iDreamPost
android-app
ios-app

ఐటీ శాఖ బిగ్ అలర్ట్.. అలా చేస్తేనే వారి ఖాతాలోకి మనీ రిఫండ్

  • Published Jun 06, 2024 | 3:36 PM Updated Updated Jun 06, 2024 | 3:36 PM

Money Refund: ప్రతి ఏడాది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి వారి ఖాతాల్లో మనీ రిఫండ్ చేస్తుంది ఐటీ శాఖ. అయితే ఈసారి ఈ తప్పు చేస్తే మాత్రం మనీ రిఫండ్ ఆలస్యం అవుతుందని.. అలా జరక్కుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే అని హెచ్చరించింది.

Money Refund: ప్రతి ఏడాది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి వారి ఖాతాల్లో మనీ రిఫండ్ చేస్తుంది ఐటీ శాఖ. అయితే ఈసారి ఈ తప్పు చేస్తే మాత్రం మనీ రిఫండ్ ఆలస్యం అవుతుందని.. అలా జరక్కుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే అని హెచ్చరించింది.

ఐటీ శాఖ బిగ్ అలర్ట్.. అలా చేస్తేనే వారి ఖాతాలోకి మనీ రిఫండ్

ప్రతి ఏటా ట్యాక్స్ పేయర్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ చేసిన తర్వాత వాటికి ఆదాయపు పన్ను విభాగం ప్రాసెస్ చేసి రిఫండ్ మనీని పన్ను చెల్లింపుదారులు ఖాతాలో జమ చేస్తుంది. తాజాగా ఈ విషయంలో ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో పన్ను చెల్లింపుదారులు వారి బ్యాంక్ ఖాతాను ప్రీ వ్యాలిడేట్ చేసుకుంటే రిఫండ్ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది. బ్యాంకు ఖాతాలను ప్రీ వ్యాలిడేట్ చేసుకున్నాక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీ రిటర్న్స్ ని పరిశీలించి.. ప్రాసెస్ పూర్తి చేసి రిఫండ్ డబ్బులను పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ రిఫండ్ మనీ పొందాలంటే చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని ఎక్స్ వేదికగా ఆదాయపు పన్ను విభాగం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

రిఫండ్ పొందాలంటే చెల్లుబాటయ్యే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని.. వ్యాలిడేట్ అయిన బ్యాంకు ఖాతాలను రీ-వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుందని.. బ్రాంచిల్లో మార్పులు, ఐఎఫ్ఎస్సీ కోడ్ మార్పు, బ్యాంకుల విలీనం వంటివి జరిగిన క్రమంలో రీ-వ్యాలిడేట్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే బ్యాంక్ ఖాతాను వ్యాలిడేట్ చేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ పోర్టల్ లోకి వెళ్ళాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ తో రిజిస్టర్ అవ్వాలి. ఏ బ్యాంకు అకౌంట్ నైతే ప్రీ వ్యాలిడేట్ చేయాలనుకున్నారో ఆ బ్యాంకు ఖాతా పాన్ కార్డుతో ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్, అకౌంట్ నంబర్ కలిగి ఉండాలి.

లింక్ పై క్లిక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లోకి వెళ్ళాలి. లాగిన్ అయ్యాక ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. బ్యాంక్ ఖాతా ఆప్షన్ ని ఎంచుకుని రీవ్యాలిడేట్ పై క్లిక్ చేయాలి. బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, అకౌంట్ కేటగిరీ వంటివి అప్డేట్ చేయాలి. ఆ తర్వాత వ్యాలిడేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొత్త బ్యాంక్ అకౌంట్ ని క్లిక్ చేయాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి వెబ్ పోర్టల్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ పై క్లిక్ చేసి మై బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయాలి. యాడెడ్, ఫెయిల్డ్, రిమూవ్ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తాయి. అందులో మీ బ్యాంక్ ఖాతా నంబర్ యాడ్ చేయాలి. ఆ తరువాత వ్యాలిడేట్ పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.