Tirupathi Rao
Tirupathi Rao
ఇప్పుడు ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ ఎంతగా పెరిగిపోయాయో అందరికీ తెలుసు. అయినా కూడా మీకు ఎక్కడో ఒక దగ్గర క్యాష్ అవసరం పడకమానదు. ఒక్కోసారి నెట్ వర్క్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు క్యాష్ అవసరం వస్తుంది. కొంతమంది ఆన్ లైన్ పేమెంట్స్ తీసుకోకపోవచ్చు. అలాంటప్పుడు కూడా మీకు క్యాష్ కావాల్సిందే. అయితే ఆన్ లైన్ లావాదేవీలు అలావాటు అయిపోయి చాలా మంది క్యాష్ పెట్టుకోవడం లేదు. ఒకవేళ ఎమర్జెన్సీలో క్యాష్ కావాలన్నా ఏటీఎం అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏటీఎం లేకుండానే ఎంచక్కా డబ్బు డ్రా చేసుకోవచ్చు. అందుకు మీ మొబైల్ నంబర్ కూడా అవసరం లేదు.
సాధారణంగా ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేయాలి అంటే.. కార్డు ఉండాల్సిందే. అంతేకాకుండా మొబైల్ నంబర్ ఉన్నా కూడా మీరు క్యాష్ డ్రా చేయచ్చు. కానీ, ఈ రెండింటి అవసరం లేకుండానే మీరు క్యాష్ విత్ డ్రా చేసుకునేలా ఇప్పుడు కొత్త ఏటీఎంలు వస్తున్నాయి. వాటిలో మీరు కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సింపుల్ గా డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఈ కొత్త ఏటీఎం ముంబయిలో గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో లాంఛ్ చేశారు. అప్పటి నుంచి నెట్టింట ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఎన్ పీసీఐతో కలిసి హిటాచీ పేమెంట్స్ కంపెనీ ఈ యూపీఐ ఏటీఎంను ఆవిష్కరించారు. ఈ ఏటీఎం ద్వారా మీరు డబ్బు డ్రా చేసేందుకు యూపీఐ పేమెంట్స్ యాప్ ఉంటే చాలు.
ఈ ఏటీఎం ద్వారా ఎలా డబ్బు విత్ డ్రా చేయాలి అంటే.. ముందుగా స్క్రీన్ మీద యూపీఐ కార్డ్ లెస్ క్యాష్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత 100, 200, 500, 1000, 2000, 5000 అని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఎంత మొత్తం కావాలో సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్యూర్ కోడ్ జనరేట్ అవుతుంది. మీ యూపీఐ యాప్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ బ్యాంక్ ఖాతాని సెలక్ట్ చేసుకోవాలి. మీ పిన్ ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. తర్వాత మీ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుంది. ఏటీఎం నుంచి మీకు డబ్బు వస్తుంది. ఇలా మీరు మీ దగ్గర ఏటీఎం కార్డు లేకపోయినా.. మీ మొబైల్ నంబర్ తో పని లేకుండానే యూపీఐ యాప్ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.
🚨 ATM Cash Withdrawal using UPI
Today I Made a Cash Withdrawal using UPI at Global FinTech Fest in Mumbai
What an Innovative Feature for Bharat pic.twitter.com/hRwcD0i5lu
— Ravisutanjani (@Ravisutanjani) September 5, 2023