iDreamPost
android-app
ios-app

HYDలో నివసించే వారిపై మరో భారం.. భారీగా పెరగబోతున్న ఇంటి అద్దెలు!

మీరు హైదరాబాద్ లో నివసిస్తున్నారా? అయితే మీకు మరో భారం తప్పదు. హైదరాబాద్ మహానగరంలో ఇంటి అద్దెలు భారీగా పెరగబోతున్నాయి. సొంతిల్లు లేని వారికి ఇది మరింత భారంగా మారనుంది.

మీరు హైదరాబాద్ లో నివసిస్తున్నారా? అయితే మీకు మరో భారం తప్పదు. హైదరాబాద్ మహానగరంలో ఇంటి అద్దెలు భారీగా పెరగబోతున్నాయి. సొంతిల్లు లేని వారికి ఇది మరింత భారంగా మారనుంది.

HYDలో నివసించే వారిపై మరో భారం.. భారీగా పెరగబోతున్న ఇంటి అద్దెలు!

హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా అవతరిస్తున్నది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. అంతే కాదు హైదరాబాద్ నగరంలోని మౌళిక వసతులు నివాసయోగ్యానికి అనుకూలంగా ఉన్నాయి. ప్రపంచంలో నివాసయోగ్యానికి అనువైన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ కారణంతో హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. దేశం నలుమూలల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఈ కారణంతో ఇక్కడ ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. ఇల్లు కొనుక్కోవడం దేవుడెరుగు అద్దెకు ఉండడం కూడా కష్టమైపోతున్నది.

హైదరాబాద్ లో సొంతింట్లో నివసించే వారికంటే అద్దె ఇళ్లలో నివసించే వారే ఎక్కువ. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కొత్తగా బిల్డింగ్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ లక్షలాది మంది హైదరాబాద్ కు వలస వస్తుండడంతో సరిపోవడం లేదు. బ్యాంకులు విరివిగా లోన్స్ ఇవ్వటంతో మధ్య తరగతి వారు సైతం సొంతింటి కలలను నిజం చేసుకుంటున్నారు. అయినప్పటికీ హైదరాబాద్ మహానగరంలో అద్దెల పెరుగుదల మాత్రం ఆగటం లేదు. నానాటికి రెంట్లు పెరుగుతూ సామాన్యులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అరకొర జీతాలతో అద్దెలు కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేక నానా తిప్పలు పడుతున్నారు.

Rent Houses

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇంటి అద్దెలు భారీగా పెరగబోతున్నట్లు తెలుస్తున్నది. ఐటీ ప్రాంతాలైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో ఇంటి అద్దెలు పెరిగాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. 2024లో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో సగటు అద్దెలు 3 శాతం పెరిగాయి. హైదరాబాద్ లో నివసించే వారికి ఇది మరో భారం కానుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు ఇంటి అద్దెలు కూడా పెరిగితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే అని నిపుణులు వెల్లడిస్తున్నారు. డిమాండ్ కు తగ్గట్టుగా కొత్త హౌసింగ్ యూనిట్లు అందుబాటులోకి వస్తే తప్పా రెంట్లు తగ్గే పరిస్థితి కనబడం లేదు.