iDreamPost
android-app
ios-app

67 వేలకే యాపిల్ మ్యాక్‌బుక్.. ఏకంగా 26 వేలు తగ్గింపు! ఈ ఆఫర్ కొన్ని రోజులే!

  • Published Jul 06, 2024 | 5:17 PM Updated Updated Jul 06, 2024 | 5:17 PM

Get MacBook Air For 67T: యాపిల్ ల్యాప్ టాప్ ని కొనాలని భావిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్.. 93 వేల యాపిల్ మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ ని మీరు ఇప్పుడు 67 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఏకంగా 26 వేలు తగ్గింపు లభిస్తుంది.

Get MacBook Air For 67T: యాపిల్ ల్యాప్ టాప్ ని కొనాలని భావిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్.. 93 వేల యాపిల్ మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ ని మీరు ఇప్పుడు 67 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఏకంగా 26 వేలు తగ్గింపు లభిస్తుంది.

67 వేలకే యాపిల్ మ్యాక్‌బుక్.. ఏకంగా 26 వేలు తగ్గింపు! ఈ ఆఫర్ కొన్ని రోజులే!

యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ లేదా ఐపాడ్ లేదా మ్యాక్ బుక్ వంటి ఉత్పత్తులు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ వాటి ధర చూస్తేనే వామ్మో అనిపిస్తుంది. అయితే మీరు ల్యాప్ టాప్ కొనాలని ఫిక్స్ అయితే కనుక హై కాన్ఫిగరేషన్ విండోస్ ల్యాప్ టాప్ కి పెట్టే కాస్ట్ తో మీకు మ్యాక్ బుక్ వచ్చేస్తుంది. 93 వేల రూపాయల విలువ చేసే ఈ మ్యాక్ బుక్ ని మీరు కేవలం 67 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ ఛేంజ్ లేకుండా నేరుగా మీరు ఈ డిస్కౌంట్ ని పొందవచ్చు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 92,990 ఉండగా 23 శాతం డిస్కౌంట్ తో రూ. 71,990 పడుతుంది. అయితే మీ దగ్గర ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల్లో ఏదో ఒకటి ఉన్నా గానీ 5 వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో మీరు ఈ మ్యాక్ బుక్ ఎయిర్ ని రూ. 66,990కే సొంతం చేసుకోవచ్చు.

ఏకంగా 26 వేలు తగ్గింపు లభిస్తుంది. ఇది ఐఫోన్, ఐపాడ్ తో పని చేస్తుంది. స్పేస్ గ్రే కలర్ లో ఇది అందుబాటులో ఉంది. ఎం1 చిప్ ప్రాసెసర్ తో, 8 కోర్ సీపీయూతో వస్తుంది. 16 కోర్ న్యూరల్ ఇంజిన్ తో వస్తుంది. 13.3 అంగుళాల స్క్రీన్ సైజుతో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్, బ్యాక్ లిట్ కీబోర్డ్, ఫేస్ టైం హెచ్డీ కెమెరా, టచ్ ఐడీ వంటి ఫీచర్స్ తో వస్తుంది. స్టోరేజ్ ని 2 టీబీ వరకూ పెంచుకునే వెసులుబాటు ఉంది. ర్యామ్ ని 16 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డుతో వస్తుంది. 7 లేదా 8 కోర్ జీపీయూతో వస్తుండడం వల్ల గ్రాఫిక్స్ లో 5 రెట్లు పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఇక ఇది మ్యాక్ ఓఎస్ 10.14 మొజావే ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 18 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

ఈ మ్యాక్ బుక్ లో ఫ్యాన్ లేదు, నాయిస్ ఉండదు.. కేవలం గాలి మాత్రమే వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ, ట్రూ టోన్ టెక్నాలజీ, థండర్ బోల్ట్, యూఎస్బీ 4 సపోర్ట్ తో వస్తుంది. సెకనుకు 40 జీబీ డేటా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. యాపిల్ డివైజెస్ ని, ఇతర డివైజెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అదనపు డిస్ప్లే కనెక్ట్ చేసుకోవాలంటే 6కే రిజల్యూషన్ వరకూ సపోర్ట్ చేస్తుంది. థండర్ బోల్ట్ తో ఐఫోన్, ఐపాడ్ వంటి వాటిని ఛార్జ్ చేసుకోవచ్చు. రెండు థండర్ బోల్ట్ పోర్ట్స్, 4 యూఎస్బీ పోర్ట్స్ ని సపోర్ట్ చేస్తుంది. వైఫై 6 ఫీచర్ తో వస్తుంది. దీని వల్ల వైఫై ఇంటర్నెట్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. బ్లూటూత్ 5.0 వైర్ లెస్ టెక్నాలజీతో వస్తుంది. ఈ మ్యాక్ బుక్ మీద కంపెనీ ఏడాది పాటు వారంటీ ఇస్తుంది.  

ఈ మ్యాక్ బుక్ తో పాటు వచ్చే వస్తువులు:

  • 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ 
  • 30 వాట్ యూఎస్బీ-సీ పవర్ అడాప్టర్ 
  • రెండు మీటర్ల యూఎస్బీ-సీ ఛార్జ్ కేబుల్ 

ఈ మ్యాక్ బుక్ పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ నడుస్తోంది. ఇప్పుడు కొనుగోలు చేస్తే 26 వేల డిస్కౌంట్ తో రూ. 66,990కే సొంతం చేసుకోవచ్చు. మరి కొనాలనుకుంటే కనుక ఈ లింక్ పై క్లిక్ చేయండి.