Dharani
ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సర్వీసు ఛార్జీల మోత మోగించనుంది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..
ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సర్వీసు ఛార్జీల మోత మోగించనుంది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..
Dharani
నెల ఆరంభం, ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన రూల్స్ మారుతుంటాయి. వడ్డీ రేట్లు, సర్వీసు ఛార్జీల వంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. అంటే వాటిని పెంచడం, తగ్గించడం వంటివి అన్నమాట. తగ్గితే కస్టమర్లకు పండగే.. పెంచితేనే జేబుకు భారీగా చిల్లు పడుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే.. ప్రైవేటు బ్యాంకులు సర్వీసు ఛార్జీల మోత మోగిస్తుంటాయి. ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టాప్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు.. తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది
ఐసీఐసీఐ బ్యాంకు.. సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీల్ని సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు కీలక ప్రకటన చేసింది. ఛార్జీలు పెంచే సర్వీసుల్లో ప్రధానంగా చెక్ బుక్, ఐఎంపీఎస్, ఈసీఎస్/ఎన్‌ఏసీహెచ్, డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ వంటివి ఉన్నాయి. పెరిగిన ఛార్జీలు.. మే 1, 2024 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మొత్తం 17 సేవలకు సంబంధించి ఛార్జీలు పెంచినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.