iDreamPost
android-app
ios-app

ఆ క్రెడిట్ కార్డ్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఇక భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సిందే!

  • Published Nov 13, 2024 | 12:13 PM Updated Updated Nov 13, 2024 | 12:13 PM

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడేవారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. ఇక భారీ మొత్తం కట్టాల్సిందే..

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడేవారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. ఇక భారీ మొత్తం కట్టాల్సిందే..

ఆ క్రెడిట్ కార్డ్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఇక భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సిందే!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా క్రెడిట్ కార్డుల వాడకం మామూలుగా లేదనే చెప్పాలి. డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకులు కూడా చాలా ఈజీగా క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటోంది. అలాగే స్పెషల్ క్యాష్ బ్యాక్స్, రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు అంటూ ఎన్నో బెనిఫిట్స్ కల్పిస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డులతో సేల్స్ పీక్ స్టేజ్ లో జరుగుతున్నాయి. అవసరానికి మించి కొనుగోలు చేస్తున్న వారు ఎక్కువయ్యారు. అయితే, క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడితే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. బిల్లులు సరిగ్గా కట్టకపోతే భారీగా వడ్డీ కట్టాలి. పెనాల్టీలు కూడా పడతాయి. క్రెడిట్ స్కోర్ త్వరగా తగ్గిపోతుంది. ఇలా ఎన్నో నష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డు రూల్స్ తెలుసుకుంటూ ఉండాలి.ఇండియన్ ఫేమస్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ రీసెంట్ గా కీలక ప్రకటన చేసింది. క్రెడిట్ కార్డుల వాడకంపై కొత్త రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ నవంబర్ 15 నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారంలోనే రూల్స్ అమలులోకి వస్తున్న క్రమంలో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడే వారు కచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలి.

లాంజ్ యాక్సెస్ అమౌంట్ పెంచుతూ ఐసిఐసిఐ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మనం భారీగా ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది. డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్రెస్ కి మొదటి మూడు నెలల్లో ఏకంగా రూ.75 వేల దాకా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ పూర్తి చేయాలి. అంతకు ముందు ఇది కేవలం రూ.35 వేలుగా ఉండేది. దానికి ముందు అయితే కేవలం రూ.5 వేలు మాత్రమే ఉండేది. గడిచిన 6 నెలల కాలంలోనే చాలా దారుణంగా పెంచేసింది ఐసిఐసిఐ.నవంబర్ 15 నుంచి ఎయిర్‌పోర్టుల్లో స్పా యాక్సెస్ ఆగిపోనుంది. వీటితో పాటుగా బీమా చెల్లింపులు, యుటిలిటీ బిల్లులపై రివార్డు పాయింట్లు అందుకోవాలంటే జేబులకు చిల్లులు పెట్టుకోవాల్సిందే. వీటి లిమిట్ పెంచుతున్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. అలాగే గవర్నమెంట్ పేమెంట్స్ జరిపినప్పుడు ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. ఫ్యూయెల్ సర్ ఛార్జీ వేవర్ కోసం నెలకు రూ.50 వేలపైన ఖర్చు చేయాలి. ఇక ఈ లిమిట్ దాటితేనే ఫ్యూయెల్ సర్ ఛార్జీ మాఫీ అనేది ఉంటుంది.

ఇక థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చేసే ఎడ్యుకేషన్ పేమెంట్లపై ఒక శాతం ఫీ కట్టాలి. దీంతో పిల్లల స్కూల్, ట్యూషన్ ఫీజులు కట్టినప్పుడు మనకు ఖర్చు మామూలుగా ఉండదు. ఇక బిల్లులను కట్టడం లేట్ అయితే కచ్చితంగా లేట్ పేమెంట్ ఛార్జీలు కట్టాలి. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త రూల్స్ ప్రకారం ఇక నుంచి రూ.100 దాకా బిల్ ఉంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ, రూ.101 నుంచి రూ.500 దాకా బిల్ అయితే రూ.100 లేట్ పేమెంట్ ఛార్జీ కట్టాలి. రూ.501-రూ.1000 దాకా అయితే రూ.500 కట్టాలి. రూ.1001 నుంచి రూ.5 వేల దాకా అయితే రూ.600, రూ.5001 నుంచి రూ.10 వేల దాకా బిల్ ఉంటే రూ.750, రూ.10001 నుంచి రూ.25 వేల బిల్లుపై రూ.900, రూ.25,001 నుంచి రూ.50 వేల బిల్లుపై లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.1100 కట్టాలి. ఇదీ సంగతి. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడేవారికి ఈ రూల్స్ కచ్చితంగా షాకింగ్ అనే చెప్పాలి. ఇక ఈ రూల్స్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.