nagidream
3 Lakhs Profit In 3 Months: మీరు తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలని భావిస్తున్నారా? అయితే ఒక మంచి ఏరియా చూసుకుని అక్కడ స్థలాల మీద పెట్టుబడి పెడితే బాగుంటుంది. ఇవాళ అలాంటి ఏరియా గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఈ ఏరియాలో ఈ ఏడాది ప్రారంభంలో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే 3 నెలల్లో 3 లక్షలు లాభం వచ్చాయి. ఆ ఏరియా ఏంటంటే?
3 Lakhs Profit In 3 Months: మీరు తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలని భావిస్తున్నారా? అయితే ఒక మంచి ఏరియా చూసుకుని అక్కడ స్థలాల మీద పెట్టుబడి పెడితే బాగుంటుంది. ఇవాళ అలాంటి ఏరియా గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఈ ఏరియాలో ఈ ఏడాది ప్రారంభంలో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే 3 నెలల్లో 3 లక్షలు లాభం వచ్చాయి. ఆ ఏరియా ఏంటంటే?
nagidream
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక హైవే ప్రాంతాలు బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు హైవే, ముంబై హైవే, విజయవాడ హైవే, శ్రీశైలం హైవే ప్రాంతాల్లో ఏ ఏరియాలో పెట్టుబడి పెట్టినా గానీ భవిష్యత్తులో మంచి లాభాలను ఆశించవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్ కనెక్టివిటీ వంటివి డెవలప్ అయి ఉన్నాయి. పలు కంపెనీలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు ఇండ్ల స్థలాల మీద, ఇళ్ల మీద డిమాండ్ పెరుగుతుంది. అందుకే ఇప్పుడే హైవే ఏరియాల మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ లోని పెట్టుబడి పెట్టతగ్గ హైవేల్లో శ్రీశైలం హైవే ఒకటి. దేశంలో మిగతా ఏరియాలను కనెక్ట్ చేసే కమర్షియల్ కారిడార్ గా శ్రీశైలం హైవే ఉండడం గమనార్హం. ఎన్హెచ్ 44, ఎన్హెచ్ 65 వంటి ప్రధాన జాతీయ రహదారులకు అత్యంత సమీపంలో ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి కూడా దగ్గరగా ఉంది. అనంతపురం, కడప, కర్నూలు వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు శ్రీశైలం హైవే యాక్సెస్ కల్పిస్తుంది. ఫ్యూచర్ లో శ్రీశైలం హైవే ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఆవిర్భవిస్తుందని.. అప్పుడు స్థలాల రేట్లు అమాంతం పెరిగిపోతాయని అంటున్నారు.
మిగతా హైవేలతో పోలిస్తే శ్రీశైలం హైవే మీద స్థలాల ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో చదరపు అడుగు స్థలం రూ. 1300 ఉండగా ప్రస్తుతం అది రూ. 1450కి పెరిగింది. గజం స్థలం రూ. 13 వేలు పడుతుంది. ఒక 200 గజాల స్థలం కొనడానికి 26 లక్షలు అవుతుంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొన్నవారికి ఆల్రెడీ స్థలాల మీద యావరేజ్ గా చదరపు అడుగు మీద 150 రూపాయలు లాభం వచ్చింది. అంటే గజం మీద రూ. 1350 లాభం వచ్చినట్టు. 23 లక్షలు పెట్టి 200 గజాల స్థలం కొన్నవారికి ఇప్పుడు 3 లక్షలు లాభం వచ్చినట్టు. అప్పుడు 23 లక్షలతో కొన్న స్థలం విలువ ఇప్పుడు 26 లక్షలు అయ్యింది. కేవలం మూడు నెలల్లోనే 3 లక్షలు లాభం తెచ్చిపెట్టింది. ఇంతకంటే గొప్ప అదృష్టం, అవకాశం ఉండవేమో. 3 నెలలు ఆగితేనే ఇంత లాభం వచ్చిందంటే.. 3 సంవత్సరాలు ఆగితే ఇంకెన్ని లాభాలు వస్తాయో చూడండి. అందుకే భూమిని నమ్ముకుంటే దశ తిరుగుతుంది అని అంటారు.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.