iDreamPost
android-app
ios-app

పెట్టుబడిపై అధిక వడ్డీ కావాలా?..ఇన్వెస్ట్ చేసేందుకు బెస్ట్ స్కీంలు ఇవే

పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అదే సమయంలో అధిక వడ్డీా కూడా పొందాలనుకుంటున్నారా? అయితే అధిక వడ్డీని అందించే ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే?

పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అదే సమయంలో అధిక వడ్డీా కూడా పొందాలనుకుంటున్నారా? అయితే అధిక వడ్డీని అందించే ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే?

పెట్టుబడిపై అధిక వడ్డీ కావాలా?..ఇన్వెస్ట్ చేసేందుకు బెస్ట్ స్కీంలు ఇవే

డబ్బు సంపాదన కోసం.. ఉన్నడబ్బును రెట్టింపు చేసుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలేంటని ఆరా తీస్తుంటారు ఇన్వెస్టర్లు. పెట్టిన పెట్టుబడిపై అధిక వడ్డీ పొందాలని చూస్తుంటారు. ఇందుకోసం ఏ పథకాలైతే బెస్ట్ అని ఆలోచిస్తుంటారు. మరి మీరు కూడా మీ పెట్టుబడిపై అధిక వడ్డీ పొందాలనుకుంటే ఆ రెండు పథకాలు ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఆ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడిని అందుకోవచ్చు. ప్రజల కోసం కేంద్రం ఆద్వార్యంలో పనిచేస్తున్న పోస్టాఫీస్ పొదుపు స్కీంలను ప్రవేశపెడుతోంది. వాటిల్లో ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన, మరొకటి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం. ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ లభిస్తుంది.

మహిళలు, బాలికలు, వృద్ధుల కోసం పోస్టాఫీస్ పొదుపు పథాకలు, మంత్లీ ఇన్ కం స్కీంలు, రికరింగ్ డిపాజిట్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ పథకాల్లో బ్యాంకుల్లో చెల్లించే వడ్డీ కంటే ఎక్కువగా వస్తుంది. అయితే సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుతం అధిక వడ్డీ లభిస్తుంది. ఇందులో పొదుపు చేస్తే ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందుకోవచ్చు. ఇక ఈ పథకం తర్వాత అధిక వడ్డీ పొందాలంటే సీనియర్ సిటిజన్ స్కీంతోనే సాధ్యం. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో జనవరి 1, 2024 నుంచి ప్రతి నెలా రూ.20 వేలు పెట్టుబడి పెట్టే వారికి ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. కేవలం 1000 రూపాయలతో ఇందు లో పెట్టుబడి పెట్టొచ్చు.

ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షల వరకు ఉంటుంది. రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. అంటే మీకు నెలకు రూ. 20,500 ఆదాయం సమకూరుతుందన్నమాట. ఇందులో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వ్యక్తి లేదంటే జీవిత భాగస్వా మితో ఉమ్మడి ఖాతాను ఓపెన్ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో 5 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. రూ.15 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ పథకంలో చేరాలని భావిస్తే సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుని ప్రారంభించొచ్చు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş