iDreamPost
android-app
ios-app

22 లక్షలకే 3 BHK విల్లా కట్టి ఇస్తున్నారు! సామాన్యులకి ఇంతకంటే గొప్ప అవకాశం ఉండదు!

  • Published May 10, 2024 | 4:26 PM Updated Updated May 10, 2024 | 4:26 PM

22 లక్షలకే 3 బీహెచ్కే విల్లనా? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజమే. 22 లక్షలకే 183 గజాల్లో విశాలమైన 3 బీహెచ్కే ఇల్లు కట్టించి ఇస్తున్నారు. కార్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళకి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు.

22 లక్షలకే 3 బీహెచ్కే విల్లనా? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజమే. 22 లక్షలకే 183 గజాల్లో విశాలమైన 3 బీహెచ్కే ఇల్లు కట్టించి ఇస్తున్నారు. కార్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళకి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు.

22 లక్షలకే 3 BHK విల్లా కట్టి ఇస్తున్నారు! సామాన్యులకి ఇంతకంటే గొప్ప అవకాశం ఉండదు!

హైదరాబాద్ లో ఉండాలని మీరు భావిస్తున్నారా? హైదరాబాద్ లో ఒక సొంత ఇల్లు ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోలేకపోయామే అని బాధపడుతున్నారా? అయితే బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక హైదరాబాద్ లో మిస్ అయితే మరో హైదరాబాద్ లో ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అవును హైదరాబాద్ లో స్థలాలు దొరికే పరిస్థితి లేదు. దొరికినా సామాన్యుడికి అందే పరిస్థితి లేదు. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాల మీద దృష్టి సారించారు. ఆ ఏరియాలను కూడా డెవలప్ చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో అనేక ప్రాజెక్టులు మొదలై సగం పనులు పూర్తయ్యాయి. కొంతమంది ఆ ఏరియాల్లో ఇళ్ళు కొనుక్కుని అక్కడ నుంచి కార్యాలయాలకు డైలీ అప్ అండ్ డౌన్ జర్నీ చేస్తున్నారు.

అలాంటి ఏరియాలో మీరు సొంత ఇల్లు కావాలి అనుకుంటే.. అది కూడా చాలా తక్కువ బడ్జెట్ కే సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే సువర్ణావకాశం. 3 బీహెచ్కే విల్లా.. ఇండివిడ్యువల్ హౌజ్ ని కేవలం 22 లక్షలకే కట్టించి ఇస్తున్నారు. స్థలం కూడా వస్తుంది. డీటీసీపీ, రెరా అప్రూవల్స్ తో రావడం విశేషం. 22 లక్షలకు గేటెడ్ కమ్యూనిటీలో 183 చదరపు గజాల స్థలంలో.. 1260 చదరపు అడుగుల్లో 3 బీహెచ్కే హౌజ్ ని నిర్మించి ఇస్తున్నారు. ఈ ఇంటిలో 3 బెడ్రూమ్ లు, ఒక వంటగది, ఒక పూజ గది, హాల్, డైనింగ్ హాల్, కార్ పార్కింగ్ సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రతి ఇంటికీ వాటర్ కనెక్షన్, పవర్ సప్లై, 60 అడుగుల మెయిన్ రోడ్డు, 40 అడుగుల రోడ్డు ఇంటర్నల్ రోడ్డు, రెండు పార్కులు, ఆ పార్కుల్లో పిల్లల కోసం ప్లే ఏరియా వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు పిల్లల కోసం స్కూల్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 400 కంటే ఎక్కువ ఇండ్లని ఇక్కడ నిర్మిస్తున్నారు. 26 నెలల్లో ఇల్లు నిర్మించి మీ చేతికి అందిస్తారు.

 ఎందుకు ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి?:

జహీరాబాద్ ని మరో హైదరాబాద్ గా డెవలప్ చేస్తున్నారు. పిల్లలు చదువుకోవడానికి వాక్సన్ యూనివర్సిటీ ఉంది. అలానే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సహా పలు ఇండస్ట్రీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ ఏరియాలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఆల్రెడీ డెవలప్ అవుతోంది. 13,500 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు. కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. కొన్ని కంపెనీలు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టాయి. ఈ నిమ్జ్ ప్రాజెక్ట్ పూర్తయితే రెండు లక్షల 77 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.

ఈ ఏరియా బీదర్ ఎయిర్ పోర్ట్ కి 30 కి.మీ. దూరంలో ఉంది. ఆ ఎయిర్ పోర్ట్ ని కూడా అప్ గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక జహీరాబాద్ రైల్వే స్టేషన్ ని వందేభారత్ మిషన్ కింద అప్ గ్రేడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 10 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్ల జహీరాబాద్ లో ల్యాండ్ కి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వారికి రెండు, మూడేళ్లలో మంచి లాభాలను ఆశించవచ్చు. ఇంటి విలువ కూడా పెరిగిపోతుంది. ఈ ఏరియాని మరో హైదరాబాద్ అని, మరో గచ్చిబౌలి అని రియల్ ఎస్టేట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభమే అని అంటున్నారు. 

స్పాట్ పేమెంట్, డౌన్ పేమెంట్ ఎంత?:

స్పాట్ పేమెంట్ చేసేవాళ్ళు 22 లక్షలు కడితే ఇల్లు కట్టి ఇస్తారు. అలా కాకుండా ఈఎంఐ కట్టుకుంటాం అంటే గనుక 26 లక్షలకు ఇల్లు నిర్మించి ఇస్తారు. దీని కోసం 5 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 50 వేల చొప్పున 36 నెలలకు మొత్తం 15 లక్షలు ఈఎంఐ చెల్లించాలి. అలానే ప్రతి 6 నెలలకు ఒకసారి లక్ష రూపాయల చొప్పున చెల్లించాలి. ఈఎంఐలో ఇల్లు కొనుక్కున్నందుకు మొత్తం 26 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

లొకేషన్ ఎక్కడ?:

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి అతి దగ్గరలో ఈ లొకేషన్ ఉంది. 

గమనిక: ఈ కథనం కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.