iDreamPost
android-app
ios-app

ఇళ్లు కొనాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 3.50 లక్షలు

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలని కల ఉంటుంది. కానీ దాన్ని కొంత మంది మాత్రమే నెరవేర్చుకోగలుగుతారు. బ్యాంకు లోన్స్, ఇతర సదుపాయాలను వినియోగించుకుంటారు. గతంలో తొలిసారి ఇళ్లు నిర్మించుకునే వారికి కేంద్రం కూడా కొంత సాయపడింది. అది ఎలా అంటే..?

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలని కల ఉంటుంది. కానీ దాన్ని కొంత మంది మాత్రమే నెరవేర్చుకోగలుగుతారు. బ్యాంకు లోన్స్, ఇతర సదుపాయాలను వినియోగించుకుంటారు. గతంలో తొలిసారి ఇళ్లు నిర్మించుకునే వారికి కేంద్రం కూడా కొంత సాయపడింది. అది ఎలా అంటే..?

ఇళ్లు కొనాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 3.50 లక్షలు

ఇల్లే కదా స్వర్గ సీమ. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఉంటుంది. అందుకోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. కొంత సొమ్మును కూడ దీసి.. ఇల్లు లేదా స్థలం కొనుక్కోవాలని అనుకుంటారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు డ్రీమ్ హోమ్ నిర్మించుకోవాలంటే కాసులతో పని. ఈ నేపథ్యంలో బ్యాంకు లోన్లను ఆశ్రయిస్తుంటారు. గృహ రుణాల మీద ఇంటిని తీసుకుంటూ ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొన్ని ప్రయోజనాలను వినియోగించుకుంటూ ఉంటారు. ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన చేస్తున్న కేంద్ర గుడ్ న్యూస్ చెప్పనుంది. ఓ ట్యాక్స్ బెనిఫిట్ మళ్లీ తీసుకు వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

గృహ రుణాలు తీసుకుని తొలి సారి ఇళ్లు కొనుగోలు చేసే వారికి సాయపడేందుకు 2019 వార్షిక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 80EEA కింద పన్ను మినహాయింపును ప్రవేశపెట్టింది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం హోమ్ లోన్ తీసుకుంటే.. వడ్డీ చెల్లింపులపై రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అదే సెక్షన్ 24 (బి) కింద రూ. 2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. ఇది 2019తో పాటు ఆ తర్వాత రెండేళ్ల పాటు ఈ సదుపాయాన్ని అందించింది. కరోనా సమయమైన 2020, 2021లో అవకాశం కల్పించలేదు. 2022 తర్వాత దీన్ని పొడిగించలేదు. అయితే ఈ టాక్స్ బెనిఫిట్ ఉన్న సమయంలో చాలా మంది ఇంటి కొనుగోలు దారులకు మేలు జరిగినట్లు రియల్ ఎస్టేట్ నిపుణుల చెప్పడంతో.. మరోసారి ఈ ప్రయోజనాన్ని అందించాలని కేంద్రానికి సూచిస్తన్నారు.

ఈ క్రమంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సెక్షన్ 80EEA ప్రవేశపెట్టే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలిసారిగా ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ బెనిఫిట్ చాలా ప్రయోజనకరంగా మారుతుంది. ఇంటి కొనుగోలు చేసే వారికి అదనపు ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు అప్పుడు అవకాశం ఉంటుంది. అయితే సెక్షన్ 80EEA, సెక్షన్ 24 (బి) ఒకే సారి క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. మొదటిగా సెక్షన్ 24 (బి) క్లెయిమ్ చేసుకుని మిగిలిన వడ్డీపై సెక్షన్ 80ఈఈఏ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే రూ.3.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందే అవకాశం లభిస్తుంది. మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. ఇప్పుడు 80EEAను మళ్లీ తిరిగి తీసుకు వస్తుందని భావిస్తున్నారు. మరోసారి ఈ సెక్షన్ తీసుకొస్తే.. మార్చి 31, 2026 వరకు తీసుకునే లోన్లకు వర్తింపు జేసే అవకాశాలు ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ అందుబాటులోకి వస్తే.. సొంతింటి కలను నెరవేర్చుకునే వాళ్లకు ఎంతో అవకాశంగా మారుతుంది.