iDreamPost
android-app
ios-app

IPPB: పోస్టాఫీస్‌ నుంచి అదిరిపోయే పథకం.. రూ.555తో 10 లక్షలు

  • Published Jul 08, 2024 | 2:36 PM Updated Updated Jul 08, 2024 | 2:36 PM

పోస్టాఫీస్‌ నుంచి అద్భుతమైన స్కీమ్‌ వచ్చింది. ఏడాదికి 555 రూపాయలు చెల్లిస్తే.. 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఆ పథకం వివరాలు..

పోస్టాఫీస్‌ నుంచి అద్భుతమైన స్కీమ్‌ వచ్చింది. ఏడాదికి 555 రూపాయలు చెల్లిస్తే.. 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఆ పథకం వివరాలు..

  • Published Jul 08, 2024 | 2:36 PMUpdated Jul 08, 2024 | 2:36 PM
IPPB: పోస్టాఫీస్‌ నుంచి అదిరిపోయే పథకం.. రూ.555తో 10 లక్షలు

నేటి కాలంలో జనాల్లో పొదుపు మీద అవగాహన బాగా ఉంది. ఎందుకంటే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు.. ఎప్పుడు, ఎక్కడి నుంచి సమస్య వస్తుందో చెప్పలేము. నేటి కాలంలో అనారోగ్యం బారిన పడినా.. ప్రమాదాలకు గురైనా లక్షల్లో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సేవింగ్స్‌ ఉంటే సమస్య నుంచి గట్టెక్కవచ్చు. లేదంటే సమయానికి డబ్బు పుట్టక.. ఒకవేళ దొరికినా.. దానికి ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి రావడంతో అది కుటుంబాన్ని ఆర్థికంగా చిదిమేస్తుంది. కరోనా కాలంలో ఈ విషయం ప్రతి ఒక్కరికి బాగా అర్థం అయ్యింది. అప్పటి నుంచి జనాలకు పొదుపుపై అవగాహన బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు, ఆరోగ్య బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా పోస్టాఫీస్‌ తీసుకువచ్చిన ఓ అద్భుతమైన పథకం గురించి తెలుసుకొండి. దీనిలో కేవలం 555 రూపాయలు కడితే.. 10 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. ఆ వివరాలు..

వైద్యం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. నేటి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఇటీవల అతి తక్కువ ప్రీమియంతో.. అద్భుతమైన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 18-65 ఏళ్ల వయసు వారు వీటిలో చేరడానికి అర్హులు. ప్రమాదాల వల్ల మరణం, వైకల్యం, వైద్య ఖర్చులు లాంటి ఆర్థిక సమస్యల నుంచి ఈ పాలసీలు రక్షణ కల్పిస్తాయి. పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తీసుకువచ్చిన ఈ కొత్త పథకాల పేర్లు.. హెల్త్‌ ప్లస్‌, ఎక్స్‌ప్రెస్‌ హెల్త్‌ ప్లస్‌లు. వీటి ప్రిమీయం, కవరేజ్‌ చేసే అంశాల వివరాలు మీ కోసం..

ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌.. అత్యంత తక్కువ ప్రీమియంతో తీసుకువచ్చిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ పాలసీ పేరు హెల్త్‌ ప్లస్‌ స్కీమ్‌. బీమా మొత్తం, ప్రీమియం ఆధారంగా దీనిలో మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అవి రూ.355, 555, 755. ఇవి కవర్‌ చేసే అంశాలు ఇలా ఉన్నాయి.

రూ.355 ప్రీమియం..

హెల్త్‌ ప్లస్‌లో చౌకైన ఆప్షన్‌ ఇదే. దీని వార్షిక ప్రీమియం మొత్తం రూ.355 మాత్రమే. ఇది సుమారు1.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తోంది. మరణం, శాశ్వత వైకల్యం సంభవిస్తే.. బీమా మొత్తం అనగా నూటికి నూరు శాతం లభిస్తుంది. ప్రమాదంలో గాయపడి ఫ్రాక్చర్‌ అయితే 25 వేల రూపాయలు బీమా లభిస్తుంది. అలానే పిల్లల పెళ్లికి 50 వేల రూపాయల వరకు ఇన్సురెన్స్‌ కవరేజీ కూడా లభించనుంది.

రూ.555 ప్రీమియం..

హెల్త్‌ ప్లస్‌ పాలసీలో రెండో ఆప్షన్‌.. వార్షిక ప్రీమియం మొత్తం రూ.555 చెల్లించడం. ఈ మొత్తం చెల్లిస్తే.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. మరణం, శాశ్వత వైకల్యం సంభవిస్తే.. బీమా మొత్తం అనగా నూటికి నూరు శాతం లబ్ధి చేకూరుతుంది. ప్రమాదంలో గాయపడి ఫ్రాక్చర్‌ అయితే 25 వేల రూపాయల వరకు బీమా ప్రయోజనం పొందవచ్చు.. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి కోమాలోకి వెళ్తే.. మూడు నెలల వరకు మినహాయింపు ప్రయోజనం చేకూరనుంది.

రూ.755 ప్రీమియం..

హెల్త్‌ప్లస్‌లో ఈ ఆప్షన్‌ అత్యంత సమగ్ర కవరేజీని అందిస్తుంది. దీనిలో మొత్తంగా 15 లక్షల వరకు బీమా సౌకర్యం లభించనుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినా.. లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే.. బీమా మొత్తం అనగా నూటికి నూరు శాతం లభిస్తంది. ప్రమాదంలో గాయపడి ఫ్రాక్చర్‌ అయితే 25 వేల రూపాయలు బీమా లభిస్తుంది. అలానే పిల్లల పెళ్లికి లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్‌ కవరేజీ కూడా లభించనుంది.