Vinay Kola
Honda Unicorn: హోండా తన పాపులర్ బైక్ యూనికార్న్ ను అప్డేట్ చేసి లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది. కంపెనీ OBD-compliant వెర్షన్ లో దీన్ని లాంచ్ చేయనుంది.
Honda Unicorn: హోండా తన పాపులర్ బైక్ యూనికార్న్ ను అప్డేట్ చేసి లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది. కంపెనీ OBD-compliant వెర్షన్ లో దీన్ని లాంచ్ చేయనుంది.
Vinay Kola
దేశంలో ఎక్కువమంది వాహనదారులు ఇష్టపడి కొనుగోలు చేసే బైక్ బ్రాండ్లలో ‘హోండా’ కంపెనీ ముందు వరసలో ఉంటుంది. మార్కెట్లో వేరే గట్టి పోటీ ఇస్తూనే కొత్త బైకులను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా హోండా నుంచి వచ్చిన హోండా యూనికార్న్ కి మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ ఆకట్టుకునే బైక్ లలో ఇది కూడా ఒకటి. ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో ఎన్నో సంవత్సరాల నుంచి అద్భుతమైన ప్రజాదరణ పొందింది ఈ బైక్. ఇక ఈ నేపథ్యంలో హోండా కంపెనీ తన పాపులర్ బైక్ యూనికార్న్ ను అప్డేట్ చేసి లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ హోండా యూనికార్న్ బైక్ ప్రస్తుతం కేవలం ఒకే వేరియంట్లో మాత్రమే సేల్ అవుతుంది.
హోండా కంపెనీ OBD-compliant వెర్షన్ లో దీన్ని లాంచ్ చేయనుంది. దీని ధర మార్కెట్లో రూ. 1,09,800 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. ఇదిలా ఉంటే యూనికార్న్ బైకు మీద కంపెనీ ఏకంగా 10 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తోంది. ఇందులో మూడేళ్లు స్టాండర్డ్ వారంటీతో పాటు మరో ఏడేళ్లు ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా కంపెనీ ఇస్తుంది. ఈ కొత్త హోండా యూనికార్న్ బైక్ 160 సీసీ ఇంజిన్ ద్వారా 13.27 Bhp పవర్, 14.28 ఎన్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. దీని ఇంజిన్ వచ్చేసి 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగి ఉంటుంది. అలాగే ఈ బైక్ కిక్ స్టార్టర్, సెల్ఫ్ స్టార్టర్ ఆప్షన్ లతో వస్తుంది. ఈ బైక్ 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది.
ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్, వెనుక వైపు హైడ్రాలిక్ మోనోషాక్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. ప్రారంభ దశలో హోండా యునికార్న్ బైక్ ఓన్లీ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్ లలో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఆ తరువాత ఇది పెర్ల్ సైరన్ బ్లూ కలర్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక రాబోయే కొత్త యునికార్న్ లో ఇంకా మార్పులు జరగనున్నాయి. ఇక ఈ బైక్ ఎలాంటి అప్డేటెడ్ ఫీచర్లతో వస్తుందో చూడాలి. మరి త్వరలో త్వరలో రాబోయే ఈ సరికొత్త హోండా యూనికోర్న్ బైక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.