iDreamPost
android-app
ios-app

Fake currency note: భారీగా పెరుగుతున్న దొంగ నోట్లు.. గుర్తించడం ఎలా?

  • Published Nov 27, 2024 | 12:01 PM Updated Updated Nov 27, 2024 | 12:01 PM

Fake currency note: ప్రస్తుతం దొంగ నోట్లు బాగా పెరిగిపోతున్నాయి. చాలా మంది గుర్తించలేకపోతున్నారు.

Fake currency note: ప్రస్తుతం దొంగ నోట్లు బాగా పెరిగిపోతున్నాయి. చాలా మంది గుర్తించలేకపోతున్నారు.

Fake currency note: భారీగా పెరుగుతున్న దొంగ నోట్లు.. గుర్తించడం ఎలా?

ప్రస్తుతం రూ. 2 వేల నోట్ల చలామణీ తగ్గగా.. రూ. 500 నోటు భారీగా చలామణీలో ఉంది. అయితే ఈమధ్య కాలంలో నకిలీ నోట్లు బాగా పెరిగిపోతున్నాయని తెలిసింది. గత 5 సంవత్సరాలలో నకిలీ నోట్ల సంఖ్య ఏకంగా 317 శాతం పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా పార్లమెంటులో రిపోర్ట్ ఇచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 21,865 మిలియన్లు రూ. 500 నకిలీ నోట్లు.. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 91,110 మిలియన్లకు చేరిందని తెలిసింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 15 శాతం తగ్గింది. సో టోటల్ గా 317 శాతం నకిలీ నోట్లు పెరిగాయి. ఇక 500 నోట్లు అసలైనవో.. నకిలీవో గుర్తించడం ఎలా ? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సెక్యూరిటీ థ్రెడ్ కరెన్సీ నోటులో ఒక నిలువు గీత ఉంటుంది. దాన్ని ముందుగా చూస్తే అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆ నోటుని వంచి చూసినప్పుడు అది థిక్ బ్లూ (ముదరు నీలం) రంగులోకి మారుతుంది. అయితే ఆ గీత రంగు మారకుంటే అది అసలైనది కాదు.అసలు కరెన్సీ నోటు కుడి, ఎడమ వైపు ఖాళీ ప్రదేశంలో కాస్త వెలుతురులో చూస్తే.. మహాత్మా గాంధీ పిక్చర్, అంకెలతో నోటు విలువ సంఖ్య వాటర్ మార్క్ ఉంటుంది. కరెన్సీ నోటు మీద చిన్న సైజులో ఇంగ్లీష్, హిందీ భాషలో లెటర్స్ ప్రింట్ చేసి ఉంటాయి. అలాగే కరెన్సీ నోటు ముద్రించే కాగితం మామూలు పేపర్ కాదు. కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకే ఈ నోటు కాస్త తడిచినా కూడా మామూలు పేపర్‌లా చిరగదు.అలాగే కరెన్సీ నోట్ మీద మహాత్మాగాంధీ ఫోటో ఉండే వైపు .. ఎడమ, కుడి చివర్లలో క్రాస్‌గా ఐదు చిన్న చిన్న గీతలు ఉంటాయి. వేళ్లతో వాటిని తడిమితే ఉబ్బెత్తుగా ఉంటాయి. కంటిచూపు లేని వారు కూడా దీనిని గుర్తించే వీలుగా తయారు చేశారు.

రూ. 500  నంబర్ దేవనాగరి లిపిలో ప్రింట్ అయ్యి ఉంటుంది. మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. దాన్ని కుడివైపు వెలుతురుకు పెట్టి చూస్తే లోపల కూడా ఫోటో ఉంటుంది. అలాగే అశోక సింబల్ కూడా ఉంటుంది. వెనుక వైపు నోటు ప్రింట్ చేసిన సంవత్సరం, స్వచ్ఛ భారత్ లోగో, స్లోగన్, లాంగ్వేజ్ ప్యానెల్, రెడ్ ఫోర్ట్ వంటివి ఉంటాయి. కాబట్టి వీటిని కచ్చితంగా జాగ్రత్తగా గమనించాలి. వీటిలో ఏది లేకపోయినా కూడా అది నకిలీదని అర్ధం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మోసపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.