కేవలం రూ.6 లక్షలతో.. 60 గజాల ప్లేస్‌లో లగ్జరీ ఇల్లు కట్టుకోవచ్చంట

తక్కువ స్థలంలో.. అతి తక్కువ బడ్జెట్‌తో ఇంటి నిర్మాణం చేపట్టాలని కలలు కనే వారికి కొన్ని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు శుభవార్త చెబుతున్నాయి. ఆ వివరాలు..

తక్కువ స్థలంలో.. అతి తక్కువ బడ్జెట్‌తో ఇంటి నిర్మాణం చేపట్టాలని కలలు కనే వారికి కొన్ని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు శుభవార్త చెబుతున్నాయి. ఆ వివరాలు..

పుట్టిన ప్రతి మనిషికి ఉండే ముఖ్యమైన, సర్వసాధారణంగా ఉండే కోరికల్లో ముందు స్థానంలో ఉండేది సొంతిల్లు. ఇక ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా అనేక పథకాలు తీసుకువస్తున్నాయి. పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం హౌసింగ్‌ స్కీమ్‌లను అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక నేటి కాలంలో ఇంటి నిర్మాణం అనేది అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం కొనాలంటేనే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక అపార్ట్‌మెంట్స్‌లో ఇల్లు కొనాలన్నా.. రేటు చుక్కలను తాకుతుంది. ఈ క్రమంలో సొంతింటి నిర్మాణం కోసం కలలు కంటున్న వారికి శుభవార్త. కేవలం 6 లక్షల రూపాయలతో అది కూడా 60 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు అంటున్నారు కొన్ని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు. ఆ వివరాలు..

తక్కువ భూమిలో అత్యంత తక్కువ బడ్జెట్‌ అనగా కేవలం 10 లక్షల రూపాయల్లోపు ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికీ కొన్ని ప్రైవేట్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు శుభవార్త చెబుతున్నాయి. కేవలం 60 గజాలలో భూమిలో.. రూ.6 లక్షల బడ్జెట్‌తో లగ్జరీ ఇంటిని నిర్మించుకోవచ్చు అని చెబుతున్నారు. 60 గజాల స్థలంలో సింగిల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని సదరు కంపెనీలు చెబుతున్నాయి. అంతేకాక ఇంటికి ప్లాన్ ఇచ్చి ఆరు నెలల లోపే నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నాయి.

అయితే కేవలం 60 గజాల స్థలంలో ఇల్లు ఎలా కడతారని చాలా మందికి అనుమానం రావచ్చు. దీనిపై సదరు ప్రైవేట్‌ కంపెనీలు స్పందిస్తూ.. ఇది సాధ్యమే అని కాకపోతే.. ముందుగా ఇంటి నిర్మాణానికి కావాల్సిన పనులు అన్ని పూర్తి చేసుకోవాలని.. అలానే ప్లాన్ ప్రకారం మెటీరియల్ అంతా కొనుగోలు చేసి పెట్టుకోవాలి అని సూచిస్తున్నారు. అన్నీ సమకూర్చుకున్న తర్వాత ఇంటి నిర్మాణం ప్రారంభించి.. ఆరు నెలల్లోగా పూర్తి చేయవచ్చు అంటున్నారు. లోబడ్జెట్‌తో నిర్మించే ఈ ఇంటిని మూడు విధాలుగా కట్టవచ్చు అంటున్నారు. ఒకటి పిల్లర్లు లేకుండా, రెండోది సంచాలు పోసి, మూడోది డైరెక్ట్ రాయితో నిర్మాణం చేపట్టవచ్చు అంటున్నారు. ఇలా చేస్తేనే తక్కువ ఖర్చులో మనము ఇల్లు నిర్మించుకోవచ్చని అంటున్నారు.

అంతేకాక ఇదే 60 గజాల స్థలంలో కాస్త ఎక్కువ బడ్జెట్‌ పెడితే.. లగ్జీరి ఇంటిని నిర్మించుకోవచ్చు అంటున్నారు. ఇందులో భాగంగా పిల్లర్లతో పాటు పునాది వేసుకొని ఇనుముతో మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఇకపోతే ఈ 60 గజాల స్థలంలో కూడా డూప్లెక్స్ హౌస్‌ను కూడా నిర్మించవచ్చు అంటున్నారు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల యజమానులు. ఎలాగంటే కింద హాలు కిచెన్ పెట్టుకుని పైన బెడ్ రూమ్ నిర్మించుకుంచుకోవచ్చట. ఏది ఏమైనా తక్కువ స్థలంలో.. తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి.. ఇది శుభవార్తే అని చెప్పవచ్చు అంటున్నారు.

Show comments