iDreamPost
android-app
ios-app

25 ఏళ్లకే జాబ్,29 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎలా డబ్బు ఆదా చేశాడో తెలిస్తే షాకే!

కొన్నేళ్ల క్రితం వరకు రిటైర్మెంట్ అంటే అంతా 55 తర్వాతనే అని ఫిక్స్ అవుతుండేవాళ్లు. అయితే ఈ రోజుల్లో రిటైర్మెంట్ అంటే 45 ఏళ్లకే అని ఫిక్స్ అవుతున్నారు. కానీ ఓ యువకుడు 25 ఏళ్లకి జాబ్ సాధించి..29 ఏళ్లకే రిటైర్డ్ అయ్యే అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

కొన్నేళ్ల క్రితం వరకు రిటైర్మెంట్ అంటే అంతా 55 తర్వాతనే అని ఫిక్స్ అవుతుండేవాళ్లు. అయితే ఈ రోజుల్లో రిటైర్మెంట్ అంటే 45 ఏళ్లకే అని ఫిక్స్ అవుతున్నారు. కానీ ఓ యువకుడు 25 ఏళ్లకి జాబ్ సాధించి..29 ఏళ్లకే రిటైర్డ్ అయ్యే అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

25 ఏళ్లకే జాబ్,29 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎలా డబ్బు ఆదా చేశాడో తెలిస్తే షాకే!

నేటికాలంలో యువతకు మంచి ఉద్యోగం, మంచి జీతం పొందడం అనేది ఓ కల. దానిని సాధించేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అయితే ఇదే సమయంలో జీవితం అంటే సంపాదించడం ఒక్కటే కాదు అని అనుకునేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో విదేశాల్లో  ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం భారత్ లో కూడా ఈ  ట్రెండ్ కనిపిస్తోంది. అలానే జీవితాన్ని ఆస్వాదించాలనుకుని ఐఐటీలో చదివి ఓ వ్యక్తి 25 ఏళ్లకే ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. అంతేకాక దిగ్గజ కంపెనీలలో పనిచేసి 29 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరిని ఆశ్చర్యాన్ని కలిగించిన ఆ భారత యువకుడి లైఫ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. అతడి స్టోరీ ఏమిటో ఇప్పడు చూద్దాం…

డేనియల్ జార్జ్ అనే యువకుడు ఐఐటీ బాంబేలో చదువు పూర్తి చేశాడు. 2015లో ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. 2018లో ఏఐ ఇంజనీర్ గా రూ.2.2 కోట్ల రూపాయల ప్యాకెజీతో గూగుల్ కంపెనీ జాబ్ వచ్చింది. ఉద్యోగ  వచ్చిన సమయంలోనే తన లక్ష్యాలను మనస్సులో రాసుకున్నాడు.  కష్టపడి సంపాదించిన ఈ జీతం వృధా చేయకుండా ఆదా చేయడంపై  అతడు దృష్టి పెట్టాడు. కొన్ని ఏళ్లు జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకోవాలని ముందే మనస్సులో ఫిక్స్ అయ్యాడు..

జార్జీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను, తాను డబ్బును ఆదా చేసుకున్న విధానాన్ని వివరించాడు. జార్జీ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన వద్ద దగ్గర చాలా డబ్బు ఉందని, భవిష్యత్తులో జీతం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గూగుల్‌లో ఒక ఏడాది పని చేసిన ప్రాధాన్యతపై ఫైనాన్స్, పన్నుల గురించి ఆలోచించడం ప్రారంభించానని తెలిపారు. తాను బాగానే సంపాదిస్తున్నాను, కానీ దాదాపు 50 శాతం డబ్బును పన్నుల రూపంలో చెల్లించేవాడినని తెలిపాడు.

అంత  టాక్స్ కట్టే బదులు తన విరమణ నిధిలో ఇంకా ఎక్కువ డబ్బు వేస్తే బాగుంటుందని జార్జ్  భావించాడు. అనుకున్న వెంటనే అదే పని చేయడం ప్రారంభించాడు. అతడు గూగుల్‌లో పని చేస్తున్నప్పుడు, తన సంపాదనలో 10 శాతం కంటే తక్కువ ఖర్చు చేశావడంట. జీతం ఎక్కువగా వచ్చిన విలాసకు వెళ్లేవాడు కాదు. కాలినడకనే ఇంటికి వెళ్లవాడు. భోజనం మూడు పూటల కంపెనీలోనే తినేవారు. రూమ్ కూడా స్నేహతులతో కలిసే షేర్ చేసుకోవడం కారణంగా తక్కువ ఖర్చు అయ్యేదని జార్జీ తెలిపారు. ఇంకా అతడు మాట్లాడుతూ..”నేను ఎంత త్వరగా డబ్బు ఆదా చేయడం ప్రారంభించానో, అది పెరగడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుసు. ఏ సమయంలోనైనా, నేను తక్కువగా ఉండే నగరాలకు వెళ్లి, అక్కడ మంచి ఇంటిని కొనుగోలు చేయగలను” అని తెలిపాడు.

అతను ఏటా ట్యాక్స్ సేవింగ్స్ అకౌంట్ లో దాదాపు రూ. 62 లక్షలు కంటే ఎక్కువ జమ చేశాడు. 2020 నాటికే అతని దగ్గర చాలా డబ్బు ఉంది.జూన్ 2020లో, అతను అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ నుండి ఆఫర్‌ను వచ్చింది. దీంతో గూగుల్ లో జాబ్ కు రిజైన్ చేశాడు. అక్కడ గతం ఆదాయం కంటే రెట్టింపు ఆదాయాన్ని పొందాడు. అలా అన్ని విధాలుగా జీతం పెరిగిన అతడు మాత్రం చాలా సాధారణంగా జీవితాన్ని గడేపేవారు. ఈ క్రమంలోనే తన 27 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడ తన సేవింగ్స్ మిలియన్ డాలర్లు దాటినట్లు జార్జీ చెప్పాడు.

ఉద్యోగంలో ద్వారా వచ్చిన జీతం,భారీ బోనస్‌లలో 70 శాతం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు. ఆగస్ట్ 2023లో తనకు 29 ఏటా జేపీ మోర్గాన్‌ కంపెనీలో ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. చివరకు జార్జ్ తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. తన స్నేహితులతో కలిసి థర్డ్ ఇయర్ ఏఐ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. అందులోనూ విజయం సాధించాడు. అలా అతి తక్కువ సమయంలోనే భవిష్యత్ పై పక్కా ప్లాన్ లు వేసుకుని అందులో విజయం సాధించాడు. మరి.. జార్జీ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.