Tirupathi Rao
Big Craze For Honda Elevate: ప్రస్తుతం మార్కెట్ లో ఎస్ యూవీ అనగానే హోండా ఎలివేట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఆ కారుకు ఎందుకంత క్రేజ్ వచ్చిందో చూద్దాం.
Big Craze For Honda Elevate: ప్రస్తుతం మార్కెట్ లో ఎస్ యూవీ అనగానే హోండా ఎలివేట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఆ కారుకు ఎందుకంత క్రేజ్ వచ్చిందో చూద్దాం.
Tirupathi Rao
ప్రతి ఒక్కరు జీవితంలో తమకంటూ సొంత కారు ఉండాలని కలలు కంటారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడతారు కూడా. చాలామంది కారు కొనే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా వినిపించేది ఎలాంటి కారు కొనాలి? అయితే ఈ ప్రశ్నకు అంత తేలిగ్గా సమాధానం చెప్పలేం. కానీ, ఒక చిన్న క్లారిటీ ఇవ్వచ్చు. మీ అవసరాలకు తగినట్లు ఏ కారు కొనాలో డిసైడ్ అవ్వండి. అయితే చాలామంది సెడాన్, హ్యాచ్ బ్యాక్ కార్లు కొంటారు. కానీ, ఇంకొందరికి మాత్రం వారి అవసరాలకు తగినట్లు ఎస్ యూవీ కొనుక్కోవాల్సి వస్తుంది. Suvల్లో ప్రస్తుతం హోండా కంపెనీకి చెందిన ఎలివేట్ కారు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరి.. ఎలివేట్ ఫీచర్స్ ఏంటి? దాని ధర ఎంత? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం నగరాల్లో రోడ్ల మీద హోండా ఎలివేట్ కారు బాగా కనిపిస్తోంది. అలాగే మార్కెట్లో హోండా ఎలివేట్ కారుకు మంచి ఎలివేషన్స్ లభిస్తున్నాయి. ఈ హోండా ఎలివేట్ 5 సీటర్లో మొత్తం SV, V, VX, ZX అనే 4 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలివేట్ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 121 పీఎస్/145 ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ పరంగా ఇది పవర్ ఫుల్ ఇంజిన్ అనే చెప్పాలి. అయితే ఈ కారులో మీకు కేవలం పెట్రోల్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఇది ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే అందరూ ఫ్యూయల్ లో పెట్రోల్ ని ప్రిఫర్ చేయరు. కొందరు డీజిల్, సీఎన్జీ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ టాన్స్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇంక ధర విషయానికి వస్తే.. ఈ హోండా ఎలివేట్ బేస్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ.11 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే ఇందులో టాప్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ.16.20 లక్షల వరకు ఉంటుంది. ఈ హోండా ఎలివేట్ మైలేజ్ చూస్తే.. మాన్యువల్ వర్షన్ లో 15.31 కిలోమీటర్స్, ఆటోమేటిక్ వర్షన్ లో లీటరుకు 16.92 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఈ హోండా ఎలివేట్ లో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో రెండు డ్యూయల్ టోన్ కలర్స్, ఏడు సింగిల్ టోన్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్ యూవీ ఫీచర్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇందులో 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ తో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తోంది. వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 7 ఇంచెస్ సెమీ డ్రైవర్స్ డిస్ ప్లే, ఆటో మేటిక్ క్లయిమెట్ కంట్రోల్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, సన్ రూఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇంక సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, లేన్ వాచ్ అసిస్టెన్స్, స్టెబిలిటీ అసిస్టెన్స్, రేర్ పార్కింగ్ కెమెరా, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆటో హై బీమ్ అసిస్టెన్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఒక ప్రీమియం కారులో వినియోగదారులు కోరుకున్న దాదాపు అన్ని ఫీచర్స్, సీఫ్టే ఫీచర్స్ ఈ హోండా ఎలివేట్ లో ఉన్నాయి. నిజానికి ఆ ప్రైస్ రేంజ్ లో ఈ హోండా ఎలివేట్ ఇస్తున్న ఫీచర్స్ వల్లే మార్కెట్ లో ఈ కారు ఎక్కువ ఎలివేట్ అవుతోంది. అలాగే డిజైన్ పరంగా కూడా ఈ ఎలివేట్ కు చాలా మంచి మార్కులు పడుతున్నాయి. మరి.. ఈ హోండా ఎలివేట్ ఫీచర్స్, ధర విషయాల్లో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.