iDreamPost
android-app
ios-app

2 లక్షలకే టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. నిజంగానే వస్తుందా? సాధ్యమేనా?

Is Tata Nano EV Car Coming Under 2 Lakh Price?: టాటా నానో ఎలక్ట్రిక్ కారు రావడం అయితే పక్కా. కానీ ఎంత ధరలో వస్తుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే 2 లక్షలకే అందుబాటులోకి తీసుకొస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత? ఈ ధరకు నానో ఈవీని తీసుకురావడం సాధ్యమేనా?

Is Tata Nano EV Car Coming Under 2 Lakh Price?: టాటా నానో ఎలక్ట్రిక్ కారు రావడం అయితే పక్కా. కానీ ఎంత ధరలో వస్తుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే 2 లక్షలకే అందుబాటులోకి తీసుకొస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత? ఈ ధరకు నానో ఈవీని తీసుకురావడం సాధ్యమేనా?

2 లక్షలకే టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. నిజంగానే వస్తుందా? సాధ్యమేనా?

టాటా నానో అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. మిడిల్ క్లాస్ వాళ్ళు బైక్ మీద ప్రయాసలు పడుతూ వెళ్తుండడం చూసి చాలించి పోయిన రతన్ టాటా.. లక్ష రూపాయలకే నానో కారుని తీసుకొచ్చి ఒక విప్లవం సృష్టించారు. అయితే కొన్ని రోజుల తర్వాత కొన్ని కారణాల వల్ల నానో కారు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో చాలా మంది మిడిల్ క్లాస్ వారు తమ కలల కారు ఇక రాదని తెలిసి బాధపడ్డారు. మళ్ళీ ఇన్నాళ్లకు టాటా నానో ఈవీ పేరుతో వస్తుందని తెలిసి చాలా మంది అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నానో కారుకి సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి. 2 లక్షల బడ్జెట్ లో 200 కి.మీ. రేంజ్ తో కారుని లాంఛ్ చేయబోతున్నారని చాలా మంది వీడియోలు చేస్తున్నారు. కథనాలు రాస్తున్నారు. అయితే నిజంగానే టాటా నానో కారు 2 లక్షలకే వస్తుందా? 200 కి.మీ. రేంజ్ తో వస్తుందా? అసలు ఈ ధరకు, ఈ రేంజ్ తో రావడం సాధ్యమేనా? అనేది ఇప్పుడు చూద్దాం. 

మామూలుగా 70 కి.మీ. రేంజ్ తో, 60 కి.మీ. టాప్ స్పీడ్ తో వెళ్లే ఎలక్ట్రిక్ 2 వీలర్ కొనాలంటే కనీసం లక్ష రూపాయలు అవుతుంది. ఈ రేంజ్, టాప్ స్పీడ్ కలిగిన వెహికల్ లో బ్యాటరీ 2 కిలోవాట్ కెపాసిటీ ఉంటుంది. 2 కిలోవాట్ అంటే కనీసం 30 వేలు ఉంటుంది. ఇక 2 కిలోవాట్ మోటార్ కి 30 వేలు ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ బాడీకి, ఇతర భాగాలకు అన్నిటికీ కలిపి 40 వేలు అవుతుంది. మొత్తం మీద 70 కి.మీ. రేంజ్, 60 కి.మీ. టాప్ స్పీడ్ తో ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ ధరే లక్ష రూపాయలుగా ఉంది. ఓలా ఎస్1ఎక్స్ స్కూటర్ చూసుకుంటే 4 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. 193 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్ తో వస్తుంది. ఇది రియల్ రేంజ్ కాదు. దీని ఎక్స్ షోరూం ధర రూ. 99,999 ఉంది. ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కలుపుకుంటే రూ. 1,13,000 అవుతుంది.

ఇదే బ్యాటరీ, మోటార్ కెపాసిటీతో కారు రావడం అనేది కుదరదు. కాబట్టి బ్యాటరీ, మోటార్ కెపాసిటీ పెంచాల్సి ఉంటుంది. 10 కిలోవాట్ సామర్థ్యం ఉన్న మోటార్, బ్యాటరీని ఫిక్స్ చేస్తే 200 కి.మీ. రేంజ్ అనేది వస్తుంది. అప్పుడు బ్యాటరీకి కిలోవాట్ 15 వేలు అనుకుంటే లక్షా 50 వేలు అవుతుంది. ఇక మోటార్ కి ఎలా కాదన్నా కంట్రోలర్ తో కలిపి లక్ష రూపాయలు అవుతుంది. టాటా కంపెనీ వీటిని సొంతంగా చేసుకున్నా గానీ ఎంత కాదన్నా 2 లక్షలు అవుతుంది. కేవలం మోటార్, బ్యాటరీకే 2 లక్షలు అయినప్పుడు ఇక లోపల ఇంటీరియర్ కి, బాడీకి, ఇతర భాగాలకు ఎంత అవుతుందో చూసుకోండి. అందులోనూ టాటా మోటార్స్ కంపెనీ కారు బాడీ విషయంలో ఎక్కడా రాజీ పడదు.

స్ట్రాంగ్ మెటీరియల్ ని వాడుతుంది. కాబట్టి చీప్ రేటు బాడీతో అయితే కారుని లాంఛ్ చేయదు. 200 కి.మీ. రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ కారుని నానో తీసుకురావాలంటే బ్యాటరీతో ఎంత కాదన్న 4 లక్షలు అవుతుంది. 2 లక్షల లోపు అనేది అసాధ్యం. ఒకవేళ టాటా కంపెనీ కనుక బ్యాటరీ లేకుండా రెంట్ బేస్డ్ లాంఛ్ చేస్తే కనుక 2 లక్షలకు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై టాటా మోటార్స్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 200 కి.మీ. రేంజ్ తో ఎలక్ట్రిక్ కారుని తీసుకొస్తున్నట్టు గానీ ఎక్కడా నిర్ధారించలేదు. నానో ఎలక్ట్రిక్ కారుని అయితే తీసుకొస్తుంది. కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం బయటపెట్టలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి