంటి ఏరియాపై ఐటీ ఉద్యోగుల కన్ను.. ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభాలు!

ఐటీ ఉద్యోగులు ఎక్కడ కర్చీఫ్ ఏస్తే అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ అందుకోబోతుందని అర్థం. ఇన్నాళ్లు ఐటీ ఉద్యోగులకు స్థిర నివాసాలకు కేరాఫ్ అడ్రస్ అంటే వెస్ట్ హైదరాబాద్ గా ఉండేది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, మియాపూర్ వంటి ఏరియాల్లో ఇళ్ళు కొనుక్కుని స్థిర నివాసం ఏర్పరచుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఐటీ హబ్స్ అనేవి మిగతా ప్రాంతాలకు విస్తరించడం, మెట్రో రైలు అందుబాటులో ఉండడం వంటి వాటి వల్ల ఐటీ ఉద్యోగుల ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి. మెట్రో సౌకర్యం, మౌలిక వసతులు, ఐటీ హబ్ ఏర్పాటు వంటి వాటివి అందుబాటులో ఉండడం వల్ల ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు కొనుగోలు చేసేందుకు ఇప్పుడు ఐటీ ఉద్యోగులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకూ.. హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకూ మెట్రో అందుబాటులోకి రావడంతో ఐటీ కారిడార్ కి దూరం తగ్గింది.

ఐటీ ఉద్యోగుల కన్ను:

దీంతో ఐటీ ఉద్యోగులు ఉప్పల్ నుంచి 15 కి.మీ. దూరంలో ఇళ్లు నిర్మించేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉప్పల్, బోడుప్పల్, పోచారం, పీర్జాదిగూడ, నారపల్లి, ఘట్కేసర్ వరకూ కొత్త నిర్మాణాలు విస్తరించాయి. వెస్ట్ హైదరాబాద్ లో ఇంటి కోసం పెట్టే ఖర్చులో సగం ఈ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే.. విశాలమైన స్థలంలో ఇల్లు దొరుకుతుండడంతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సొంతిళ్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు అందుబాటులో ఉండడం, లింక్ రోడ్లు, నీటి సదుపాయం, మౌలిక వసతుల అభివృద్ధి, కనెక్టివిటీ వంటివి బాగుండడంతో ఐటీ ఉద్యోగులు ఈ ఏరియాపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లై ఓవర్ ని నిర్మిస్తుంది.

ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభాలు:

ఇక ఉప్పల్ లో ఎన్ఎస్ఎల్ ఐటీ సెజ్, పోచారం రహేజా మైండ్ స్పేస్ లో ఇన్ఫోసిస్ సంస్థల ఐటీ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ఉప్పల్ పరిసర ప్రాంతంలో స్థలాలు, ఇండ్ల ధరలు రెండేళ్లలో బాగా పెరిగాయి. అంతకు ముందు 25 లక్షల నుంచి 40 లక్షలు ఉన్న ఇళ్ల ధరలు ఇప్పుడు 40 లక్షల నుంచి 80 లక్షలు పలుకుతున్నాయి. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో స్థలాల మీద గానీ, ఇండ్ల మీద పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో రెట్టింపు లాభాలు పొందే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఐటీ ఉద్యోగులు ఫోకస్ చేసిన ఉప్పల్ మరో గచ్చిబౌలిగా మారే అవకాశం లేకపోలేదని.. ఈ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది పెరుగుతుందని అంటున్నారు. ఉప్పల్ లో చదరపు అడుగు ఇండ్ల స్థలం ధర రూ. 5,500 పలుకుతుంది. ఇక ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బోడుప్పల్, పీర్జాదిగూడ, నారపల్లి, పోచారం, ఘట్కేసర్ ప్రాంతాల్లో చదరపు అడుగు రూ. 3,200 నుంచి రూ. 5,500 వరకూ ఉంది. స్ధలాల రేట్లు ఈ ఇండ్ల ధరల కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి స్థలాల మీద, ఇళ్ల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలను ఆశించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి