iDreamPost
android-app
ios-app

పాన్‌, ఆధార్‌ లింక్ చేయకుంటే జరిగే నష్టం ఇదే.. ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక

  • Published May 28, 2024 | 8:44 PM Updated Updated May 28, 2024 | 8:44 PM

Pan Aadhaar Link: పాన్ నంబర్ ని ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే భారీ నష్టం తప్పదని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఇప్పటికైనా ఆధార్ తో పాన్ ని అనుసంధానం చేయాలని.. గడువు తేదీని ప్రకటించింది. గడువు తేదీ లోపు చేయలేకపోతే జరిగే నష్టం ఇదే అని ప్రకటించింది.

Pan Aadhaar Link: పాన్ నంబర్ ని ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే భారీ నష్టం తప్పదని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఇప్పటికైనా ఆధార్ తో పాన్ ని అనుసంధానం చేయాలని.. గడువు తేదీని ప్రకటించింది. గడువు తేదీ లోపు చేయలేకపోతే జరిగే నష్టం ఇదే అని ప్రకటించింది.

పాన్‌, ఆధార్‌ లింక్ చేయకుంటే జరిగే నష్టం ఇదే.. ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక

ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పాన్ ని ఆధార్ తో ఖచ్చితంగా లింక్ చేయాలి. లింక్ చేయమని ఆదాయపు పన్ను శాఖ గత కొన్ని రోజులుగా చెబుతూనే ఉంది. ఆధార్ అనుసంధానం కోసం ఇచ్చిన గడువు తేదీ కూడా ముగిసింది. దీంతో ఎవరైతే ఆధార్ తో పాన్  కార్డుని అనుసంధానం చేయలేదో వారి పాన్ కార్డులు నిరుపయోగంగా మారి ఉంటాయి. అలాంటి వారికి ఆదాయపు పన్ను విభాగం మరోసారి అవకాశం కల్పించింది. వెయ్యి రూపాయల ఫైన్ తో ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియను 2024 మే 31 లోపు పూర్తి చేయాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను విభాగం హెచ్చరించింది. అనుసంధానం చేయకపోతే 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద ట్యాక్స్ డిడక్షన్ ఉంటుందని స్పష్టం చేసింది.

ఒకవేళ పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేసినట్లయితే అధిక రేటు వద్ద ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉంటుందని హెచ్చరించింది. మే 31 లోపు ఆధార్ తో పాన్ ని అనుసంధానం చేయడం వల్ల.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం.. అధిక ట్యాక్స్ డిడక్షన్, అధిక ట్యాక్స్ చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. టీడీఎస్/టీసీఎస్ చెల్లింపులు ఎగవేసిన కొంతమంది  పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని ఆదాయపు శాఖ విభాగం పేర్కొంది. దీనికి పాన్ కార్డు నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద ట్యాక్స్ డిడక్షన్, పన్ను చెల్లింపులు చేయకపోవడం వల్లే పన్ను చెల్లింపుదారులకు నోటీసులు అందాయని స్పష్టం చేసింది. అలాంటి వారికి మే 31 వరకూ అవకాశం కల్పిస్తున్నామని.. ఆలోపు లింక్ చేయడం ద్వారా పాన్ ని యాక్టివేట్ చేసుకుంటే ఎలాంటి అదనపు భారం ఉండదని వెల్లడించింది.    

ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండిలా:

  • ఇన్కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  • అంతకు ముందే లింక్ అయి ఉంటే అయినట్టు చూపిస్తుంది. ఒకవేళ లింక్ అయినట్టు చూపిస్తే ఫైన్ చెల్లించి ఆధార్ తో పాన్ ని లింక్ చేయాల్సి ఉంటుంది. 

ఫైన్ చెల్లించి లింక్ చేయండిలా:

  • ఇన్కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ-పే ట్యాక్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  • ముందు పాన్ నంబర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మరోసారి పాన్ నంబర్ ని ఎంటర్ చేసి ధృవీకరించాలి.  
  • ఆ తర్వాత ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయాలి. 
  • కంటిన్యూ మీద క్లిక్ చేసి ఓటీపీ నమోదు చేయాలి. 
  • వెరిఫికేషన్ అయ్యాక పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంచుకోవాలి. 
  • తర్వాత అసెస్మెంట్ ఇయర్ (Ay 2023-24) ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఆ తర్వాత అదర్ రిసిప్ట్స్ (500)ను ఎంచుకోవాలి. 
  • ఈ ప్రక్రియ పూర్తయితే పేమెంట్ గేట్ వే పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో పేమెంట్ చేయాలి. 
  • పేమెంట్ అయిన నాలుగు నుంచి ఐదు రోజులకు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ లోకి వెళ్లి లింక్ ఆధార్ ని క్లిక్ చేసి పాన్ నంబర్ ని లింక్ చేయవచ్చు.