iDreamPost

IT ఉద్యోగులకు శుభవార్త..కీలక ప్రకటన చేసిన ఇన్ఫోసిస్! ఇక ఆ టెన్షన్ లేదు!

Infosys: గతేడాది నుంచి భారీ సంఖ్యలో ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా ఐటీ కంపెనీ తమ సంస్థలో భారీగా లే ఆఫ్స్ ను ప్రకటించాయి. దీంతో ఇక ఎప్పుడు, ఎవరి జాబ్ ఊడిపోతుందో తెలియక చాలా మంది టెక్ ఎంప్లాయిస్ టెన్షన్ లో ఉన్నారు. ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Infosys: గతేడాది నుంచి భారీ సంఖ్యలో ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా ఐటీ కంపెనీ తమ సంస్థలో భారీగా లే ఆఫ్స్ ను ప్రకటించాయి. దీంతో ఇక ఎప్పుడు, ఎవరి జాబ్ ఊడిపోతుందో తెలియక చాలా మంది టెక్ ఎంప్లాయిస్ టెన్షన్ లో ఉన్నారు. ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

IT ఉద్యోగులకు శుభవార్త..కీలక ప్రకటన చేసిన ఇన్ఫోసిస్!  ఇక ఆ టెన్షన్ లేదు!

ప్రస్తుతం ఐటీ, టెక్ రంగానికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది నుంచి భారీ సంఖ్యలో ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా ఐటీ కంపెనీ తమ సంస్థలో భారీగా లే ఆఫ్స్ ను ప్రకటించాయి. దీంతో ఇక ఎప్పుడు, ఎవరి జాబ్ ఊడిపోతుందో తెలియక చాలా మంది టెక్ ఎంప్లాయిస్ టెన్షన్ లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఐటీ ఉద్యోగం అంటే.. ఎప్పుడు ఊడుతుందో తెలియదున్నట్లు పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది అందులో పని చేసే ఐటీ ఉద్యోగులకు శుభవార్తే అని చెప్పాలి. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

గత సంవత్సరం నుంచి ఐటీ రంగంలో చాలా ఉద్యోగాలు పోయాయి. గూగుల్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పలు ప్రముఖ సంస్థలు కూడా ఉద్యోగుల లేఆఫ్స్ ను ప్రకటించాయి.  ఇలా చాలా ఐటీ సంస్థలు వేలాది మందిని తొలగించాయి. ఈ క్రమంలో ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందనే ఆందోళనలో ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంచలన ప్రకటన చేసింది.  తమ సంస్థలో ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్‌ ఫరేఖ్‌ స్పష్టం చేశారు.  ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వల్ల టెక్ కంపెనీలు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నా తమ ఉద్యోగులను మాత్రం తొలగించ బోమని స్పష్టం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థలో జనరేటివ్‌ ఏఐతో సహా వివిధ టెక్నికల్ ను ఏకీకృతం చేస్తున్నామని తెలిపారు.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తొలగించే బదులుగా సాంకేతిక పురోగతి కోసం కొత్త అవకాశాలను సృష్టించవచ్చని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు ఉత్తమమైన సేవలందించేందుకు జనరేటివ్ ఏఐలో నియామకాలు జరుపుతామని తెలిపారు. అయితే ఇతర కంపెనీల మాదిరిగా ఉద్యోగులను తొలగించే ఆలోచన తమకు లేదని సలీల్ ఫరేఖ్ స్పష్టం చేశారు. ఇక సీఈవో చేసిన ప్రకటన ఇన్ఫోసిస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిఇలా ఉంటే.. ఇటీవలే ఇన్ఫోసిస్ ఉద్యోగుల పని తీరు ఆధారంగా బోనస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ అలా ఉంచితే.. టెకీ నిపుణలు, కొన్ని నివేదికలు ఐటీ ఉద్యోగుల విషయంలో కీలక  విషయాలను వెల్లడించాయి. ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే టెక్‌ ఉద్యోగాల్లో కోత తప్పదని పలు నివేదికలు పేర్కొన్నాయి. కాస్ట్ కటింగ్‌ పేరిట లేఆఫ్స్‌ ప్రకటిస్తున్న కంపెనీల్లో తిరిగి కొలువులు పుంజుకోవడానికి  చాలా సమయం పడుతుందని టెక్‌ నిపుణులు సైతం  అభిప్రాయా పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫోసిస్‌ మాత్రం ఉద్యోగులను తొలగించమని ప్రకటించడం గమనార్హం. ఇది ఆ సంస్థలో టెకీలకు ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు. మరి.. ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి