iDreamPost
android-app
ios-app

కొత్త చట్టంతో లక్షల మందికి ట్యాక్స్ నోటీసులు! మీరూ ఉండచ్చు! ఏం చేయాలంటే?

  • Published Aug 04, 2024 | 10:00 AM Updated Updated Aug 04, 2024 | 10:00 AM

Income Tax Department Sending Notices To Lakhs Of Taxpayers This Month End Says Reports: వార్షిక బడ్జెట్ లో కేంద్రం కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం సెప్టెంబర్ 1న అమలులోకి రానుంది. ఈ చట్టం అమలులోకి వస్తే లక్షల మందికి ఐటీ శాఖ నోటీసులు పంపించే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Income Tax Department Sending Notices To Lakhs Of Taxpayers This Month End Says Reports: వార్షిక బడ్జెట్ లో కేంద్రం కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం సెప్టెంబర్ 1న అమలులోకి రానుంది. ఈ చట్టం అమలులోకి వస్తే లక్షల మందికి ఐటీ శాఖ నోటీసులు పంపించే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.

  • Published Aug 04, 2024 | 10:00 AMUpdated Aug 04, 2024 | 10:00 AM
కొత్త చట్టంతో లక్షల మందికి ట్యాక్స్ నోటీసులు! మీరూ ఉండచ్చు! ఏం చేయాలంటే?

లక్ష మంది పన్ను చెల్లింపుదారులకు ట్యాక్స్ నోటీసులు పంపించేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు లోపు పెద్ద సంఖ్యలో పన్నుకి సంబంధించిన నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వార్షిక బడ్జెట్ లో కొత్త రీఅసెస్మెంట్ చట్టాన్ని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని 2024 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ చట్టం అమలులోకి వస్తే చాలా మంది ట్యాక్స్ పేయర్లు పన్ను పరిధి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని పన్ను విభాగ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ నెలాఖరులోపు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూనియన్ బడ్జెట్ 2024లో రీఅసెస్మెంట్ చట్టాన్ని ప్రతిపాదించకముందు .. ఎవరికైతే 50 లక్షల రూపాయల ఆదాయం ఉండి పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారో వారికి సంబంధించిన గత పదేళ్ల రికార్డులను పునఃపరిశీలించే అవకాశం ఉండేది.

అలానే 50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండి పన్ను చెల్లించకుండా ఉన్నవారి పదేళ్ల రికార్డులను రీఅసెస్మెంట్ చేసే అవకాశం ఉండేది. కానీ యూనియన్ బడ్జెట్ లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. కనీసం 50 లక్షల ఆదాయానికి సంబంధించి ట్యాక్స్ ఎవరైతే కట్టకుండా తప్పించుకున్నారో వారి రికార్డులను పునఃపరిశీలించే వ్యవధిని పదేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించింది. అలానే 50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండి పన్ను బకాయిలు ఉన్నవారి రికార్డులను పునఃపరిశీలించే వ్యవధిని మూడేళ్లకు తగ్గించింది. అయితే ఈ చట్టం 2024 సెప్టెంబర్ 1న అమలులోకి వస్తే సంవత్సరాల తరబడి ఉన్న పాత ట్యాక్స్ రిటర్న్స్ ని మరలా ఓపెన్ చేయడం అసాధ్యమని, సమయం సరిపోదని రెవెన్యూ అధికారులు కేంద్ర అధికారులను అప్రమత్తం చేశారు.

IT

బడ్జెట్ లో ప్రతిపాదించిన సవరణల చట్టం ప్రకారం.. 50 లక్షల పన్ను చెల్లించకుండా తప్పించుకునేవారి రికార్డులను ఐదేళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు వెనక్కి వెళ్లి పునఃపరిశీలించడం అనేది అసాధ్యమని తెలిపారు. 50 లక్షల కంటే తక్కువ ట్యాక్స్ ఎగ్గొట్టిన వారి రికార్డులను మూడేళ్ళకి మించి వెనక్కి వెళ్లి పునఃపరిశీలించలేమని తెలిపారు. గరిష్ట రీఅసెస్మెంట్ వ్యవధిని ఐదేళ్లకు తగ్గించడం వల్ల పన్ను అధికారులకు నోటీసులు పంపించడానికి ఆగస్టు 31 వరకే సమయం ఉంది. కాబట్టి ఏ సమయంలో అయినా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చునని మీడియా వర్గాల సమాచారం. అయితే ఈ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ అవకాశం కల్పిస్తుంది. కాబట్టి 50 లక్షలు లావాదేవీలు జరిపిన వారికి, అంతకంటే తక్కువ జరిపిన వారికి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అయితే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. వివరణ ఇస్తే నోటీసుల నుంచి తప్పించుకోవచ్చు.