iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో 17 లక్షలకే ఫ్లాట్! ఈ అవకాశం అందరికీ కాదు

  • Published Aug 06, 2024 | 4:25 PM Updated Updated Aug 06, 2024 | 4:43 PM

IDFC First Bank Puts 71.6 Sq Yds Flat In Auction In Shaikpet Area: హైదరాబాద్ లో 17 లక్షలకే ఫ్లాట్ అంటే నమ్ముతారా? అది కూడా మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాలకు 6, 7 కి.మీ. దూరంలో ఉన్న ఏరియాలో ఫ్లాట్. ఈ ఫ్లాట్ ని సొంతం చేసుకోవడం ఎలాగో చూడండి.

IDFC First Bank Puts 71.6 Sq Yds Flat In Auction In Shaikpet Area: హైదరాబాద్ లో 17 లక్షలకే ఫ్లాట్ అంటే నమ్ముతారా? అది కూడా మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాలకు 6, 7 కి.మీ. దూరంలో ఉన్న ఏరియాలో ఫ్లాట్. ఈ ఫ్లాట్ ని సొంతం చేసుకోవడం ఎలాగో చూడండి.

హైదరాబాద్‌లో 17 లక్షలకే ఫ్లాట్! ఈ అవకాశం అందరికీ కాదు

హైదరాబాద్ నగరంలో ఫ్లాట్ కొనాలంటే కనీసం 40 లక్షలైనా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందులోనూ ప్రధాన ఏరియాలో కొనుక్కోవాలంటే 50 లక్షల నుంచి 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, కోటి రేంజ్ లో ఉంటుంది. కాబట్టి ఫ్లాట్ కొనలేని పరిస్థితి. దీనికి తోడు ప్రాపర్టీ విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరను పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనడం అనేది అసాధ్యం. అయితే మీకు ఇప్పుడు చక్కని అవకాశం దక్కింది. ఇదే హైదరాబాద్ లో తక్కువ ధరకే ఫ్లాట్ ని సొంతం చేసుకోవచ్చు. అది కూడా మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ఏరియాలకు అతి దగ్గరలో ఉంది. 17 లక్షలకే అందుబాటులో ఉంది. మీరు కనుక ఫ్లాట్ కొనాలి అని అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. 

బ్యాంకులు ప్రాపర్టీల మీద వేలంపాట నిర్వహిస్తుంటాయి. కొంతమంది బ్యాంకులో రుణాలు తీసుకుని ఇల్లు కట్టుకోవడం, ఫ్లాట్ కొనుక్కోవడం, బైకులు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. అందుకోసం ప్రతి నెలా ఈఎంఐ చెల్లిస్తారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది లోన్ ఈఎంఐ చెల్లించలేరు. దీంతో బ్యాంకులు ప్రాపర్టీలను వేలంపాటలో పెడతాయి. లోన్ తీసుకున్న యజమాని కట్టగా మిగిలిన అమౌంట్ ని ఆక్షన్ లో రికవరీ చేసుకుంటుంది. షేక్ పేటలోని 71.6 గజాల ఫ్లాట్ ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 17 లక్షల 40 వేల రూపాయలకు ఆక్షన్ లో పెట్టింది. ఆక్షన్ ఆగస్టు 22న ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఈ వేలంపాటలో పాల్గొనాలంటే బ్యాంకు నిర్ణయించిన రిజర్వ్ ధర మీద 10 శాతం ముందుగానే చెల్లించాలి. అంటే 17 లక్షల 40 వేల మీద 10 శాతం అంటే 1,74,000 రూపాయలు ఈఎండీ అమౌంట్ ని చెల్లించాలి.

Flat At 17 Lakhs In Shaikpet new 1

 

ఆక్షన్ ముందు రోజు ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల లోపు ఈ అమౌంట్ ని చెల్లించాలి. అయితే వేలంపాట అనేది 17 లక్షలతో ప్రారంభమవుతుంది. 5 వేలు, 10 వేలు చొప్పున పెరుగుతూ ఉంటుంది. ఆ ఏరియాలో మార్కెట్ విలువను బట్టి మీ ఆక్షన్ ధర అనేది దాటకుండా చూసుకోండి. ఒకవేళ ఆక్షన్ లో మీరు గెలిస్తే కనుక బ్యాంకుకి స్పాట్ లోనే మీరు ఎంత మొత్తానికి పాడుకున్నారో అందులో కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మిగతా అమౌంట్ ని 10, 15 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆక్షన్ లో ఓడిపోతే మీరు కట్టిన ఈఎండీ అమౌంట్ ని బ్యాంకు వెనక్కి ఇచ్చేస్తుంది.

షేక్ పేట్ లో ప్రస్తుతం ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగు ధర రూ. 10 వేలు ఉంది. ఈ లెక్కన 71.6 గజాలు అంటే 645 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ కొనాలంటే రూ. 65 లక్షలు అవుతుంది. ఇది షేక్ పేటలో ఉన్న ఫ్లాట్ యొక్క సగటు మార్కెట్ విలువ. ఇంతకంటే ఎక్కువ ఉండచ్చు. తక్కువ ఉండచ్చు. బ్యాంకు నిర్ణయించిన ధర మాత్రమే చాలా తక్కువ. ఒకవేళ ఇందులో సగం ధరకు పాడుకున్నా గానీ లాభమే తప్ప నష్టం ఉండదు. షేక్ పేట సిటీలో ఉంది కాబట్టి అన్ని రకాలుగా ప్రయోజనాలే ఉంటాయి. అయితే ఆక్షన్ లో పాల్గొనే ముందు డాక్యుమెంట్లు, ఇల్లు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.