iDreamPost
android-app
ios-app

ITR ఫైలింగ్ పూర్తి అయినా.. ఇంకా అమౌంట్ రిఫండ్ కాలేదా? ఇలా చేయండి!

  • Published Aug 02, 2024 | 11:14 AM Updated Updated Aug 02, 2024 | 11:14 AM

ITR Filing: సంపన్న వర్గాలు ప్రతి ఏడాది ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంటారు. గత సంత్సరాలనికి (2023-24) గాను ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలు సమయం జులై 31 తో గడిచిపోయింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ కి సంబంధించి ట్యాక్స్ పే చేసేవారికి ఎప్పటికప్పడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు ఆదాయపన్ను శాఖాధికారులు.

ITR Filing: సంపన్న వర్గాలు ప్రతి ఏడాది ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంటారు. గత సంత్సరాలనికి (2023-24) గాను ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలు సమయం జులై 31 తో గడిచిపోయింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ కి సంబంధించి ట్యాక్స్ పే చేసేవారికి ఎప్పటికప్పడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు ఆదాయపన్ను శాఖాధికారులు.

  • Published Aug 02, 2024 | 11:14 AMUpdated Aug 02, 2024 | 11:14 AM
ITR ఫైలింగ్ పూర్తి అయినా.. ఇంకా అమౌంట్ రిఫండ్ కాలేదా? ఇలా చేయండి!

జులై 31 తో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు సమయం ముగిసిపోయింది. ఆ తర్వాత చెల్లింపుపై అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా 7 కోట్ల మందికి పైగా తమ రిటర్నులు దాఖలు చేసినట్టు ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే దాదాపు 50 లక్షలకు పైగా రిటర్నులు దాఖలైనట్లు చెప్పారు. ఇంకా ట్యాక్స్ పే చేయని వారు ఫెనాల్టీతో డిసెంబర్ 31 వరకు చెల్లించే అవకాశం ఉదని ఐటీ శాఖ తెలిపింది. మరోవైపు ఐటీఆర్ దాఖలు చేసిన వారు రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆ రిఫండ్స్ ఎలా పొందాలి, దానికి ఎంత టైమ్ పడుతుంది? ఆలస్యం కావడానికి కారణాలు ఏంటీ? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఐటీ శాఖ వారు గత నెల 31 వరకు సమయం ఇచ్చారు. కానీ కొంతమంది ఇప్పటికీ ఐటీ రిటర్న్ చేయకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. జీతంలో పాటు మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటితే.. మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  అయితే నిర్ధేశిత మొత్తం కన్నా ఎక్కువ పన్ను చెల్లించే వారికి ఐటీశాఖ రిఫండ్స్ జారీ చేస్తుంది. నిర్ధేశిత గడువులోగా ITR ఫైల్ చేసి వేరిఫికేషన్ చేయించిన వారు రిఫండ్లు పొందేందుకు అర్హులు అవుతారని ఐటీ శాఖ పేర్కొంది. దాఖలైన ఐటీఆర్ లను ఐటీ శాఖ ప్రాసెస్ చేసిన తర్వాత రిఫండ్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ – ఫైలింగ్ పార్టల్ ప్రకారం ఆగస్టు 1 నాటికి 7.28 కోట్ల ఐటీఆర్ లు దాఖలవ్వగా.. అందులో 6.31 కోట్ల ఐటీఆర్ లు వెరఫై చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 2.69 కోట్ల ఐటీఆర్ లన ప్రాసెస్ చేసినట్లు ఆదాయ పన్ను శాఖాధికారులు తెలిపారు.

నిన్న ఒక్కరోజే ఏకంగా 50 లక్షలకు పైగా రిటర్నులు దాఖలు కావడం విశేషం. ఐటీ రిటర్నుల దాఖలు విషయం గురించి ఐటీ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది.  ఏన్ని రోజులకు రిఫండ్లు జారీ అవుతాయన్న విషాయినికి వస్తే.. రిఫండ్ల జారీకి నిర్ధిష్ట గడువు అంటూ ఏదీ లేదు. అర్హులైన వారి ఖాతాలో నగదు జమ కావడానికి గరిష్టంగా 4-5 వారాలు గడువు పడుతుందని ఐటీశాఖ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడం, రొటీన్ టాస్కుల విషయంలో ఆటోమెషన్ వినియోగం కారణంగా గతంతో పోల్చితే రీఫండ్స్ జారీ వేగం బాగా పెరిగింది. అందుకే చాలా మంది అకౌంట్స్ లో నగదు జమ అవుతుంది. ఏదైనా అవకతవకలు ఉన్నట్లయితే రిఫండ్స్ జారీ ఆలస్యం కావొచ్చు అంటున్నారు. రీఫండ్ స్టేటస్ ను ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.. ఈ-ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లి ఐటీఆర్ స్టేటస్ పై క్లిక్ చేసి మీ ఐటీఆర్ స్థితిని తెలుసుకోవచ్చు.