iDreamPost
android-app
ios-app

Hyundai i20లో అదిరిపోయే ఫీచర్లు! ధరపై భారీ డిస్కౌంట్!

  • Published Sep 11, 2024 | 9:54 PM Updated Updated Sep 11, 2024 | 9:54 PM

Hyundai i20: హ్యందాయ్ కంపెనీ i20పై భారీ తగ్గింపుని అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Hyundai i20: హ్యందాయ్ కంపెనీ i20పై భారీ తగ్గింపుని అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Hyundai i20లో అదిరిపోయే ఫీచర్లు! ధరపై భారీ డిస్కౌంట్!

మీరు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని చూస్తున్నారా ? మంచి బ్రాండ్ కోసం చూస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే న్యూస్ ఉంది. ఈ నెలలో హ్యందాయ్ కంపెనీ తన కార్లలో బాగా ఫేమస్ అయిన మోడల్ i20పై భారీ తగ్గింపుని అందిస్తోంది. ఐ20 మాన్యువల్ వేరియంట్‌పై రూ.50,000, సీబీటీ వేరియంట్‌పై రూ.35000, ఎన్ లైన్ వేరియంట్‌పై రూ.35000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే మీరు మీ దగ్గరలోని డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. హ్యుందాయ్ ఐ20 ఎందుకు కొనాలి? దీని ఫీచర్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఐ20 ఎందుకు కొనాలంటే ఇందులో పవర్ ట్రెయిన్ అదిరిపోతుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది మాక్సిమం 83bhp పవర్, 115Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పాత మోడల్ లో అయితే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉండేది. ఇక ఈ కారు ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, CBT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హ్యుందాయ్ ఐ20 లో 5 మంది సులభంగా సౌకర్యంగా కూర్చోవచ్చు. ఈ కార్ మొత్తం 6 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ధర విషయానికి వస్తే.. మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 ఎక్స్-షోరూమ్ ధర రూ .8.38 లక్షల నుంచి మొదలవుతుంది. వేరియంట్లని బట్టి ధర మారుతూ ఉంటుంది.

హ్యుందాయ్ ఐ20లో అదిరిపోయే ఇంటీరియర్‌ ఉంటుంది. ఇందులో వినియోగదారుల కోసం ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇది కాకుండా హ్యుందాయ్ ఐ20లో మంచి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌ ఫీచర్లు ఉంటాయి. ఇంకా వీటితో పాటు వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, టాప్ వేరియంట్‌లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు కూడా ఉంటాయి..హ్యుందాయ్ ఐ20 మార్కెట్లో స్టైలిష్ ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ కారుగా గుర్తింపు పొందింది. ఇక భారీ తగ్గింపుతో వస్తున్న హ్యుందాయ్ ఐ20 పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.